కారు అద్దాలపై కోడి గుడ్లు విసిరేసి దోపిడీలు చేస్తున్నారట!

రాత్రివేళల్లో డ్రైవ్ చేస్తున్నారా..? రోడ్డుపై వెళ్తున్నపప్పుడు ఉన్నట్టుండి హాఠాత్తుగా మీ కారుపై గుడ్డు (కోడిగుడ్డు) పడిందా..? అయితే, పారాహుషార్ మీరు దొపిడికి గురయ్యే ప్రమాదం ఉంది. ఏంటీ ఇదేదైనా రామ్ గోపాల్ వర్మ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలోని సీన్ అనుకుంటున్నారా..! కాదండి బాబు ఇది నిజం. నమ్మలేని నిజం.

నిర్మానుష్యంగా ఉండే రోడ్లపై కార్లలో ఒంటరిగా వెళ్తున్న వారిని సులువుగా దోచుకునేందుకు దొంగలు కొన్ని కొత్త స్కెచ్‌లు వేస్తున్నారు. అలాంటిదే ఈ గుడ్డు స్కెచ్ కూడా. రాత్రివేళల్లో కారులో వెళ్తున్నప్పుడు మీ కారు అద్దంపై కోడిగుడ్డి పడిందనుకోండి, మీరు కంగారు పడిపోయి కారు ఆపేటమో లదా వాషర్, వైపర్ ఆన్ చేయటమో చేయకండి. వీటిలో ఏ ఒక్కటి చేసిన అంతే సంగతులు. దుండగులు మిమ్మల్ని దోచుకోవటం ఖాయం.


కోడిగుడ్డు నీటిలో కలిసినప్పుడు పాలు మాదిరిగా చిక్కగా మారిపోయి రోడ్డు మీ దృష్టిని 92.5 శాతం వరకూ తగ్గించి వేస్తుంది. అంటే, గుడ్డు పడిన తర్వాత వైపర్ ఆన్ చేసి లేదా వాటర్ స్ప్రే చేసినా మీరు రోడ్డును సరిగ్గా చూడలేరన్నమాట. దీంతో మీరు కారును రోడ్డుపైనే ఆపివేయటం జరుగుతుంది. ఇదే అవకాశాన్ని అదునుగా తీసుకునే దుండగులు దోపిడికి దిగుతారు.

అనివార్య పరిస్థితుల్లో ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురు కావచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. కారుపై గుడ్డు పడినట్లయితే, కంగారు పడకుండా, వైపర్, వాషర్‌లను ఆన్ చేయకుండా ముందుకు సాగిపోయి, జన సంచారం ఎక్కువగా ఉన్న చోట కారును నిలిపి , అద్దాన్ని శుభ్రం చేసుకోవటం ఉత్తమం. అయితే, ఇంత వరకూ ఇలాంటి సంఘటనలు జరిగినట్లు ఎక్కడా ధాఖలాలు లేవు అయినప్పటికీ, మన జాగ్రత్తలో మనం ఉండటంలో తప్పు లేదు కదా..! మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Tuesday, April 17, 2012, 16:24 [IST]
English summary
If you are driving at night and eggs are thrown at your windscreen, do not stop to check the car, do not operate the wiper and do not spray any water because eggs mixed with water become milky and block your vision up to 92.5%. This is a new techniques used by Gangs (Tips Source: Facebook).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+