డ్రైవింగ్‌లో పరధ్యానాన్ని పారద్రోలేందుకు పది చిట్కాలు

Avoid Cell phone While Driving
డ్రైవింగ్.. ఓ సౌకర్యవంతమైన మరియు విలాసవంతమైన అనుభూతి. మరి ఈ అనుభూతిలో చిన్న అవాంతరాలను అధిగమిస్తూ దాన్ని మన జీవితకాలం సురక్షితంగా నిలుపుకోవాలంటే.. ఈ చిన్ని చిట్కాలను శ్రద్ధగా పాటిస్తే.. మనం సంతోషంగా ఉండటమే కాకుండా.. మన చుట్టూ ఉన్నవారిని, మనపై ఆధారపడి ఉన్నవారిని సంతోషంగా ఉంచుంతాం. సాధారణంగా డ్రైవింగ్‌లో అప్పుడప్పుడు కొన్నిసార్లు పరధ్యానానికి గురికావడం సహజమే. కానీ, ఈ చిన్న పరధ్యానమే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందనే విషయాన్ని మనం గ్రహించాలి. ఓ సురక్షితమైన డ్రైవర్‌గా ఇటువంటి పరధ్యానాలను అధిగమించడం మన కర్తవ్యం. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు పరధ్యానాన్ని అధిగమించేందుకు కొన్ని చక్కని చిట్కాలు మీకోసం...

* వాహనం డ్రైవ్ చేస్తున్నప్పుడు సెల్‌ఫోన్‌ను ఉపయోగించడం, టెక్స్ట్ మెసేజ్‌లను చదవడం వంటివి చేయకండి. ఒకవేళ సదరు కాల్/మెసేజ్ అత్యంత ముఖ్యమని అనిపిస్తే.. వాహనాన్ని రోడ్డుకు పక్కగా నిలుపుకొని రిప్లయ్ ఇవ్వండి.

* డ్రైవింగ్‌లో ఒకేసారి వివిధ పనులను చేయకండి. ఉదాహరణకు మేకప్ వేసుకోవడం, మ్యూజిక్ సిస్టమ్‌ను అడ్జస్ట్ చేయడం, తల వెంట్రుకలను సరిచేసుకోవడం, కోటును తీసేయడం, ఫోన్ చార్జింగ్ పెట్టడం వంటి పనులు చేయకండి.

* డ్రైవింగ్ చేస్తూ పేపర్‌ను చదవడం, లేదా పేపర్‌పై రాయడం వంటివి చేయకండి. ఒకవేళ అవి ముఖ్యమైన విషయాలు అయితే కారును రోడ్డు పక్కగా నిలిపి (నో పార్కింగ్ ప్లేస్‌ను గమనించుకోండి) చదవడం/రాయడం చేయండి. ఇలా చేయడం వల్ల ప్రయాణం కాస్తంత ఆలస్యం అవుతుందే తప్ప పెద్ద ముప్పేమీ ఉండదని గమనించండి.

* వాహనంలో సంగీతం వినేటప్పుడు మ్యూజిక్ సిస్ఠమ్‌లో చెవులకు వినసొంపైనంత శబ్ధాన్ని మాత్రమే పెట్టుకోవాలి. అధిక సౌండ్, లేదా ఇయర్‌ప్లగ్స్, హెడ్‌ఫోన్స్ వంటివి పెట్టుకోరాదు. ఇది చాలా ప్రమాదకరం, ఇలా చేయడం వల్ల ఎదురుగా / వెనుక నుంచి వచ్చే వాహనాల హెచ్చిరికలను లేదా అత్యవసర వాహనాల సైరన్‌ను వినడం కష్టం అవుతుంది.

* డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పాటించాల్సిన మరో ముఖ్యమైన సూచన ఏంటంటే.. వాహనం చలనంలో ఉన్నప్పుడు ఆహార పదార్థాలు తినడం, త్రాగడం వంటి పనులు చేయరాదు.

* డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారులో కింద పడిన వస్తువులను, లేదా వెనుకు సీట్లో ఉన్న వస్తువులను తీసుకోవడం వంటి చర్యలను మానుకోవాలి. ఇది రడ్డుపై నుంచి మీ దృష్టిని మరల్చే అవకాశం ఉంది.

* కార్లలో చిన్న పిల్లలను తీసుకువెళ్తున్నప్పుడు, వారిని అలానే సీట్‌లో వదిలేసి తరచూ గమనిస్తుండే బదులు వారికి సీట్ బెట్ల్‌ను చైల్డ్ లాక్‌ను అమర్చి కూర్చోబెట్టడం చాలా ఉత్తమం.

* ఎంత వేగంలో వెళ్తున్నామో నిర్ధారించుకునేందుకు కారు అద్దాలను ఎల్లప్పుడూ కిందికి దించేయండి.

* డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు సిగిరెట్ వెలిగించడం, పొగత్రాగడం, సిగిరెట్ యాష్ విదిలించడం వంటివి చేయరాదు.

* చివరిగా కారులో వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన కనిపించే అందమైన అమ్మాయిలు/అబ్బాయిలను, అశ్లీల పోస్టర్లను, ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలను చూసి పరవశించడం చాలా ప్రమాదకరం. ఇది డ్రైవింగ్‌పై నుంచి మీ దృష్టిని మరోవైపుకు మరల్చే ఆస్కారం ఉంది.

కాబట్టి పైన తెలిపిన జాగ్రత్తలను జాగ్రత్తగా.. పాటించి సౌఖ్యమైన మరియు సురక్షితమైన ప్రయాణాన్ని సాగించండి. "వేగం కన్నా ప్రాణం మిన్న" అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. హ్యాపి జర్నీ..!

More from DriveSpark

Article Published On: Saturday, July 2, 2011, 17:48 [IST]
English summary
Attention Drivers: Here are few useful tips to avoid distraction while driving. Never use a cell phone while driving, and don't look outside and try to makeup for your beautiful face.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+