కారులో సైడ్ మిర్రర్స్‌ను ఎలా సర్దుకోవాలో మీకు తెలుసా..?
వాహనం పాతదైనా, కొత్తదైనా దానికి రియర్ వ్యూ మిర్రర్స్ చాలా అసరం. వాహనాన్ని స్టార్ట్ చేయకముందే రియర్ వ్యూ మిర్రర్స్‌ను సర్దుబాటు చేసుకోవాలి. అలాకాకుండా వాహనంపై బయలుదేరిన తర్వాత ప్రయాణం మధ్యలో డ్రైవింగ్/రైడింగ్ చేస్తూ మిర్రర్స్‌ను సర్దుబాటు (అడ్జస్ట్) చేయటం అత్యంత ప్రమాదకరం. ఇలాంటి చిన్న పొరపాట్లే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయి.
కారులో మొత్తం మూడు మిర్రర్స్ ఉంటాయి. ఒకటి డ్రైవర్ సైడ్ ఉండే సైడ్ వ్యూ మిర్రర్, రెండవది ప్యాసింజర్ వైపు ఉండే సైడ్ వ్యూ మిర్రర్ మరొకటి కారుకు మధ్య భాగంలో సీలింగ్‌కు అమర్చబడి ఉండే సెంటర్ రియర్ వ్యూ మిర్రర్.
రియర్ వ్యూ మిర్రర్ అడ్జస్ట్‌మెంట్:
ఈ రియర్ వ్యూ మిర్రర్ (కారుకు సెంటర్‌లో ఉండేది)ను అడ్జస్ట్ చేయటానికి ముందు డ్రైవర్ సీటులో కూర్చుని రోడ్డు మార్జిన్స్ కనపడేలా సీటు ఎత్తు సరిగ్గా ఉందో లేదో చూసుకున్న తర్వాత మీ వెనుక వెపు ఉన్న రోడ్డు లేదా వస్తువులు సరిగ్గా కనిపించేలా మిర్రర్ మధ్య భాగంలో ఉండేలా సర్దుబాటు చేసుకోవాలి. సింపుల్ చెప్పాలంటే కారు రియర్ విండో ఈ మిర్రర్‌లో స్పష్టంగా పూర్తిగా కనిపించాలి. డ్రైవర్ సీట్లో కూర్చున్నప్పుడు మీ వెనుక నుండి వస్తున్న కార్లను ఈ సెంటర్ మిర్రర్‌లో చూడగలిగేలా సర్దుబాటు చేసుకోవాలి.
సైడ్ వ్యూ మిర్రర్ అడ్జస్ట్‌మెంట్:
ముందుగా ప్యాసింజర్ వైపు ఉండే సైడ్ వ్యూ మిర్రర్‌ను అడ్జస్ట్ చేసుకోవాలి. డ్రైవర్ సీట్లో కూర్చుని తల సైడ్ విండో టచ్ అయ్యే పొజిషన్‌లో సైతం కారు ఎడమ వైపు భాగాన్ని పూర్తిగా చూడగలిగేలా ఈ మిర్రర్‌ను సర్దుబాటు చేసుకోవాలి. ఇదే విధంగా డ్రైవర్ వైపు ఉండే సైడ్ వ్యూ మిర్రర్‌ను కూడా సర్దుబాటు చేసుకోవాలి. తలను చక్కగా ఉంచి మిర్రర్స్‌ను సర్దుబాటు చేసుకున్నట్లు మీ కారుకు ఎడమ, కుడి వైపులను పూర్తిగా మిర్రర్స్‌లో చూడలేరు.


Click it and Unblock the Notifications









