మీ కారును త్వరగా షెడ్డుకు పంపించే చెడు డ్రైవింగ్‌ అలవాట్లు ఇవే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.!!

డ్రైవింగ్‌ అంటే చాలా మంది ప్యాషన్‌.. ఏ ట్రాఫిక్‌ ఇబ్బందీ లేకుండా కారులో అలా ఆగకుండా వెళ్లిపోతూ ఉండాలని చాలా మంది అనుకుంటారు. అయితే ఇది మీకు మంచి థ్రిల్‌, ఫీల్‌ గుడ్‌ను ఇస్తుండొచ్చు. కానీ దీని ద్వారా మీ వాహనం దెబ్బతింటుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా.. అవును కొన్ని డ్రైవింగ్‌ అలవాట్ల కారణంగా మీ కారు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..

లక్షల రూపాయలు ఖర్చు చేసి మీకు నచ్చిన వాహనాన్ని ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తారు. అంతే కాకుండా దాన్ని ఎంతో అపురూపంగా కూడా చూసుకుని ఉంటారు. కానీ మీకు తెలియకుండానే కొన్ని పనుల వల్ల కారు త్వరగా రిపేర్ల(Car Maintenance Tips)కు గురయ్యే అవకాశం ఉంది. ఆ సమస్య రాకుండా ఉండాలంటే ఈ టిప్స్‌ పాటించాలి..

Car-Driving-Habits

కొత్త కారును కొన్న తర్వాత ఫ్రీ సర్వీస్‌ ముగిసే వరకు మీకు కంపెనీ నుంచి మంచి సర్వీస్‌ లభిస్తుంది. అయితే సర్వీస్‌ ఛైన్‌ నుంచి ఫోన్‌ కాల్స్‌ ముగిసిన తర్వాత కారు మెయింటెనెన్స్‌ అనేది మీకు కష్టంగా మారుతుంది. ఈ క్రమంలో మీరు కారులో సమస్య ఎదురైనప్పుడు మాత్రమే మీరు సర్వీస్‌ సెంటర్‌ను ఆశ్రయిస్తారు. దీని ద్వారా మీకు తెలియకుండానే కారుకు సంబంధించి అనేక ప్రాబ్లమ్స్‌ వస్తుంటాయి.

కారు మెయింటెనెన్స్‌(Car Maintenance): మీరు కారును వాడుతున్నప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం.. కారు మైలేజ్‌ గురించి. ఇందుకు సంబంధించి సదరు కంపెనీ మీకు సూచనలతో కూడిన సేవా పుస్తకం ఇస్తుంది. అందులో సూచించిన మాదిరిగా మీరు కారును మెయింటెన్‌ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతి 5000 కి.మీకి ఒకసారి ఆయిల్‌, బ్రేక్‌ ఫ్లూయిడ్‌, కూలెంట్‌ మొదలైన వాటిని తనిఖీ చేసుకోవాలి.

Car-Driving-Habits

కార్‌ వాష్‌(Car Wash): మీరు కారును క్రమం తప్పకుండా రెగ్యులర్‌గా వాష్‌ చేస్తున్నా.. అప్పుడప్పుడూ ప్రొఫెషనల్‌ ద్వారా కార్‌ వాష్‌ చేయించాలి. సినిమాల్లో మాదిరిగా స్టంట్స్‌ అస్సలు చేయకూడదు. ఒక చేత్తో కారు నడపడం, క్లచ్‌ను పట్టుకోవడం, గేర్లు మార్చడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. దీని ద్వారా మీరు మీ సొంత కారును డ్యామేజ్‌ చేసుకున్నట్లే..

గేర్‌బాక్స్‌(Gear Box): డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు తరచూ మీ చేతిని క్లచ్‌, గేర్‌పై ఉంచకూడదు దీని ద్వారా ట్రాన్స్‌మిషన్‌పై అనవసరమైన ఒత్తిడి పెరిగి గేర్‌షిఫ్ట్‌లపై ప్రభావాన్ని చూపిస్తుంది. క్రమంగా గేర్‌బాక్స్‌ భాగాలు విఫలమయ్యే ప్రమాదం ఉంది. క్లచ్‌ పెడల్‌పై కూడా ఒత్తిడి పడేలా కాలును ఉంచకూడదు. అవసరమైన సందర్భాల్లో మాత్రమే వీటిని ఉపయోగించాలి.

Car-Driving-Habits

ఇంజిన్‌(Engine): ఒకవేళ మీరు చాలా గ్యాప్‌ తర్వాత కారును స్టార్ట్‌ చేస్తున్నట్లయితే.. స్టార్ట్‌ చేసే సమయంలో ముందుగా ఓ విషయం గుర్తుంచుకోవాలి. స్టార్ట్‌ చేసే సమయంలో ఇంజిన్‌ లోపల ఆయిల్‌ వ్యాప్తి చెందేలా చూడాలి. దీని ద్వారా కారులోని సెన్సార్లతో పాటు ఇతర భాగాలకు నష్టం కలగకుండా ఉంటుంది.

ఫ్యూయెల్‌(Fuel Maintenance): కారు యజమానులు మైలేజ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్యూయెల్ మెయింటెనెన్స్‌ అనేది చాలా ముఖ్యం. లాంగ్‌ జర్నీలు చేసేటప్పుడు ఫుల్‌ ట్యాంక్‌ ఉండేలా చూసుకోవాలి. ట్యాంక్‌లో ఇంధనం తక్కువగా ఉన్నట్లయితే వేడి ద్వారా ఆవిరి ఏర్పడి ఫ్యూయెల్‌లో నీరు చేరే అవకాశం ఉంటుంది. ఇలా జరిగితే ఫ్యూయెల్‌ ఇంజక్షన్‌ సిస్టమ్‌ దెబ్బతినే ప్రమాదం ఉంది.

Car-Driving-Habits

బ్రేకింగ్‌(Braking): కారు నడిపేటప్పుడు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన ఇంజిన్‌ బ్రేకింగ్.. అత్యవసర పరిస్థితుల్లో వేగాన్ని తగ్గించడానికి లేదంటే ఆపడానికి బ్రేకులు ఉపయోగిస్తారు. కానీ అనవసర సందర్భాల్లో బ్రేకులను ఉపయోగించడం వల్ల బ్రేక్‌ ప్యాడ్‌ల జీవితకాలం తగ్గిపోతుంది. అంతేకాకుండా బ్రేక్‌లు వేడెక్కడం వల్ల యాక్సిడెంట్లు జరిగే అవకాశం కూడా ఉంది.

Car-Driving-Habits

ముఖ్యంగా వాహనం కదులుతున్నప్పుడు హ్యాండ్‌బ్రేక్‌ను ఉపయోగించకూడదు. దీని ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కారు ఆపిన తర్వాత మాత్రమే హ్యాండ్‌ బ్రేక్‌ వేయాలి. ఇలా పైన పేర్కొన్న అంశాలను పాటించడం ద్వారా మీ కారులో తరచూ సమస్యలు ఏర్పడకుండా ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Sunday, December 24, 2023, 11:00 [IST]
English summary
Good driving habits that protect your car life check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+