అత్యుత్తమ వాహన రుణం పొందాలంటే.. ఇలా చేయండి..!

Car Loan
ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల ఆర్థిక సంస్థలు వాహన రుణ సదుపాయాన్ని కల్పిస్తున్న సంగతి తెలసిందే. మరి వాటి అత్యత్తుమ కార్ లోన్ ఏంటో తెలుసుకోవటం కాస్తంత క్లిష్టమైన అంశమే. అయినప్పటికీ, ఈ చిన్ని విషయాలను గుర్తుంచుకొని, కాస్తం మీ సమయాన్ని జోడించి ప్రయత్నిస్తే బెస్ట్ వెహికల్ లోన్‌ను సొంతం చేసుకొని డబ్బును ఆదా చేసుకోవచ్చు.

సాధారణంగా కారు ఎక్స్‌-షోరూమ్ ధరపైనే డిస్కౌంట్‌, లోన్‌, బీమా సౌకర్యాలను అందిస్తామని ఎవరైనా డీలర్ డీలర్‌ చెబితే అది 'బెస్ట్‌ లోన్‌ ఆఫర్‌'గా భావించరాదు. ఈ సందర్భంలో మీకు కారు వాస్తవిక ధర గురించి కొంచెమైనా అవగాహన ఉండాలి. ఇప్పుడు చాలా వరకూ కార్ కంపెనీలు తమ అధికారి వెబ్‌సైట్లలో కార్ల ఎక్స్-షోరూమ్ ధరల గురించి సమాచారాన్ని అందిస్తున్నాయి.


నిజానికి డీలర్ వద్ద లోన్‌లో కారును కొనుగోలు చేసినట్లయితే 'డీలర్ కమిషన్' (కనీసం 2 శాతం) కొంత మొత్తం వెళ్తుంతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కనీసం నాలుగైదు ప్రముఖ ఫైనాన్స్ కంపెనీలను కొటేషన్లను పరిశీలించిన తర్వాత మాత్రమే కార్ లోన్‌ను ఫైనలైజ్ చేయాలి. కొన్ని ఫైనాన్స్ కంపెనీలు తమ ప్రతిపాదించిన డీలర్ వద్ద కారును కొనుగోలు చేస్తేనే లోన్ సదుపాయం కల్పిస్తామని చెప్తారు.

అయితే, మీరు అదే ఆఫర్ ఎంచుకోవాలని ఏమీ లేదు. ఈ సందర్భంలో మీరు మరికొందరు డీలర్లను సంప్రదించి వారి వద్ద ఉన్న ఫైనాన్స్ సౌకర్యం గురించి తెలుసుకోవాలి. ప్రస్తుతం కార్ లోన్లను పోల్చి చూపేందుకు ఎన్నో వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. దీనిపై మీరు కాస్త సమయాన్ని వెచ్చించగలితే మీ డబ్బు ఆదా కావడమే కాకుండా, అత్యుత్తమ వాహన రుణాన్ని కూడా పొందవచ్చు.

కార్ లోన్‌ను ఖరారు చేసుకునేటప్పుడు ప్రధానంగా క్రింది అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.
- తక్కువ వడ్డీ రేటు
- తక్కువ ప్రాసెసింగ్ ఫీజ్
- ప్రీ పేమెంట్ పెనాల్టీ
- ఆర్థిక సంస్థ యొక్క విశ్వసనీయత
- ఇతర సేవలు

చాలా వరకూ ఏజెంట్లు లేదా డీలర్లు లోన్ యొక్క పూర్తి బ్రేకప్‌ను ఇవ్వరు. ఇలాంటి సందర్భాల్లో మీరు చెల్లించే మొత్తం రుణం ఎంతో తెలుసుకోవడానికి, అన్ని ఇఎమ్ఐలు, ప్రాసెసింగ్ ఫీజులు, ఏవైనా ఇతర ఫీజులు ఉంటే వాటిని కలిపి అందులో నుంచి వాహనం యొక్క ఆన్-రోడ్ ధరను తీసివేసినట్లయితే మొత్తం మీరు చెల్లించే రుణం ఎంతో తెలిసిపోతుంది.

ఇలా రెండు మూడు ఆర్థిక సంస్థలు/బ్యాంకుల నుండి కొటేషన్లను పొంది వాటిలో ఏది తక్కువో, ఏది ఉత్తమమైనది చూసుకొని అందులో సరైన దానిని ఎన్నుకోవచ్చు. అంతేకాకుండా, కార్ లోన్లపై మొహమాటపడకుండా బేరం (బార్గైన్) కూడా అడగవచ్చు. ఫలితంగా మోడల్‌ను బట్టి రూ.20,000 లకు పైగా సొమ్మును సేవింగ్‌ చేసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, November 28, 2011, 15:36 [IST]
English summary
Finding a best vehicle loan is bit difficult in these. Now, so many financial institutions are offering different schemes. Car finance can become complex because of the financing deal between the car dealer and the bank. Here is the check list for buyers reference.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+