'హెల్మెట్' ధరిస్తారా లేకపోతే 'హెల్'ను 'మెట్' అవుతారా?
మానవ శరీరంలోని అతిముఖ్యమైన, అందమైన భాగాల్లో తల/ముఖం కూడా ఒకటి. మామూలుగా మన ముఖంపై ఏదైనా చిన్న గాయమైతే విలవిలలాడిపోతాం. కానీ అదే ముఖం యాక్సిడెంట్‌లో చిద్రమైపోతే.. ఊహించుకోవటానికే భయంకరంగా ఉంది కదూ..! కానీ ఇది వాస్తవం.. హెల్మెట్ ధరించని వారు, తమ టైం బాగోలేకపోతే ఎదో ఒక సందర్భంలో ఇలాంటి పరిస్థిని ఎదుర్కోక తప్పదు.
మనదేశంలో ద్విచక్ర వాహనాలను వినియోగించే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో, హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపే మోటారిస్టులు కూడా అంతే సంఖ్యలో పెరిగిపోతున్నారు. ఫలితంగా, హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలను నడుపుతూ, ప్రాణాలు కోల్పోతున్న వారు/క్షతగాత్రులు అవుతున్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది.
ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నపు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. కేవలం మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కోసమో లేక పోలీసులు వేసే జరిమానా నుంచి తప్పించుకోవటం కోసమో హెల్మెట్‌ను ధరించడం కాకుండా మన భద్రత కోసం, మనపై ఆధారపడి ఉన్న వారి కోసం హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలి. వాస్తవానికి హెల్మెట్ ధరించడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. అవేంటే ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

హెల్మెట్ ధరించడం వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు మరియు వాటి నుంచి తప్పించుకునే చిట్కాలకు సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాలను తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

స్టైల్స్
హెల్మెట్ ధరించడం సేఫ్టీ లభించడంతో పాటుగా, ద్విచక్ర వాహనం నడిపే వారు స్టైల్‌గా కూడా కనిపిస్తారు. సాధారణంగా, హెల్మెట్లు మూడు స్టైల్స్‌లో (ఓపెన్ ఫేస్, ఫ్లిప్ అప్ లేదా మాడ్యులర్ మరియు ఫుల్ ఫేస్) లభిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కంపెనీలు వివిధ స్టయిల్స్, డిజైన్స్, గ్రాఫిక్స్‌తో కూడిన హెల్మెట్లను ఆఫర్ చేస్తున్నాయి.

ఓపెన్ ఫేస్ హెల్మెట్స్
ఫుల్ ఫేస్ హెల్మెట్ కన్నా ఓపెన్ ఫేస్ హెల్మెట్‌లను మరింత చల్లగా అనిపిస్తుంది. అంతేకాకుండా, ఓపెన్ ఫేస్ హెల్మెట్ల విజిబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. స్టైల్ విషయంలోను ఇది నెంబర్ వన్‌గా ఉంటుంది. కానీ సేఫ్టీ విషయంలో చివరి నుంచి నెంబర్ వన్‌గా ఉంటుంది. ఫుల్ ఫేస్ హెల్మెట్ ద్వారా లభించే సేఫ్టీ ఈ ఓపెన్ ఫేస్ హెల్మెట్ నుంచి లభించదని గుర్తుంచుకోండి. కానీ, గుడ్డిలో మెల్ల అన్న చందంగా, అసలు హెల్మెట్ ధరించకపోవటం కన్నా ఏదో ఒకటి ధరించడం మేలే కదా..!

ఫ్లిప్-అప్/మాడ్యులర్ హెల్మెట్స్
ఇవి చాలా విశిష్టమైన హెల్మెట్స్. ఈ ఫ్లిప్-అప్/మాడ్యులర్ హెల్మెట్స్ ఇటు ఫుల్ ఫేస్ హెల్మెట్‌లోని సేఫ్టీ అటు ఓపెన్ ఫేస్ హెల్మెట్‌లోని స్టయిల్‌ను ఆఫర్ చేస్తాయి. అయితే, ఈ హెల్మెట్ల విషయంలో విభిన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ప్రమాదం జరిగి టూవీలర్ నుండి క్రింద పడిపోయినప్పుడు ఈ హెల్మెట్ ఫ్లిప్-అప్ సేఫ్టీ తగ్గే ప్రమాదం ఉంటుందని కొందరు భావిస్తుంటే, మరికొందరు వీటిని ధరించడం రెగ్యులర్ హెల్మెట్లను ధరించడం కన్నా సేఫ్‌గా ఉంటుందని భావిస్తుంటారు.

