తప్పుడు ఛలాన్ వచ్చిందా..? మరి దీనికి పరిష్కారం ఎంటి..?

ప్రస్తుతం అందుబాటులోకి వచ్చి సిసిటివి కెమరాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అధికారులు వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, నిబంధనలు ఉల్లంఘించిన తేదీ, సమయం, స్థలం వంటి విషయాలను నమోదు చేసుకుని ఛలాన్‌ను పంపించడం జరుగుతుంది. అయినప్పటికీ, కొన్నిసార్లు, వివిధ సందర్భాల్లో తప్పుడు ఛలాన్‌లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సందర్భాలు క్రింది విధంగా ఉండే అవకాశం ఉంది.
* కొన్ని సందర్భాల్లో వేగంగా వెళ్తున్న వాహన రిజిస్ట్రేషన్‌ను నమోదు చేయడంలో ట్రాఫిక్ పోలీసుల దృష్టి లోపం వలన తప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు కావడం.
* మీ వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌ను వేరొకరు తనపై వాహనంపై ఉపయోగించుకొని ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడటం.
* ఒకవేళ మీరు మీ వాహనాన్ని ఇతరులకు అమ్మివేసిన తర్వాత, సదరు వ్యక్తి వాహన యాజమాన్యాన్ని తన పేరుకు మార్చుకోకుండా, పాత యజమాని పేరుతోనే వాహనాన్ని ఉపయోగిస్తుండటం.
* ట్రాఫిక్ అధికారుల డేటాబేస్‌లో తప్పిదాలు వంటి వివిధ కారణాల వల్ల తప్పుడు ఛలాన్‌లు వచ్చే ఆస్కారం ఉంది.
ఇలాంటి సందర్భాల్లో వివరణ కోరుతూ మీరు ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించవచ్చు. టెలిఫోన్ ద్వారా లేదా లెటర్ ద్వారా మీ నగరంలోని ట్రాఫిక్ డిపార్ట్‌ను సంప్రదించడం ద్వారా ఛలాన్‌కు సంబంధించిన వివరాలను, వివరణలను తెలుసుకోవచ్చు. ఉదాహరణకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి జారీ చేసిన ఛలాన్ వివరాల గురించి క్రింది చిరునామాపై ట్రాఫిక్ విభాగాన్ని సంప్రదించవచ్చు. మీరు పంపించే లేఖలో మీ మొబైల్ ఫోన్ నెంబర్ లేదా ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్‌ను నమోదు చేయడం ఉత్తమం.
Asst Commissioner of police, Admn, (9490616098)
Traffic Branch, Police Control Room,
Opp: Public Garden, Nampally,
Hyderabad.
Content Source: HTP


Click it and Unblock the Notifications








