ఎలక్ట్రిక్ కార్లలో ఏసీ ఆన్‌ చేస్తే ఛార్జింగ్‌, రేంజ్‌ (మైలేజీ) ఎంత తగ్గుతుందో తెలుసా?

వాహనాల్లో ఏసీని ఉపయోగించడం వల్ల మైలేజీ తగ్గుతుందని చాలా మందికి తెలుసు. అయితే ఇప్పుడు దేశంలో అంతటా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరుగుతున్నందున వీటిలో ఏసీని ఉపయోగిస్తే రేంజ్‌ (మైలేజీ) తగ్గుతుందా అనే ప్రశ్న మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది. సాధారణంగా కార్లలో ఏసీని ఆన్‌ చేయడం వల్ల తక్కువ మొత్తంలో ఇంధనం ఖర్చు అవుతుంది. ప్రస్తుతం భారతదేశంలో విరివిగా వాడే పెట్రోల్, డీజిల్ వాహనాలు ఏసీతో డ్రైవింగ్ చేస్తే తక్కువ మైలేజీ వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏసీ ఆధారిత మోటార్ ప్రొపెల్లెంట్ ఫోర్స్‌తో (Propellant Force) నడుస్తుంది. దీంతో ఇంజిన్‌కి వెళ్లాల్సిన పవర్ కొద్దిగా ఏసీకి వెళ్తుంది.

దీంతో కొంచెం ఎక్కువ పెట్రోల్‌ ఇంజిన్‌కి అవసరం అయ్యే పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల వాహనం మైలేజీపై ప్రభావం పడుతుంది. అదే సమయంలో ఏసీ ఆన్ చేసినప్పుడు వాహనం పవర్ కూడా తగ్గుతుంది. వీటన్నింటి పర్యవసనాల కారణంగా తక్కువ మైలేజీ సమస్య అనేది ప్రతీ ఒక్కరికీ ఎదురవుతుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. ఇవి పూర్తి బ్యాటరీ శక్తితో ప్రయాణిస్తాయి.

Electric Cars Air Conditioner

ఏసీ వాహనాల్లోనూ ఏసీని ఉపయోగిస్తారు. ఈ వాహనాల్లో ఏసీని ఉపయోగించినప్పుడు వాహనం రేంజ్‌ తగ్గుతుందా? పెట్రోల్, డీజిల్‌ వెహికిల్స్‌లో మాదిరిగా భారీ మార్పు ఉంటుందా అనే ప్రశ్న చాలామందిలో ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల్లోని ఏసీ ఎక్కువ ఎనర్జీని వినియోగిస్తాయని చాలా మంది చెబుతుంటారు. దీని వెనక ఉండే అసలు కారణాలు, ఇతర పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

ఏసీ వినియోగించడం వల్ల రేంజ్ తగ్గుతుందా అనే అంశంపై ఇటీవల లాంచ్ చేసిన టాటా కర్వ్, టాటా నెక్సాన్ ఈవీలను పరీక్షించారు. టాటా కర్వ్ ఈవీలో 55 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, టాటా నెక్సాన్ ఈవీలో 40.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తాయి. టాటా కర్వ్‌ని 61 శాతం బ్యాటరీతో 30 నిమిషాలు విండోస్‌ క్లోజ్‌ చేసి నడిపించారు.

Electric Car AC Consuming

ఈ విధంగా ఏసీని ఆన్ చేసినప్పుడు ఉష్ణోగ్రతను 24 డిగ్రీల వద్ద, ఫ్యాన్ వేగాన్ని రెండు వద్ద ఉంచారు. సుమారు 30 నిమిషాల తర్వాత ఎంత ఛార్జ్ తగ్గిందనే విషయాన్ని అంచనా వేశారు. రేంజ్‌ ఎంత తగ్గిందో లెక్కించేందుకు ముందుగా బ్యాటరీ ఛార్జ్ ఎంత ఖర్చవుతుందో లెక్కించాలని నిర్ణయించారు. దీని ప్రకారం 30 నిమిషాల తర్వాత వచ్చిన ఫలితాలు పలువురిని ఆశ్చర్యానికి గురిచేశాయి.

ఈ రెండు కార్లలో 30 నిమిషాల ఏసీ వాడకం తర్వాత బ్యాటరీ ఛార్జ్ కేవలం ఒక శాతం మాత్రమే తగ్గింది. అంటే కర్వ్ బ్యాటరీ సామర్థ్యం 61 శాతం నుంచి 60 శాతానికి తగ్గింది. మరోవైపు నెక్సాన్ ఈవీ బ్యాటరీ సామర్థ్యం 75 శాతం నుంచి 74 శాతానికి తగ్గింది. రేంజ్‌ పరంగా చూస్తే ఏసీ ఆన్‌ చేస్తే 3 కిలోమీటర్లు తక్కువ దూరం ప్రయాణించింది.

Car AC in EVs

అదేవిధంగా కర్వ్ నాలుగు కిలోమీటర్ల తక్కవ రేంజ్‌ వచ్చింది. అయితే నిరంతరాయంగా 30 నిమిషాలు డ్రైవ్ చేస్తే మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు రేంజ్‌ తగ్గే అవకాశం ఉంది. అంటే గంట పాటు ఏసీ ఆన్‌ చేసి డ్రైవింగ్ చేస్తే ఆరు నుంచి తొమ్మిది కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంది. ఈ గంట ప్రయాణంలో గంటకు సగటున 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే కాస్త తక్కువ రేంజ్‌ ఇస్తుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Saturday, October 26, 2024, 7:20 [IST]
English summary
How ac in electric car consume charging check range and battery life
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+