తక్కువ ధరలో మంచి కారు కొనాలంటే.. ఈ ఫీచర్లను పక్కకు పెట్టాల్సిందే.. అవేంటంటే.??

ప్రస్తుత కాలంలో ప్రతి ఫ్యామిలీకి కారు నిత్యావసరంగా మారిపోయింది. పెరుగుతున్న అవసరాలు, మారుతున్న కాలానికి అనుగుణంగా చాలా మందికి కారు తప్పనిసరి అయింది. అందుకు తగినట్లుగా మార్కెట్లోకి అనేక రకాల మోడల్స్‌లో కార్లు అందుబాటులో ఉంటున్నాయి. ఆధునిక టెక్నాలజీ సాయంతో డజన్ల కొద్దీ ఫీచర్లను చూస్తున్నాం.

మార్కెట్లో కారులో ఉండే ఫీచర్లు, సౌకర్యాలు, మోడల్‌ను బట్టి ధరలు మారుతుంటాయి. అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు, అధునాతన సౌకర్యాలు ఉన్న కార్ల ధరలు ఎక్కువగానే ఉంటాయి. అయితే చాలా మంది అధిక బడ్జెట్‌లో కారును కొనుగోలు చేయలేరు. ఇంకా కార్లలో ఉండే అన్ని రకాల ఫీచర్లను ఉపయోగించుకోలేరు. అయితే మీరు కొన్ని ఫీచర్లను వద్దు అనుకుంటే తక్కువ ధరలోనే అద్భుతమైన కార్లను సొంతం చేసుకోవచ్చు.

Avoid-Features-In-Car

టెక్నాలజీ పరంగా ఆటోమొబైల్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆటోమేటిక్ బ్రేకింగ్ నుంచి సిగ్నల్ ఆధారిత స్పీడ్ కంట్రోల్ వరకు చాలా ఫీచర్లను కార్లలో చూస్తున్నాం. అయితే కార్లలో అన్ని ఫీచర్లు ముఖ్యమైనవి అని చెప్పలేం. మీరు తక్కువ ధరలో కారు కొనాలనుకుంటే ఈ ఫీచర్లు లేకుండా చూసుకోండి.

LED డే టైమ్‌ రన్నింగ్ లైట్లు: అప్‌డేటెడ్‌ వెర్షన్‌ కార్లలో ఈ ఫీచర్‌ చాలా ఖరీదుతో కూడుకున్నది. ఎల్‌ఈడీ లైట్ల ద్వారా కారు లుక్‌ ఆకర్షణీయంగాఉంటుంది. పొగ మంచు ఉన్న రోడ్లపై ఈ ఫీచర్‌ ద్వారా డ్రైవర్లకు విజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ఫీచర్‌కు ఎక్కువగా ప్రాధాన్తయ ఇస్తారు. అయితే ఫాగ్‌ లైట్‌ ఫీచర్‌ కూడా ఇందుకోసమే ఏర్పాటు చేశారు.

LED-Day-Time-Running-Lights

కాగా భారత వాతావరణం, రోడ్లపై ఎల్‌ఈడీ డే టైమ్‌ రన్నింగ్‌ లైట్ల ఫీచర్‌ అవసరం లేదని చెబుతున్నారు వాహన నిపుణులు. కేవలం కారుకు ప్రీమియం లుక్‌ను జోడించడం కోసమే ఈ ఫీచర్‌ను ఇచ్చినట్లు పేర్కొంటున్నారు. కావున తక్కువ ధరలో కారు కొనుగోలు చేయాలనుకునేవారు ఈ ఫీచర్‌ను నివారించవచ్చు.

పనోరమిక్ సన్‌రూఫ్: ప్రీమియం కార్లలో మాత్రమే సన్‌రూఫ్‌(Panoramic Sunroof) ఫీచర్‌ అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు హ్యాచ్ బ్యాక్, సెడాన్ వంటి అన్ని రకాల కార్లలో కూడా ఈ ఫీచర్‌ను చూడవచ్చు. ఇది కూడా కారుకు ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. అయితే భారత వాతావరణ పరిస్థితులకు ఈ ఫీచర్‌ అవసరం అంతగా ఉండదు.

