రాత్రివేళల్లో సురక్షితంగా ప్రయాణించడం ఎలా - చిట్కాలు

రాత్రుళ్లో ప్రమాదాలు జరగడానికి మరొక ముఖ్యకారణం అలసట. అలసిపోయి డ్రైవ్ చేయడం వలన కూడా రాత్రిళ్లు ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఇకపోతే రోడ్డు ప్రమాదాలు జరగడానికి అన్నింటి కన్నా ముఖ్య కారణం 'మద్యపానం'. రోడ్డు ప్రమాదాలలో దాదాపు 50 శాతం ప్రమాదాలు మద్యం సేవించి డ్రైవ్ చేయడవలనే జరుగుతున్నట్లు ఆ సర్వే వెల్లడించింది. ఇలాంటి ప్రమాదాలు పనిదినాల (వర్కింగ్ డేస్) కన్నా వారాంతపు రోజుల్లోనే (వీకెండ్) ఎక్కువగా జరుగుతున్నట్లు ఆ సర్వే పేర్కొంది. కాబట్టి "ఎట్టిపరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాన్ని డ్రైవ్ చేయకండి". రాత్రివేళల్లో డ్రైవింగ్‌కు సంబంధించి మరికొన్ని చిట్కాలు మీ కోసం....
1. రాత్రిళ్లు డ్రైవ్ చేసేటప్పుడు మీ వాహన హెడ్‌లైట్లు, టైల్ లైట్లు, ఇండికేటర్లను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. మీ వాహన హెడ్‌లైట్ల కాంతి తక్కువగా అనిపిస్తే వెంటనే వాటి స్థానంలో అధిక కాంతిని ఇచ్చే లైట్లను అమర్చుకోండి. అంతే కాకుండా రోడ్డుపై హెడ్‌లైట్ కాంతి సరిగా ప్రసరించేలా నిపుణులైన మెకానిక్ వద్ద లైట్లను స్థితిని సరి చేయించుకోండి.
2. వాహన అద్దాలను ఎల్లప్పుడూ క్లీన్‌గా ఉంచుకోండి. అవతలి వైపు వాహనం స్పష్టంగా కనిపించే విధంగా వాహన అద్దాలను లోపలివైపు, బయటవైపు శుభ్రం చేసుకోండి. అద్దాలను క్లీని చేసే వైపర్లు కూడా సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో సరిచూసుకోండి. రాత్రిళ్లు ఎదురుగా వస్తున్న వాహనాన్ని గమనించేందుకు మీ వాహన డిమ్ అండ్ డిప్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో సరి చూసుకోండి.
3. రోడ్డుపై ఏదానా అవాంతరం ఉందన్న అనుమాన వస్తే.. వెంటనే మెయిన్ బీమ్ (దగ్గరకాంతినిచ్చే లైట్)ను స్విచ్ ఆన్ చేయండి. అలాగే ఎదురుగా వెళ్తున్న వాహనాన్ని ఫాలో అవుతున్నప్పుడు హై బీమ్ (దూరపు కాంతినిచ్చే లైట్)ను వేయకండి. ఎందుకంటే.. అది మీరు ఫాలో అవుతున్న డ్రైవర్ కంటిచూపుపై పడి అతనికి రోడ్డు కనిపించకపోవచ్చు.
4. మీరు ఏదైనా వాహనానికి వెనుకగా వెళ్తున్నప్పుడు.. ఆ వాహనానికి వీలైనంత దూరంలో ప్రయాణించండి. ఎందుకంటే రాత్రుళ్లు వాహన వేగాన్ని, దాని దూరాన్ని అంచనా వేయడం కష్టం.
5. రాత్రివేళల్లో డ్రైవ్ చేసేటప్పుడు ధూమపానాన్ని పూర్తిగా మానేయండి. ఎందుకంటే సిగరెట్‌లో ఉండే నికోటిన్ కంటిచూపుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అలాగే మద్యం సేవించినప్పుడు కూడా అస్సలు డ్రైవ్ చేయకండి.
6. రోడ్డుకు పక్కగా మీ కారును నిలపాల్సి వచ్చినప్పుడు కారు లైట్లను పూర్తిగా ఆపేయకండి. మీకు లైటింగ్ అవసరం లేకపోయినా కూడా ఇతరులు మీ వాహనాన్ని గుర్తించేందుకు వీలుగా హెడ్‌లైట్లను ఆన్ చేసి ఉంచండి.
7. రాత్రిళ్లు ఎక్కువ దూరం ప్రయాణిచాల్సి వచ్చినప్పుడు.. ఎకధాటిగా డ్రైవ్ చేయకుండా తరచూ విరామం తీసుకుంటూ.. స్నాక్స్, పండ్ల రసాలు వంటివి తీసుకోవడం వలన మీ ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాకుండా తేలికపాటి ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల కూడా మీ శరీరం అలసిపోకుండా ఉండి.. సుఖంగా ప్రయాణించేందుకు తోడ్పడుతుంది.


Click it and Unblock the Notifications








