మీ ట్రైన్ టికెట్‌పై జెండర్ తప్పుగా చూపిస్తుందా.??.. ఇలా చేస్తే మీకు టీటీఈతో సమస్య ఉండదు.!!
స్మార్ట్‌ఫోన్ చేతిలోకి వచ్చాక ఇప్పుడు ప్రతి పనీ చాలు సులువవుతోంది. బైక్ ట్యాక్సీ బుకింగ్ నుంచి ఫ్లైట్ టికెట్ బుకింగ్ వరకూ ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. ముఖ్యంగా రైలు ప్రయాణానికి సంబంధించి జనరల్ బోగీలు మినహా.. మిగత కోచ్‌లన్నిటిలోనూ ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కొందరు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.
IRCTC వెబ్‌సైట్ ద్వారా ప్రయాణికులు తమ రైల్వే టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. అయితే కొందరు సీటు రిజర్వేషన్ చేసుకునే సమయంలో పొరపాటుగా జెండర్(లింగం)ను తప్పుగా ఎంచుకుంటున్నారని రైల్వే అధికారుల దృష్టికి వచ్చింది. దీని ద్వారా టికెట్‌పై కూడా తప్పుగానే చూపిస్తుంది. అయితే మీ టికెట్ బుక్ అయినా.. జెండర్‌ను మార్చుకోవచ్చని చెబుతున్నారు అధికారులు.. అదెలా అంటే..

దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వేలాది రైళ్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. రోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైల్వే సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే వీరిలో ఎక్కువగా.. రిజర్వేషన్ సౌకర్యం ఉండే కోచ్‌లలో సీట్లు బుక్ చేసుకుని ప్రయాణిస్తుంటారు. IRCTC ద్వారా ట్రైన్ టికెట్(Train Ticket Booking) రిజర్వేషన్ చేసుకోవచ్చు.
కాగా ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే క్రమంలో చాలా మంది ముందుగా రిజిస్టర్ చేసుకున్న వ్యక్తులు చేసే అతి పెద్ద తప్పు ప్రయాణీకుల లింగాన్ని(Gender Change On Train Ticket) ఎంచుకోవడం అని IRCTC అధికారి ఒకరు తెలిపారు. ముఖ్యంగా తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో హడావుడిలో తొందరపడి జెండర్‌ను తప్పుగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇది తర్వాత వారికి సమస్యగా మారుతోంది.

అయితే, బుక్ అయిన టిక్కెట్లలో జెండర్(IRCTC Train Ticket Reservation) మార్చడం సాధ్యమేనా అనే సందేహం మీకు రావచ్చు. రైలు టికెట్‌లో జెండర్ సరిపోలడం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. అయితే ఒకవేళ లింగాన్ని తప్పుగా ఎంపిక చేస్తే టికెట్ కూడా రాకుండా పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ తప్పులు సాధారణంగా గ్రూప్ టికెట్స్ బుక్ చేసే క్రమంలో జరుగుతాయి.
కానీ ఈ ప్రాసెస్ ద్వారా మీరు మీ టికెట్‌పై జెండర్‌ను సరిచేసుకుని రైలు ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్‌ను బుక్ చేస్తున్నప్పుడు పొరపాటుగా మీరు తప్పు జెండర్ ఎంచుకున్నట్లయితే.. మీరు వెంటనే చేయవలసింది ఏమిటంటే, టికెట్ ప్రింటవుట్ తీసుకొని ఎవరి పేరు దగ్గర జెండర్ తప్పుగా పడిందో గుర్తించాలి. వారు తమ జాతీయ గుర్తింపు కార్డుతో పాటు సమీపంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లాలి.
సరైన లింగాన్ని గుర్తించడానికి తగిన వ్యక్తి జాతీయ గుర్తింపు కార్డుతో వెళితే, రిజర్వేషన్ కౌంటర్‌లో లోపం ఉందని క్లెయిమ్ చేసి, వారు దాన్ని తనిఖీ చేస్తారు. లింగ మార్పు టిక్కెట్‌పై వ్రాసి చూపించి, మీరు ఉన్నట్లు నిర్ధారించుకోవాలి. తద్వారా వారు సరైన జెండర్‌తో టికెట్‌ను కేటాయిస్తారు.
ఇందుకోసం రైల్వే యంత్రాంగం ఎలాంటి రుసుమును వసూలు చేయదు. అయితే మీరు దీన్ని ఆన్‌లైన్‌లో మార్చడానికి ఎటువంటి ఆప్షన్ లేదు. కావున మీకు ఇలాంటి పరిస్థితి తలెత్తితే తగిన డాక్యుమెంట్లు ఆధార్, పాన్, ఓటర్ ఐడీ ఇలా ఏదైనా ప్రూఫ్‌ను రైల్వే అధికారులకు చూపించి మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
కాబట్టి ప్రయాణికులు రైలు టిక్కెట్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసేటప్పుడు జాగ్రత్తగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు తప్పు బుకింగ్ చేస్తే, మీరు వెంటనే సమీపంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లి బుకింగ్ కౌంటర్‌లో మీ తప్పును నివేదించి, మార్పులు చేయించాలి. లేని పక్షంలో జరిమానా విధించే పూర్తి అధికారం టిక్కెట్ ఎగ్జామినర్‌కు ఉంటుందని గమనించాలి.


Click it and Unblock the Notifications