ఫుల్ ఫేస్ హెల్మెట్
మెజారిటీ టూవీలర్ రైడర్లు ఎక్కువగా ఉపయోగించేది ఈ ఫుల్ ఫేస్ హెల్మెట్లనే. సేఫ్టీ విషయంలో వీటిని మించిన హెల్మెట్లు ఉండవు. వీటిని వలన సేఫ్టీతో పాటుగా కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేటంటే.. వీటిని వలన తలకు, మెడ భాగానికి రక్షణ లభించడంతో పాటుగా, దుమ్ము, ధూళి, కీటకాలు, ఇతర వాహనాల వేగానికి ఎగిరిపడే చిన్న చిన్న రాళ్ల నుంచి రక్షణ కల్పించడంతో పాటుగా మంచి సౌండ్ ఇన్సులేషన్‌ను కలిగి ఉండి, ధ్వని కాలుష్యం వలన కలిగే నష్టం నుండి కాపాడుతాయి. అంతేకాకుండా, శీతాకాలంలో వీటిని ధరించడం వలన వెచ్చగా కూడా ఉంటుంది.

ప్రభావిత ప్రాంతాలు
కీలక గణాంకాలు లభించే అమెరికాలో, అన్ని హెల్మెట్ సంబంధిత ప్రమాదాల్లో దాదాపు 60 శాతం గడ్డం వద్ద ఎక్కువగా ప్రభావం ఉన్నట్లు తేలింది. ఫుల్ ఫేస్ హెల్మెట్ యొక్క ప్రభావిత ప్రాంతాలను ఈ ఫొటోలో చూడొచ్చు. భారతీయ గణాంకాలకు, ఈ గణాంకాలు పెద్ద దూరమేమీ లేదు. ఫుల్ ఫేస్ హెల్మెట్ ధరించడం వలన మీరు పూర్తి ముఖం సురక్షితంగా ఉంటుందని మాత్రం ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఫుల్ ఫేస్ హెల్మెట్ దుష్ప్రయోజనాలు
ఫుల్ ఫేస్ హెల్మెట్ వలన ప్రయోజనాలతో పాటు కొన్ని దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటంటే.. వేసవిలో వీటిని ధరించడం వలన చాలా వేడిగా అనిపిస్తుంది (హెల్మెట్ లోపల స్కార్ప్/రుమాలు ఉంచి ధరించడం ఉత్తమం). అలాగే, శీతాకాలం లేదా పొగమంచుతో కూడిన వాతావరణంలో రైడ్ చేస్తున్నప్పుడు విజర్‌పై ఆవిరి (మిస్ట్) పట్టి విజబిలిటీని తగ్గిస్తుంది. ఇందుకు చక్కటి పరిష్కారం ఏంటంటే, హెల్మెట్ విజర్ లోపలి భాగాన్ని షేవింగ్ ఫోమ్‌తో లేదా షాంపూతో తుడవటమే. వెంటిలేషన్ ఉండే హెల్మెట్లను కొనుగోలు చేయటం కూడా మంచిదే.

చివరిమాట
మీ టూవీలర్ రైడ్ సాఫీగా, సురక్షితంగా సాగిపోవాలంటే మీరు హల్మెట్ ధరించడం తప్పనిసరి. ఎవరికోసమో కాకుండా మీ భత్రత కోసం, మీ రాక కోసం ఇంటి వద్ద ఆశగా ఎదురుగా చూసే మీ ఆప్తుల కోసం హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి. ఇతర హెల్మెట్ల కన్నా ఫుల్ ఫేస్ హెల్మెట్లను ధరించడమే సురక్షితం. హెల్మెట్ ధరించిన తర్వాత, దాని బెల్ట్‌ను లాక్ చేయటం మర్చిపోకండి. హ్యాపీ జర్నీ..!
వీడియో
హెల్మెట్ ధరించకపోవటం వలన కలిగే నష్టాలను దృశ్య రూపంలో వివరిస్తూ, అందరినీ ఆలోచింపజేసే ఓ వీడియోని ఈ స్లైడ్‌లో వీక్షించండి.
వీడియో
ఇదివరకటి స్లైడ్‌లో హెల్మెట్‌కు సంబంధించి ఓ సీరియస్ వీడియోని చూశారు కదా.. ఇప్పుడు ఈ వీడియోలో హెల్మెట్‌కు సంబంధించి ఆలోచింపజేసే ఓ ఫన్నీ వీడియోని కూడా చూడండి..!
తర్వాతి స్లైడ్‌లో హెల్మెట్ ధరిస్తేనే బైక్ స్టార్ట్ అయ్యే టెక్నాలజీ గురించి తెలుసుకోండి.
హెల్మెట్ ధరిస్తేనే బైక్ స్టార్ అవుతుంది, ఇదెట్టా సాధ్యం?
తెలుసుకోవటం కోసం పై లింక్ క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications








