హోండా అమేజ్ విడుదల: ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

జపనీస్ కార్ కంపెనీ హోండా కార్స్ ఇండియా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బుజ్జి సెడాన్ 'హోండా అమేజ్' ఆశ్చకరమైన ధరతో మార్కెట్లోకి దూసుకువచ్చింది. ఎంట్రీ లెవల్ సెడాన్ సెగ్మెంట్లో ధరల యుద్ధాని తెర లేపుతూ హోండా తమ మొట్టమొదటి డీజిల్ కారును దేశీయ విపణిలో ప్రవేశపెట్టింది. విడుదలకు ముందే హోండా అమేజ్ 5000 లకు పైగా బుకింగ్‌లను సొంతం చేసుకుంది.

ఈ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌ను టార్గెట్ చేస్తూ, హోండా కార్స్ ఇండియా అందిస్తున్న బ్రయో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా కంపెనీ ఈ అమేజ్ సెడాన్‌ను అభివృద్ధి చేసింది. ఇది పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో పాటుగా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (పెట్రోల్ వేరియంట్లో మాత్రమే) కూడా లభిస్తుంది. హోండా అమేజ్ ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి...!

హోండా అమేజ్: ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

హోండా అమేజ్: ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

హోండా అమేజ్ పెట్రోల్ వేరియంట్లు - ధరలు

ఈ గ్రేడ్ - రూ.4.99 లక్షలు

ఈఎక్స్ గ్రేడ్ - రూ.5.24 లక్షలు

ఎస్ గ్రేడ్ - రూ.5.62 లక్షలు

విఎక్స్ గ్రేడ్ - రూ.6.60 లక్షలు

ఎస్ గ్రేడ్ (ఆటోమేటిక్) - రూ.6.62 లక్షలు

విఎక్స్ గ్రేడ్ (ఆటోమేటిక్) - రూ.7.50 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

హోండా అమేజ్: ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

హోండా అమేజ్: ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

హోండా అమేజ్ డీజిల్ వేరియంట్లు - ధరలు

ఈ గ్రేడ్ - రూ.5.99 లక్షలు

ఈఎక్స్ గ్రేడ్ - రూ.6.24 లక్షలు

ఎస్ గ్రేడ్ - రూ.6.67 లక్షలు

విఎక్స్ గ్రేడ్ - రూ.7.60 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

హోండా అమేజ్: ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

హోండా అమేజ్: ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

హోండా అమేజ్ పెట్రోల్ - పెర్ఫామెన్స్

ఇంజన్ - 1.2 లీటర్ ఐ-విటెక్ ఇంజన్

పవర్ - 88 పిఎస్

టార్క్ 109 ఎన్ఎమ్

మైలేజ్ - 15.5 కెఎమ్‌పిఎల్

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

హోండా అమేజ్: ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

హోండా అమేజ్ డీజిల్ - పెర్ఫామెన్స్

ఇంజన్ - 1.5 లీటర్ ఐ-డిటెక్ ఇంజన్

పవర్ - 100 పిఎస్

టార్క్ 200 ఎన్ఎమ్

మైలేజ్ - 25.8 కెఎమ్‌పిఎల్

హోండా అమేజ్: ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

హోండా అమేజ్: ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

హోండా అమేజ్ ఫీచర్స్

హోండా అమేజ్ సెడాన్ ఆరు ఆకర్షనీయమైన రంగులలో (మెజిస్టిక్ బ్లూ మెటాలిక్, కార్నెలియన్ రెడ్ పెరల్, అర్బన్ టైటానియం మెటాలిక్, అల్బాస్టర్ సిల్వర్ మెటాలిక్, క్రిస్టల్ బ్లాక్ పెరల్ మరియు టఫేటా వైట్) లభిస్తుంది. ఇది రెండేళ్లు లేదా 40,000 కి.మీ. వారంటీతో లభిస్తుంది.

హోండా అమేజ్: ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

హోండా అమేజ్: ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

హోండా అమేజ్ ఫీచర్స్

ఇంకా ఇందులో డ్యూయెల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ప్రీటెన్షనర్ సీట్ బెల్ట్స్, ధృఢమైన బాడీ నిర్మాణం వంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి. అన్ని డీజిల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్లలో ఈబిడితో కూడిన ఏబిఎస్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా అందిస్తున్నారు.

హోండా అమేజ్: ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

హోండా అమేజ్: ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

హోండా అమేజ్ బుకింగ్స్

హోండా అమేజ్ సెడాన్‌కు ఏప్రిల్ 1, 2013న బుకింగ్స్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న 97 నగరాల్లోని 150 డీలర్‌షిప్ కేంద్రాలలో ఈ కారు అందుబాటులో ఉంటుంది. హోండా కార్స్ ఇండియా 2013-14 చివరి నాటికి తమ డీలర్‍‌‌షిప్ నెట్‌వర్క్‌ను 102 నగరాల్లో 162 కేంద్రాలకు పెంచాలని యోచిస్తోంది.

హోండా అమేజ్: ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

హోండా అమేజ్: ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

హోండా అమేజ్ స్పెషల్ ఏంటి..?

మరి హోండా అమేజ్‌లో మీకు నచ్చిన ప్రత్యేకత ఏంటి. ధర, మైలేజ్, పెర్ఫామెన్స్, బ్రాండ్ లేదా ఫీచర్స్.. మా పాఠకులతో మీ అభిప్రాయాలు పంచుకోండి.

More from DriveSpark

Article Published On: Monday, April 15, 2013, 12:03 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+