Electrical Vehicle Range మీ ఎలక్ట్రిక్‌ కారు రేంజ్‌ ఎలా లెక్కించాలో తెలుసా.. ఇది చాలా సింపుల్‌.!!

దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు(Electric Vehicles) కస్టమర్లలో మంచి ఆదరణ పొందుతున్నాయి. మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా సాంప్రదాయ పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలకు స్వస్తి పలుకుతున్నారు. పర్యావరణానికి అనుకూలంగా ఉండటంతో పాటు పెరుగుతున్న ఇంధన ధరల నుంచి బయటపడటానికి ఈవీలు కస్టమర్లకు మంచి ఆప్షన్‌గా నిలుస్తున్నాయి.

అయితే మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, కొత్త కస్టమర్‌లను కొన్ని అంశాలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. అదే రేంజ్‌(Electric Vehicles Range). ఫ్యూయెల్‌తో నడిచే వాహనాల్లో అయితే దీనిని మనం మైలేజ్‌(Mileage) అంటాం. ఎలక్ట్రిక్‌ వాహనాలు ఇచ్చే మైలేజ్‌ను రేంజ్‌ అంటాం. అయితే EV యొక్క మైలేజీని ఎలా లెక్కించాలనేది చాలా మందికి స్పష్టంగా తెలియదు.

Electric-Vehicle-Range

మైలేజ్‌ని లీటరుకు కిలోమీటర్లలో (kmpl) కొలిచే సంప్రదాయ వాహనాల మాదిరిగా కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు వాటి దూరాన్ని భిన్నంగా లెక్కిస్తాయి. ఈ కొలత చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది వాహనం యొక్క పనితీరును మరియు దాని రేంజ్‌ను పూర్తి ఛార్జ్‌లో అర్థం చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది.

అంతేకాకుండా దీని ద్వారా ఎక్కువ కాలం మన్నగలిగేలా ఎలక్ట్రిక్ వాహనాలను ఎలా ఉపయోగించాలనేదిపై కూడా మీరు ఒక అవగాహనకు రావచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలు ప్రొపల్షన్ కోసం బ్యాటరీలను ఉపయోగిస్తాయి. అందువల్ల, ఎలక్ట్రిక్ వాహనాల్లో 'మైలేజ్' అనే పదాన్ని ఉపయోగించడం సరైనది కాదు. బదులుగా, రెండు కీలక కొలమానాలను పరిగణనలోకి తీసుకుంటాం.

Electric-Vehicle-Range

అదేంటంటే.. ఎలక్ట్రిక్‌ వాహనం యొక్క మొత్తం శక్తి వినియోగ సామర్థ్యం మరియు నడిచే మొత్తం దూరం. దీనిలో, బ్యాటరీ కెపాసిటీని కిలోవాట్ గంటలలో (kWh) కొలుస్తారు, అయితే దూరాన్ని కిలోమీటర్లలో (km) కొలుస్తారు. ప్రతి kWh శక్తికి నడిచే km సంఖ్యను అంచనా వేయడం ద్వారా, EV యొక్క సామర్థ్యాన్ని లెక్కించవచ్చు.

ఉదాహరణకు మీరు మీ ఎలక్ట్రిక్‌ కారు(electric car) 200 కి.మీ ప్రయాణించారనుకుందాం. దానికి మీ ఈవీ బ్యాటరీ శక్త్రి 20.2 కిలోవాట్‌ ఖర్చు అయింది అనుకోండి. అప్పుడు మీ కారు లేదా బైక్‌ ఇచ్చిన మొత్తం రేంజ్‌ 9.9 km/kwh. మీరు ప్రయాణించిన దూరాన్ని ఖర్చు అయిన శక్తితో భాగించాలి. అప్పుడు మొత్తం రేంజ్‌ వస్తుంది.

Electric-Vehicle-Range

అయితే కొన్ని కారణాల కారణంగా మీ EV యొక్క రేంజ్‌ ఎక్కువ లేదా తక్కువ చూపించవచ్చు. ప్రధానంగా వీటిలో వాహనం వేగం, ఎయిర్ కండిషనింగ్ వాడకం, భూభాగం, పరిసర వాతావరణం ఇంకా డ్రైవింగ్ శైలి ఇలా చాలా అంశాలు రేంజ్‌పై ప్రభావితం చేస్తాయి. అందువల్ల, సరైన డ్రైవింగ్ అలవాట్లను పాటించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల రేంజ్‌ మరియు కెపాసిటీ మెరుగుపడుతుంది.

EVలను స్వీకరించడం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. తక్కువ రన్నింగ్ ఖర్చుల కారణంగా ఇది దీర్ఘకాలంలో వినియోగదారులకు ఖర్చులను కూడా చాలా వరకు తగ్గిస్తుంది. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈవీల పనితీరు కూడా మెరుగుపడుతోంది. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలో దూసుకువెళ్తున్నాయి. స్టార్టప్‌లు సైతం తమ సత్తా చాటుకుంటున్నాయి. ఇది మంచి పరిణామం అని చెప్పవచ్చు.

ఆటో రంగంలోని టాటా, టయెటా, హ్యుందాయ్‌ ఇలా పలు దిగ్గజ కంపెనీలతో పాటు ఓలా, ఈథర్‌ ఎనర్జీ ఇంకా పలు స్టార్టప్‌లు పోటాపోటీగా ఈవీ రంగంలో దూసుకుపోతున్నాయి. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా కొత్త మోడళ్లను ప్రవేశపెడుతూ అధిక రేంజ్‌ ఇచ్చే ఈవీలను రూపొందిస్తున్నాయి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, September 23, 2023, 9:32 [IST]
English summary
Here is how to calculate your electric vehicle range full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+