Sunroof

ఎందుకంటే ప్రయాణ సమయంలో డే టైమ్‌లో కారులో వెలుతురు బాగానే ఉంటుంది. సన్‌లైట్‌ దీనికి సరిపోతుంది. రాత్రిళ్లు లైట్‌ ఆన్‌ చేసుకోవచ్చు. అయితే సన్‌రూఫ్‌ ఫీచర్‌ విఫలమైతే వర్షం పడిన సందర్భాల్లో కారు లోపలికి నీరు చేరుతుంది. దీని ద్వారా కారు దెబ్బతినే అవకాశం ఉంది. కావున ఈ ఫీచర్‌ను దీనిని నివారించుకోవచ్చు.

ఆటోమేటిక్‌ వైపర్లు: సాధారణంగా వర్షం పడుతున్న సమయంలో కారులో ప్రయాణిస్తున్నప్పుడు మీరు మాన్యువల్‌గా వైపర్లను ఆన్‌ చేస్తారు. అయితే ఆధునిక కార్లలో వర్షం పడినప్పుడు విండ్‌షీల్డ్‌పై ఆటోమేటిక్‌గా వైపర్లు(Automatic Wipers) ఆన్‌ అవుతాయి. కానీ వీటి అవసరం అంతగా లేకుండా మీరు మాన్యువల్‌గా యాక్టివేట్‌ చేసుకోవచ్చు.

Rain-Sensing-wipers

టచ్‌ప్యాడ్ కంట్రోల్‌: ఆధునిక కార్లలో కనిపించే మరో ఫీచర్‌ టచ్‌ప్యాడ్‌ కంట్రోల్‌(TouchPad Control). ఈ ఫీచర్‌ను చాలా మంది మెచ్చుకుంటున్నారు. కానీ దీని కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు ఆటో నిపుణులు. పరధ్యానంగా ఉన్న సమయంలో టచ్‌ప్యాడ్‌లో తప్పుడు బటన్‌ ప్రెస్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగా పాత సంప్రదాయ బటన్లు ఉన్న కార్లనే కొనుగోలు చేయాలంటుని సూచిస్తున్నారు.

వైర్‌లెస్ ఛార్జర్: సాధారణంగా ఇంటి నుంచి బయలుదేరే ముందు సెల్‌ఫోన్‌లతో సహా ఇతర గ్యాడ్జెట్లకు చాలా సమయం ఛార్జింగ్‌ పెడతాం. అయితే కార్లలో కూడా ఛార్జింగ్ సౌకర్యం(Wireless Charger) ఉండటం విశేషం. అత్యవసర సమయాల్లో ఇది ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా సుదూర ప్రయాణాల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Wirless-Charger

అయితే ఇది వైర్‌లెస్ ఛార్జర్ మాత్రమే కానవసరం లేదు. ఎందుకంటే ఈ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌లపై సెల్‌ఫోన్‌ను ఉంచడం, దానిని వేయించడానికి పాన్‌లో ఉంచడం లాంటిదే. ఎందుకంటే దీని ద్వారా చాలా వేడి ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. దీని ద్వారా ఫోన్‌ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కావున వైర్‌ ఛార్జింగ్‌ సౌకర్యాన్ని ఉపయోగించడం మంచిది.

టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్: ఆటోమోటివ్‌ ప్రపంచంలో ఈ ఫీచర్‌(Touch Screen Infotainment System) పాత్ర చాలా కీలకం. అయితే దీని కారణంగా ప్రమాదాలు కూడా జరుగుతాయంటున్నారు నిపుణులు. అవును, దీన్ని ఉపయోగించే డ్రైవర్లు పరధ్యానంలో ఉంటున్నారని.. ఇది దేశంలో వివిధ ప్రమాదాలకు దారితీస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఫీచర్‌ అవసరం అంతగా ఉండకూడదంటున్నారు.

TouchScreen-Infotainment

అయితే పైన పేర్కొన్న అన్ని ఫీచర్లను ఇష్టపడే వారు కూడా చాలా మంది అంటారు. కాగా మీరు వాహనాలపై ఎక్కువ మొత్తంలో డబ్బు వెచ్చించగల వ్యక్తి అయితే, మీరు ఎటువంటి సందేహం లేకుండా పై ఫీచర్లతో కూడిన కారును కొనుగోలు చేయవచ్చు. లేదా తక్కువ ధరలో కారును కొనుగోలు చేయాలనుకుంటే వీటిని నివారించండి.

More from DriveSpark

Article Published On: Sunday, January 7, 2024, 8:01 [IST]
English summary
Here list of some features that you can avoid while buying a car at low price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+