కారులో ఈ ఇంజన్ వార్నింగ్ సైన్స్ విస్మరిస్తే అంతే సంగతులు..

సాధారణంగా కారులో ఏదైనా సమస్య ఉంటే, డ్యాష్‌బోర్డులోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై సదరు సమస్యకు సంబంధించిన వార్నింగ్ సైన్ కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వార్నింగ్ సైన్స్‌ను విస్మరించి కారును ఎక్కువ సమయం నడిపితే, ఆ తర్వాత ఎదురయ్యే పరిమాణాలు చాలా తీవ్రంగా ఉండొచ్చు.

కారులో ఈ ఇంజన్ వార్నింగ్ సైన్స్ విస్మరిస్తే అంతే సంగతులు..

ప్రత్యేకించి ఇంజన్ విషయంలో కనిపించే ఇలాంటి వార్నింగ్ సైన్స్‌ని విస్మరిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు. సాధారణంగా ఇంజన్ ఫెయిల్యూర్‌కి సంబంధించిన ఐదు వార్నింగ్ సైన్స్ మరియు వాటికి సంబంధించిన వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి:

కారులో ఈ ఇంజన్ వార్నింగ్ సైన్స్ విస్మరిస్తే అంతే సంగతులు..

1. చెక్ ఇంజన్ లైట్

ప్రతి కారు డాష్‌బోర్డ్‌లోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై చెక్ ఇంజన్ లైట్ ఉంటుంది. కారు ఇంజన్‌లో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు లేదా ఇంజన్ యొక్క సాధారణ పనితీరును ప్రభావితం చేసే ఏదైనా భాగం లేదా సెన్సార్ పనిచేయనప్పుడు, డాష్‌బోర్డ్‌లో ఈ అలెర్ట్ వస్తుంది.

కారులో ఈ ఇంజన్ వార్నింగ్ సైన్స్ విస్మరిస్తే అంతే సంగతులు..

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఆధునిక కార్లు ఆన్‌బోర్డ్ డయాగ్నొస్టిక్ సెటప్‌ను కలిగి ఉంటాయి, ఇది రిపోర్టింగ్ సిస్టమ్‌గా కూడా పనిచేస్తుంది. కారు ఇంజన్‌లో చిన్న లేదా పెద్ద సమస్య ఉన్నప్పుడు, దాని సిస్టమ్ హెచ్చరిక సంకేతాన్ని ప్రేరేపిస్తుంది. అయితే, ఈ సమస్యను సరిచేయడానికి మీరు మీ కారును నిపుణుడిచే తనిఖీ చేయించడం మంచిది.

కారులో ఈ ఇంజన్ వార్నింగ్ సైన్స్ విస్మరిస్తే అంతే సంగతులు..

2. ఎగ్జాస్ట్ (సైలెన్సర్)లో తెల్లటి పొగ

సాధారణంగా శీతాకాలంలో కారు యొక్క సైలెన్సర్ నుండి చిన్నపాటి పొగ రావటం సర్వసాధారణం. అలాకాకుండా, ఒకవేళ మీ కారు సైలెన్సర్ నుండి నలుపు, నీలం లేదా మందపాటి తెల్ల పొగ వస్తున్నట్లయితే, మీరు మీ కారును నిపుణుల వద్దకు తీసుకెళ్లాలి. సైలెన్సర్ నుండి నల్ల పొగ రావటం అంటే ఇంజన్‌లో ఇంధన సరఫరా సరిగ్గా జరగడం లేదు లేదా అసురక్షిత ఇంధన మిశ్రమం ఇంజన్‌లోకి వెళుతోందని అర్థం.

కారులో ఈ ఇంజన్ వార్నింగ్ సైన్స్ విస్మరిస్తే అంతే సంగతులు..

సైలెన్సర్ నుండి బూడిద రంగు పొగ వస్తున్నట్లయితే పెట్రోల్ / డీజిల్ దహన గదిలోకి ప్రవేశిస్తుందని సూచిస్తుంది, ఇది కూడా సరైనది కాదు. అలా కాకుండా, సైలెన్సర్ నుండి మందపాటి తెల్ల పొగ వస్తున్నట్లయితే, ఇంధనంతో ఇంజన్ ఆయిల్ కలిసి కాలిపోవడాన్ని సూచిస్తుంది. ఈ సమస్యను వెంటనే టెక్నీషియన్లతో సరి చేయించుకోవాలి.

కారులో ఈ ఇంజన్ వార్నింగ్ సైన్స్ విస్మరిస్తే అంతే సంగతులు..

3. డ్రైవింగ్ చేసేటప్పుడు సమస్య

కారును డ్రైవ్ చేస్తున్నప్పుడు అది ఎప్పటిలా స్మూత్‌గా కాకుండా, రోడ్డుపై విచిత్రంగా ప్రవర్తిస్తుంటే అందులో ఏదో సమస్య ఉందని గుర్తించాలి. పికప్ తగ్గడం, ఇంజన్ ఎక్కువగా వైబ్రేట్ అవ్వటం, కారు ఆగుతూ ఆగుతూ ముందుకు పోవటం వంటి సమస్యలు ఉంటే, అవి ఇంజన్‌కు సంబంధించినవని గుర్తించాలి. ఇంధన లైన్ నింపడం, స్పార్క్ ప్లగ్ ఫౌల్స్, దెబ్బతిన్న ఇగ్నిషన్ కాయిల్స్ మరియు మురికి ఇంధనం / ఎయిర్ ఫిల్టర్లు వంటి లోపాలను వెంటనే సరిచేయించుకోవాలి.

కారులో ఈ ఇంజన్ వార్నింగ్ సైన్స్ విస్మరిస్తే అంతే సంగతులు..

4. తక్కువ మైలేజ్ మరియు కారు పనితీరు తగ్గడం

ఏ కారు విషయంలోనైనా కాలక్రమేణా దాని రెగ్యులర్ వేర్ అండ్ టేర్ కారణంగా, సదరు కారు యొక్క మైలేజ్ తగ్గడం లేదా దాని పనితీరు లోపించడం జరుగుతుంది. అయితే, కారు దాని శక్తిని చాలా తక్కువగా ఉపయోగిస్తుంటే లేదా మైలేజ్ బాగా తగ్గినట్లయితే, అప్పుడు సదరు కార్ ఇంజన్‌పై దృష్టి సారించడం అవసరమని గుర్తుంచుకోండి.

కారులో ఈ ఇంజన్ వార్నింగ్ సైన్స్ విస్మరిస్తే అంతే సంగతులు..

5. ఇంజన్ శబ్ధం

కారు ఇంజన్ సాధారణం కన్నా ఎక్కువ శబ్ధం చేస్తున్నట్లయితే, అందులో ఏదో పెద్ద సమస్య ఉందని అర్థం. సాధారణంగా గాలి-ఇంధనం యొక్క మిశ్రమం ఇగ్నిషన్ లేకుండా స్వతంత్రంగా మండించినప్పుడు కారు ఇంజన్ గట్టిగా శబ్ధం చేస్తుంది. కారు స్టార్ట్ చేసిన ప్రతిసారి ఇలాంటి శబ్ధం వస్తున్నట్లయితే, వెంటనే మీ కారును నిపుణుడి వద్దకు తీసుకెళ్లడం మంచిది.

Most Read Articles

English summary
Five Engine Warning Signs You Should Never Ignore, Details. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X