పండుగ సీజన్‌లో కార్లు కొంటే నక్కతోక తోకినట్లే.. మళ్లీ ఇలాంటి ఆఫర్లు, డిస్కౌంట్లు, తక్కువ వడ్డీ రేట్లు ఉండవు!

ప్రతీ సంవత్సరం ఆఖరి 4 నెలల్లో కార్ల కంపెనీలకు పండగే అని చెప్పాలి. ఎందుకంటే దసరా (Dussehra) మొదలుకుని దీపావళి (Deepavali), ఏడాది చివర్లో క్రిస్మస్ (Christmas) ఆ తర్వాత సంక్రాతితో కొత్త ఏడాది ఆరంభం అవుతుంది. ఈ పండుగ సీజన్‌లో జనాలు భారీ సంఖ్యలో వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఆయుధ పూజతో వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించడం చేస్తుంటారు. దీనిని ఓ సెంటిమెంట్‌గా ప్రజలు పాటిస్తారు. అందువల్ల రాబోయే కొన్ని నెలల పాటు కొత్త వాహనాల అమ్మకాలు భారీ సంఖ్యలో ఉంటాయి. ఈ పండుగ సీజన్‌లో కార్లు కొనడం మంచిదా? కొత్త కార్లు లేదా అప్‌గ్రేడ్స్‌తో వచ్చిన కార్లను కొనడం వల్ల కలిగే లాభనష్టాలపై ఓ లుక్కేయండి..

ఈ పండుగ సీజన్‌లో చాలా మంది ఎక్కువగా కొత్త వాహనాల కొనుగోలుకే మొగ్గు చూపిస్తారు. కావున వీలైనంత వరకు అమ్మకాలను పెంచుకోవడానికి కార్ల కంపెనీలు ప్రతి సంవత్సరం ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటిస్తాయి. ఈ ఏడాది కూడా అన్ని కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను ప్రకటించాయి. సంవత్సరం మొత్తం ధరలతో పోల్చితే ఈ పండుగ సీజన్‌లో తక్కువ ధరలో కార్లను ఇంటికి తీసుకెళ్లవచ్చు.

Festive Season Car Buying Pros and Cons

పండుగ సీజన్‌లో కొత్త కారు కొనడం వల్ల మీకు చాలా డబ్బు ఆదా అవుతుంది. అదేవిధంగా ఈ సమయంలో చాలా కొత్త కార్లు లాంచ్ చేయబడతాయి. లాంచింగ్‌ ఆఫర్‌ కింద వీటికి స్వల్పకాలిక ఆఫర్లను కూడా ప్రకటిస్తాయి. ఇది కస్టమర్లకు కలిసి వస్తుంది. దీంతో కొత్త కార్లను సైతం తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. అదేవిధంగా పండుగ సీజన్‌లోనూ వెయిటింగ్‌ పీరియడ్‌ చాలా తక్కువ ఉంటుంది.

సకాలంలో కస్టమర్ కోరుకున్న సమయానికి కార్లను డెలివరీ చేసేందుకు తయారీ ప్లాంట్ల ఉత్పత్తి సామార్థ్యాన్ని కూడా పెంచుకుంటాయి. తద్వారా కారును త్వరగా డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది తమ కొత్త కారును మంచి రోజున డెలివరీ తీసుకోవాలని కోరుకుంటారు. అందుకు తగినట్లుగా కంపెనీలు కూడా స్పష్టమైన డెలివరీ తేదీని అందిస్తుంది. వీలైనంత ఎక్కువ మొత్తంలో కారు షోరూమ్స్‌ మెరుగైన ఫైనాన్సింగ్ ఆప్షన్స్‌ని కూడా అందిస్తాయి.

Festive Season Car Buying Pros and Cons

ఈ పండుగ సీజన్‌లో కొన్ని షోరూమ్స్‌ కారు లోన్స్‌పై వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉంది. అదేవిధంగా, కార్ల కంపెనీలు కస్టమర్ ప్రాధాన్యత ప్రకారం నెలవారీ ఈఎంఐలు, వాటి చెల్లింపు తేదీని కస్టమర్లకు నచ్చిన విధంగా సెట్ చేయడానికి ప్రయత్నిస్తాయి. పండుగ సీజన్‌లో కారు కొనడం కూడా కొన్ని సమస్యలకు దారితీస్తుంది. కారు కొనాలనే హడావుడిలో కారు కొంటే మీరు పొరపాటు చేసినట్లే అవుతుంది.

ఈ పండుగ సీజన్‌లో ముఖ్యంగా ఆఫర్లు చాలా తక్కువ రోజులు మాత్రమే అందుబాటులో ఉండటం మిమ్మల్ని కొంత ఆందోళనకు గురిచేస్తుంది. ఈ టెన్షన్‌లో మీరు కొనుగోలు చేస్తున్న కారును, అది మీకు ఎంతవరకు సరిపోతుందనే విషయాన్ని విశ్లేషించుకోలేకపోతారు. కంపెనీలు సైతం కార్ ఫ్యాక్టరీలలో వివిధ రకాల పరీక్షలు, తనిఖీలను చేస్తుంది. ఈ హడావిడిలో తక్కువ నాణ్యత గల కార్ల వల్ల ఏదో ఒక సందర్భంలో మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు.

ఎందుకంటే అవి హడావిడిగా తయారు చేయబడతాయి. అంతే కాకుండా కారును హడావుడిగా ట్రాన్స్‌పోర్ట్ చేసే క్రమంలో తెలియకుండానే కొన్ని పార్ట్స్‌ లేదా ఇంటర్నల్‌ డ్యామేజీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పండుగ సీజన్‌లో మీరు కొత్త కారు కొనాలని భావిస్తే దాని గురించి ముందుగానే అడిగి తెలుసుకోండి. మీరు కొనుగోలు చేస్తున్న కారు గురించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ విషయంలో అస్సలు ఆందోళన చెందకండి.

More from DriveSpark

Article Published On: Tuesday, October 8, 2024, 13:02 [IST]
English summary
Festive season car buying pros and cons check details in telugu
Read more on: #auto news #cars #diwali #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+