FASTag KYC ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. వెంటనే కేవైసీ పూర్తి చేయండి.. లేదంటే డీయాక్టివేట్ తప్పదు.!!
భారత్‌లో వాహనదారులందరూ తమ ఫాస్టాగ్(FASTag) కార్డులను వెంటనే KYC పూర్తి చేసుకోవాలని జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త ఆదేశాలు జారీ చేసింది. జనవరి 31లోగా ఈ అప్‌డేట్ పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. కాగా అప్‌డేట్ చేయని ఫాస్టాగ్ కార్డులు డీయాక్టివేట్ చేయబడతాయని కూడా తెలిపింది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
ఫాస్టాగ్ సిస్టమ్ గురించి చాలా మందికి ముఖ్యంగా వాహనదారులకు సుపరిచితం.. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన టోల్ బూత్‌ల్లో ఎక్కువగా ఫాస్టాగ్ ద్వారానే టోల్ ఫీజులను వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో 98 శాతం వాహనాలు ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నాయి. ఈ మేరకు దేశంలో ప్రస్తుతం 8 కోట్లకు పైగా ఫాస్టాగ్ కార్డులు పనిచేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫాస్టాగ్(FASTag KYC) సిస్టమ్ ద్వారా టోల్ బూత్‌ల వద్ద వాహనాలకు చాలా వరకు ట్రాఫిక్ సమస్య తగ్గింది. ఈ మేరకు టోల్ బూత్‌ల వద్ద టోల్ ఫీజులో వేగం పెంచడానికి, వాహనదారుల సమయాన్ని ఆదా చేయడానికి కేంద్రం ఫాస్టాగ్ కార్డులను తప్పనిసరి చేసింది. అయినప్పటికీ జాతీయ రహదారులపై కొన్ని టోల్ బూత్‌ల వద్ద ఆలస్యం జరుగుతోంది.
ఇందుకు కారణం కొన్ని వాహనాల డ్రైవర్లు రెండు, మూడు ఫాస్టాగ్ కార్డులను కొనుగోలు చేసి ఉంచుకోవడం, ప్రత్యామ్నాయంగా రీఛార్జ్ చేయడం లాంటివి చేస్తున్నారు. తద్వారా వాహనదారులు తమ వాహనం విండో స్క్రీన్‌పై ఫాస్టాగ్ కార్డును అతికించడం లేదు. ఇష్టానుసారంగా అతికించడం లేదంటే ఆ కార్డును మెషిన్ దగ్గర చూపించడానికి సమయం తీసుకుంటుండంతో టోల్ ఫీజ్ చెల్లించడానికి లేటవుతోంది.

ఈ జాప్యాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం, వాహనదారులందరూ తమ ఫాస్టాగ్ కార్డులను కేవైసీ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ప్రతి వాహనానికి ఒక ఫాస్టాగ్ కార్డు మాత్రమే జారీ అవుతుంది. తద్వారా టోల్ ఫీజు చెల్లింపుల విషయంలో జాప్యం లేకుండా, అక్రమాలు జరగకుండా ఉంటుంది.
ఈ మేరకు KYC అప్‌డేట్ లేని కార్డులను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయడం లేదా.. బ్లాక్‌లిస్ట్‌లో ఉంచడం చేస్తుంది. కాగా కొన్ని ఫాస్టాగ్ కార్డుల్లో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ.. వాటిని చాలా కాలంగా వినియోగించట్లేదని వెల్లడైంది. అంతే కాకుండా ఫాస్టాగ్ కార్డులను ఉపయోగించి కొన్ని వాహనాలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించడంతో కేవైసీ నిర్ణయం తీసుకుంది.

అందువల్ల, దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులు వెంటనే వారి ఫాస్టాగ్ KYC పూర్తి చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. జనవరి 31వ తేదీలోగా ఫాస్టాగ్ కార్డును అప్‌డేట్ చేసుకోవాలి.. అయితే ఫాస్టాగ్ కార్డును ఎలా అప్‌డేట్ చేసుకోవాలో ఇక్కడ మీకు తెలియజేస్తున్నాం. మీరు మీ చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ID కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, వీటిలో దేనినైనా సమర్పించి, మీ KYC ని పూర్తి చేసుకోవాలి.
ఆర్‌సీ, చిరునామా, గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను మీ వద్ద ఉంచుకోవాలి. మీ ఫాస్టాగ్ స్థితిని తెలుసుకోవాలనుకుంటే ఫాస్టాగ్ వెబ్‌సైట్(https://fastag.ihmcl)కి వెళ్లాలి. అక్కడ మీ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ లేదా ఓటీపీ నంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేసుకోవాలి. తర్వాత డ్యాష్‌బోర్డ్‌లోకి వెళ్లి 'మై ప్రొఫైల్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీ కేవైసీ స్టేటస్ వివరాలను తెలుసుకోవచ్చు.
ఒకవేళ కేవైసీ పూర్తి కాకపోయి ఉంటే అక్కడ అడిగిన వివరాలను సమర్పించి కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలి. లేదా మీరు మీ ఫాస్టాగ్ కార్డును కొనుగోలు చేసిన బ్యాంక్ యాప్ ద్వారా కూడా మీ కేవైసీని అప్‌డేట్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా వాహనదారులకు ఇప్పుడు ఫాస్టాగ్ తప్పనిసరి కావడంతో.. ప్రతి ఒక్కరూ ఇప్పుడు KYC చేసుకోవాలి.
ఒక వాహనానికి ఒకే ఫాస్టాగ్ ఉండాలన్న ఉద్దేశంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక వాహనానికి ఒకటి కంటే ఎక్కువ ఫాస్టాగ్‌లు ఉండటం, ఇంకా ఒకే ఫాస్టాగ్‌ను వేర్వేరు వాహనాలకు వినియోగించడం లాంటి చర్యలు రహదారుల సంస్థ దృష్టికి రావడంతో వీటికి చెక్ పెట్టేందుకు NHAI ఈ నిర్ణయం అమలు చేస్తోంది.


Click it and Unblock the Notifications








