స్టీరింగ్ వీల్‌ను కరెక్ట్‌గా పట్టుకోవటం ఎలా: చిట్కాలు
కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు స్టీరింగ్‌ను పట్టుకోవడంలో డ్రైవర్లు అనేక విధానాలను పాటిస్తున్నారు. ఒకరు ఒక్క చేత్తో స్టీరింగ్ పట్టుకుంటే, మరొకరు ఒక వేలితో స్టీరింగ్ పట్టుకుని డ్రైవ్ చేస్తుంటారు. ఇలా చేయటం వలన సదరు డ్రైవర్లు ప్రమాదాలను కొనితెచ్చుకుంటుంటారు. స్టీరింగ్‌ను సరిగ్గా పట్టుకోకపోవటం వలన అత్యవసర సమయాల్లో, సరైన సమయంలో రియాక్ట్ కావడంలో జాప్యం జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయనేది జగమెరిగిన సత్యం.
స్టీరింగ్ పట్టుకోవటానికి సంబంధించి నిర్ధిష్టం విధానం ఉంటుంది. నా కారు, నా స్టీరింగ్ నాకు నచ్చినట్లుగా పట్టుకుంటానంటే, మీరు ప్రమాదానికి చేరువలో ఉన్నట్లు అర్థం. స్టీరింగ్ వీల్‌ను సరిగ్గా పట్టుకోకపోవటమే, దాని కంట్రోల్‌పై సరైన అవగాహన లేకపోవటమే అనేక ప్రమాదాలకు కారణమని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందుకే, ఈ కథనంలో స్టీరింగ్ వీల్‌ను సరిగ్గా ఎలా పట్టుకోవాలో, ఎలా పట్టుకోకూడదో తెలుసుకుందాం రండి.

ఏళ్ల తరబడి డ్రైవింగ్ చేస్తున్నా మీ డ్రైవింగ్ పద్ధతి మారలేదా..? అయితే బహుశా మీరు తప్పుగా ప్రయత్నిస్తున్నారేమో..! అవును, స్టీరింగ్‌ను పట్టుకోవడంలో ఇప్పటికీ అనేక మంది డ్రైవర్లు అనేక విధానాలను పాటిస్తున్నారు. అందులో ఏది సరైనదో, ఏది తప్పైనదో తెలుసుకుందాం రండి.

స్టీరింగ్ వీల్‌ను పై భాగంలో పట్టుకోవటం: 'తప్పు'
మీరు గమనించినట్లయితే, అనేక మంది డ్రైవర్లు కారు స్టీరింగ్‌ను పైనుంచి రెండు చేతులతో పట్టుకొని డ్రైవ్ చేస్తుంటారు (పక్క చిత్రంలో చూపించినట్లుగా). ఇది తప్పు పద్ధతి. ఇలా చేయటం వలన అత్యవసర సమయాల్లో స్టీరింగ్‌ను కంట్రోల్ చేయటం కష్టం అవుతుంది. కాబట్టి దయచేసి ఈ పద్ధిని మానుకోండి.

స్టీరింగ్ వీల్‌ను క్రింది భాగంలో పట్టుకోవటం: 'తప్పు'
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది స్టీరింగ్ వీల్ క్రింది భాగంలో పట్టుకొని డ్రైవ్ చేస్తుంటారు. కొందరు ఇదే పొజిషన్‌లో ఒక్కవేలితో కూడా డ్రైవ్ చేస్తుంటారు. వాస్తవానికి ఇది చాలా ప్రమాదకరమైన విధానం.

10 టూ 2 డైమన్షన్: 'తప్పు'
సాధారణంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా వాహనాన్ని టర్నింగ్ చేసే సమయంలో స్టీరింగ్‌ను గోడ ఘడియారంలోని ముల్లులు 10-2 గంటలను సూచించే విధంగా (చిత్రంలో చూపబడినట్లుగా) రెండు చేతులతో పట్టుకొని డ్రైవ్ చేయటం కూడా తప్పు పద్ధతే. దీని వలన అత్యవసర సమయాల్లో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినా కూడా తలకు గాయమయ్యే ప్రమాదం ఉందని డ్రైవింగ్ గైడ్‌లైన్స్ చెబుతున్నాయి.

టర్నింగ్ సమయంలో స్టీరింగ్‌పై చేయి: 'తప్పు'
టర్నింగ్ చేసేటప్పుడు స్టీరింగ్ వీల్‌పై చెయ్యిని ఒకే ప్రాంతంలో ఉంచడం తప్పు. ఇలా చేయటం వలన స్టీరింగ్‌ను తిప్పేటప్పుడు రెండు చేతులు మెలికపడే ఆస్కారం ఉంటుంది. ఫలితంగా స్టీరింగ్ వీల్‌పై కంట్రోల్ తప్పి, ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది.

ఒక్క చేతితో స్టీరింగ్ పట్టుకోవటం: 'తప్పు'
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్టీరింగ్‌ను ఒక్క చేతితో పట్టుకొని డ్రైవ్ చేయటం చాలా ప్రమాదకరం. గేరు మార్చేటప్పుడు తప్ప మరెప్పుడూ స్టీరింగ్‌ను ఒక్కచేతితో పట్టుకొని డ్రైవ్ చేయకూడదు.
ఇప్పటి వరకు తప్పులు తెలుసుకున్నాం, ఇప్పుడు స్టీరింగ్‌ను పట్టుకునే సరైన విధానం ఏంటో తెలుసుకుందాం రండి.

180 డిగ్రీ కోణంలో పట్టుకోవటం: 'సరైనది'
స్టీరింగ్‌ను ఎల్లప్పుడు రెండు చేతులు 180 డిగ్రీ కోణంలో ఒకదానితో ఒకటి సమాంతరంగా ఉండేలా పట్టుకోవాలి. టర్నింగ్ చేసటప్పుడు కూడా ఇదే పద్ధతిని పాటించాలి. ఈ పద్ధతి అన్ని రకాలుగా సురక్షితమైనది.

9 టూ 3 డైమన్షన్: 'సరైనది'
వాస్తవానికి నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ మార్గదర్శకాల ప్రకారం, స్టీరింగ్‌ను ఎప్పుడూ కూడా ఘడియారంలోని ముల్లులు 9-3 గంటల (చిత్రంలో చూపినట్లుగా) డైరెక్షన్‌లో చూపినట్లుగా పట్టుకోవాలి. ఈ సందర్భంలో ఎయిర్‌బ్యాగ్ విచ్చుకున్నప్పుడు చేతులు ఎయిర్‌బ్యాగ్‌కు అడ్డంకి కాకుండా ఉండి, తలకు గాయం కాకుండా రక్షణను కల్పిస్తాయి.

8 టూ 4 డైమన్షన్: 'సరైనది'
ఘడియారంలోని ముల్లులు 8-4 గంటల డైరెక్షన్‌లో చూపినట్లుగా కూడా స్టీరింగ్‌ను పట్టుకోవచ్చు. ఉండే విధంగా చేతులతో పట్టుకొని డ్రైవ్ చేయాలి. అయితే, టర్నింగ్ చేసేటప్పుడు స్టీరింగ్‌ను రెండు చేతులతో సమాంతరంగా పట్టుకొని నెమ్మదిగా టర్న్ చేయటం ఉత్తమం.


Click it and Unblock the Notifications








