మీ కారు సువాసన వెదజల్లుతూ నీట్‌గా ఉండాలంటే ఈ ‘5' తప్పనిసరి.. ధర కేవలం రూ. 500 మాత్రమే.!!

కారు కొన్న తర్వాత దానిని సరిగా మెయింటెనెన్స్‌ చాలా ముఖ్యం. ప్రధానంగా కారును ఎల్లప్పుడూ ఆకర్షణీయంగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవడం. కారు క్యాబిన్‌ దుర్వాసన రాకుండా చూడటం. ఇందుకోసం రెగ్యులర్‌ వాష్‌ ఒక్కటే సరిపోదు. అందుకోసం మీ కారులో ఎల్లప్పుడూ కొన్ని టూల్స్‌ను ఉంచుకోవాలి. అయితే ఇది మళ్లీ అదనపు ఖర్చు అనుకుంటే పొరపాటే..

మీ కారు ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌ను నిత్యం తాజాగా, ఆకర్షణీయంగా ఉండేలా చేయడానికి మార్కెట్లో కొన్ని ఉపకరణాలు(Accessories) అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం మీరు వేల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం లేదు. కేవలం రూ. 500 కే మీరు మీ కారు కోసం సంబంధిత ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఆ ఐదు టూల్స్‌ గురించి మీ కోసం ఈ కథనంలో అందిస్తున్నాం.

Car-Perfume

కార్ పెర్ఫ్యూమ్: మీరు మీ బిజీ పనుల్లో ఎంత ఒత్తిడిలో ఉన్నా.. కారు ఎక్కగానే మీకు మంచి సువాసన వస్తే చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. కారు ఎక్కగానే ఏసీ ఆన్‌ చేసుకోవడం చాలా మందికి అలవాటు. ఈ క్రమంలో మీరు కారులో కార్‌ పర్ఫ్యూమ్‌(Car Perfume) ను పెట్టుకున్నట్లయితే.. మీకు మంచి డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ఇవి మార్కెట్‌లో రూ. 500 సరసమైన ధరలో లభిస్తాయి.

WD40: WD40 కిట్‌ అనేది కారుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించే మల్టీ-పర్సస్‌ లూబ్రికెంట్ అండ్‌ క్లీనర్(Multi Purpose Lubricant and Cleaner). ఇది బోల్ట్‌లను విప్పటానికి, తుప్పు పట్టకుండా చూడటానికి, వాటిలో తరచూ అంటుకునే దుమ్ము, ధూళిని తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా రూ. 500 లోపల లభిస్తుంది. ప్రతి కారు యజమాని వారి టూల్‌కిట్‌లో దీనిని తప్పక ఉండేలా చూసుకోవాలి.

Car-Fast-Charger

కార్ ఫాస్ట్ ఛార్జర్: కొంతమంది తరచూ ఫోన్‌ ఛార్జ్ చేయడం మర్చిపోతుంటారు. ఆఫీస్‌కు వెళ్తున్నప్పుడో లేదంటే దూర ప్రయాణాల్లో ఉన్నప్పుడో ఈ విషయం గుర్తొస్తుంటుంది. ఇందుకోసం మీరు కారులో Car Fast Chargerని కలిగి ఉండటం ద్వారా ఈ సమస్య ఉండదు. కారులోని సాధారణ కనెక్టర్ల ద్వారా మొబైల్‌ త్వరగా ఛార్జింగ్‌ ఎక్కదు. ఇందుకోసం మీరు మార్కెట్లో ఫాస్ట్ ఛార్జర్‌ని కేవలం రూ.500 ధరలో మాత్రమే కొనుగోలు చేయవచ్చు.

కార్ బిన్: లాంగ్‌ జర్నీస్‌లో చాలా మంది తినుబండారాలు, దుప్పట్లు, టవల్స్‌ లాంటివి తీసుకెళ్తుంటారు. వీటన్నిటనీ సీట్లపై పడేయడం ద్వారా కారు క్యాబిన్‌ అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. ఈ సమస్య పరిష్కారానికి మీరు కార్‌ బిన్‌ను ఉపయోగించవచ్చు. చిన్న చిన్న సామగ్రిని అందులో ఉంచడం ద్వారా కారు సీట్లు కూడా ఇరుకుగా అనిపించవు. శుభ్రంగా కనిపిస్తుంది. దీనిని డ్యాష్‌బోర్డ్‌ లేదా డోర్‌ పాకెట్‌లో పెట్టుకోవచ్చు. ధర రూయ 500 లోపల లభిస్తుంది.

Micro-Fiber-Cloth

మైక్రోఫైబర్ క్లాత్: మీ కారు ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌ను ఎల్లప్పుడూ శుభ్రంగగా ఉంచుకోవడానికి మరో ముఖ్యమైన సాధనం మైక్రోఫైబర్ క్లాత్. ఇది మీ కారు పై ఉన్న దుమ్ము, మురికిని ఎలాంటి ఒత్తిడి లేకుండా తొలగిస్తుంది. మైక్రో ఫైబర్‌ క్లాత్‌ కూడా రూ. 500 ధరలో అందుబాటులో ఉంటుంది. మరికొన్ని ప్రదేశాల్లో తక్కువ ధరలో కూడా లభిస్తుంది.

ఈ మైక్రో ఫైబర్‌ క్లాత్‌ను రీయూజ్‌ కూడా చేయవచ్చు. మురికిని తొలగించిన అనంతరం దీనిని వాష్‌ చేయవచ్చు. ఎకో ఫ్రెండ్లీగా ఉంటూ తక్కువ ధరలో లభిస్తుంది. మీ కారు ఇంటీరియర్‌ సువాసన వెదజల్లే పర్ఫ్యూమ్‌ నుంచి ఫోన్‌ ఛార్జింగ్, కార్‌ బిన్‌, కిట్‌, మైక్రో ఫైబర్‌ క్లాత్‌ వరకు ఈ చిన్న చిన్న టూల్స్‌ను మీరు సరసమైన ధరలో కొనుగోలు చేసి మీ కారులో ఉంచుకోవడం చాలా అవసరం.

More from DriveSpark

Article Published On: Wednesday, November 22, 2023, 9:05 [IST]
English summary
Five accessories to keep your car neat and clean perfume to bin cost under rs 500
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+