కారు డోర్ తెరిచేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలని మీకు తెలుసా.. లేదంటే రిస్క్ తప్పదు.!!
మీకు తెలుసా కారు డోర్ ఎలా తెరవాలో చాలా మందికి సరిగ్గా తెలియదని.. కారు డోర్ సక్రమంగా తెరవడానికి కూడా కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటి ద్వారా డోర్లు త్వరగా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి.
కారు ఎక్కిన ప్రతి ఒక్కరికీ కారు డ్రైవింగ్ తెలియాల్సిన అవసరం లేదు. కానీ కారు ఎక్కేటప్పుడు మాత్రం డోర్ ఎలా తీయాలి.. ఎలా కూర్చోవాలి అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. కారు డోర్ తీయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయని మీకు తెలుసా.. వాటిని పాటించకపోతే.. భవిష్యత్తులో చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుుంది.

అదేంటీ.. కారు డోర్ తీయడానికి కూడా నిబంధనలు ఉన్నాయా అని మీరు నవ్వుకుంటున్నారేమో.. ఇది కూడా ఓ సమస్యేనా అని అనుకుంటున్నారేమో.. నిజమేనండీ.. మీరు కారు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు డోర్ తీసి మూసే సందర్భంలో కొన్ని చిట్కాలు ఖచ్చితంగా పాటించాలి. అవేంటంటే..
సాధారణంగా, ఒక కారులో నలుగురు ప్రయాణికులు ఉంటే, ప్రతి నలుగురు ప్రయాణికులకు సెపరేట్‌గా డోర్లు ఉంటాయి. ఆ డోర్ల ద్వారా మాత్రమే మీరు లోపలికి వెళ్లడం బయటికి రావడం రావాల్సి ఉంటుంది. అయితే కారు దిగేముందు చాలా మంది చేసే పొరపాటు కారు డోర్ దగ్గర చేయి పెట్టి కారు డోర్ తెరుస్తారు. ఇది చాలా మందికి అలవాటు. కానీ ఇలా చేయకూడదు.

మీరు కారు డోర్‌ను తెరిచేటప్పుడు, డోర్ దగ్గర చేయి కాకుండా మరో చేతిని ఉపయోగించాలి. అప్పుడే మీరు కారు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు సురక్షితంగా ఉంటుంది. దీన్ని బట్టి డ్రైవర్ సీటు లేదా డ్రైవర్ సీటు వెనుక ఉన్నవారు తమ ఎడమ చేతిని ఉపయోగించాలి. ఇంకా ముందు ప్రయాణీకుల సీటు, దాని వెనుక కూర్చున్న ప్రయాణీకుడు కారు డోర్ తెరవడానికి తమ కుడి చేతిని ఉపయోగించాలి.
అయితే మీకు డౌట్ రావచ్చు.. ఇలా కారు డోర్ తెరిచేటప్పుడు చేతులను సరిగ్గా ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు ఏమిటి అని.. ఇలా మరో చేతిని ఉపయోగించడం ద్వారా కారు డోర్‌ను సురక్షితంగా తెరవవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయట. మీరు మరొక చేత్తో కారు డోర్‌ను తెరిచేటప్పుడు మీరు మీ శరీరాన్ని కొద్దిగా వంచాల్సి ఉంటుంది.

ఆ సమయంలో మీ కన్ను ఆటోమేటిక్‌గా కారు ORVM వైపు దృష్టి సారిస్తుంది. దీని ద్వారా ఎవరైనా కారు వెనుక నుంచి వస్తున్నా లేదా మరో వాహనం వెనుక వస్తున్నా వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా, ఎవరైనా లోపలికి వస్తున్నారని మీరు భావిస్తే, మీరు వెంటనే డోర్ తెరవకుండా ఆపవచ్చు.
అంతే కాకుండా ఈ చిట్కాను పాటించడం ద్వారా మీకు ఇంకో లాభం కూడా ఉంటుంది. మీరు కారు డోర్‌ను తెరవడానికి మరో చేతిని ఉపయోగించడం ద్వారా.. మీరు ఎక్కువ పుష్ ఫోర్స్‌ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. దీని ద్వారా కారు డోర్ నెమ్మదిగా తెరుచుకుంటుంది. తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది.
సాధారణంగా మీరు డోర్ పక్కన చేతితో డోర్‌ను తెరవడం ద్వారా డోర్‌పై ఎక్కువ ప్రెజర్‌ను పడుతుంది. దీని డోర్ ఓపెనింగ్ ఏరియాపై ఎక్కువ అరుగుదల ఏర్పడుతుంది. అందుకే మరో చేతిని ఉపయోగించడం ద్వారా డోర్‌లో వేర్ తగ్గుతుంది. దీని ద్వారా కారు మెయింటెనెన్స్ ఖర్చు కూడా తగ్గుతుంది. దీనిని క్రమంగా పాటించడం ద్వారా మీ కారు ఎక్కువ కాలం సురక్షితంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








