కార్ లోన్ పొందడం ఎలా... కావలసిన అర్హతలు ఏంటి..?

Car Loan
లక్షల రూపాయలు అప్పు చేసి ఫైనాన్స్‌లో కారు కొనుగోలు చేస్తున్నప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. కారు సంబంధిత ఖర్చులను తగ్గించుకోవాలంటే.. తక్కువ వడ్డీ రేటుకు అత్యుత్తమ రుణసదుపాయాన్ని అందించే సంస్థలను ఎన్నుకోవాలి. ఇందుకోసం ఇతర ఫైనాన్స్ సంస్థలను నమ్ముకోవడం కన్నా బ్యాంకుల ద్వారా రుణం పొందడం ఉత్తమమైన మార్గం.

వాహన రుణాలను అందించడంలో వివిధ బ్యాంకులు పోటీపడుతూ తక్కువ వడ్డీరేట్లను అందిస్తుంటాయి. అటువంటి బ్యాంకులలో విశ్వసనీయమైన బ్యాంకును ఎన్నుకొని రుణం పొందడం మంచిది. అయితే బ్యాంకు ద్వారా రుణం పొందం అంటే అంత సులువైన విషయం కాదు. ఇందుకు చాలా ఓర్పు అవసరం. రుణ ధరఖాస్తుకు సంబంధించి బ్యాంకు డాక్యుమెంటేషన్ విధానం కాస్తంత ఆలస్యం కావచ్చు. కానీ.. రుణగ్రస్తుల వద్ద కొన్ని సరైన పత్రాలు ఉంటే దీనిని సులువుగా అధిగమించవచ్చు.

అయితే డీలర్లు, తయారీదారులతో సంబంధం ఉన్న ఫైనాన్స్ కంపెనీలు మాత్రంలో అతి వేగంగా రుణాన్ని మంజూరు చేస్తారు. కానీ.. వడ్డీ వడ్డన కూడా భారీగానే వసూలు చేసి వినియోగదారుల జేబులు కొల్లగొడుతుంటారు. వాహన రుణాల కోసం వివిధ ఫైనాన్స్ స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో మనకు ముఖ్యంగా వినిపించేది "జీరో పర్సెంట్ ఫైనాన్స్", మరొకటి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు. ఈ జీరో పర్సెంట్ ఫైనాన్స్ స్కీమ్‌లో వడ్డీ నష్టాన్ని డీలరు మరియు ఫైనాన్స్ కంపెనీలు భరిస్తాయి.

కానీ.. ఈ స్కీమ్‌లో మాత్రం డీలరు తగ్గింపు (డిస్కౌంట్) ఉండదు. అంతేకాకుండా.. జీరో పర్సెంట్ ఫైనాన్స్ స్కీమ్‌లో ఇన్‌స్టాల్‌మెంట్ (వాయిదా పద్దతి) కాలపరిమితి సాధారణ రుణ కాలపరిమితి (లోన్ టెన్యూర్) కన్నా తక్కువగా ఉంటుంది. ఇక ఆకర్షనీయమైన వడ్డీ రేట్లకే రుణాలిస్తామంటూ ఊదరగొట్టే కొన్ని ఫైనాన్స్ కంపెనీలు వినియోగదారులతో తొలుత బాగానే వ్యవహరించినా తర్వాతి కాలంలో వడ్డీ రేట్ల పెంచే అవకాశం ఉంది. కాబట్టి ప్రైవేటు ఫైనాన్సు తీసుకునేటప్పుడు కాస్తంత అప్రమత్తంగా ఉండటం మంచిది.

ఇకపోతే.. వాహణ రుణాన్ని పొందడానికి కావలసిన అర్హతలు, ధృవీకరణ పత్రాలు వంటి కొంత సాధారణ సమాచారం మీకోసం...

రుణం పొందడానికి కావలసిన సాధారణ అర్హత:
1. ధరఖాస్తుదారుని కనీస వయస్సు: 18 ఏళ్లు (ఉద్యోగస్తులు), 21 ఏళ్లు (వ్యాపారస్తులు)
2. ఉద్యోగస్తులు ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో కనీసం ఒక్క ఏడాది పాటు పనిచేసి ఉండాలి.
3. వ్యాపారస్తులు కనీసం రెండేళ్ల పాటు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి ఉండాలి.
4. సాధారణంగా మంజూరు చేసే కనీస రుణ మొత్తం లక్ష రూపాయల నుండి ప్రారంభమవుతుంది.

కార్ లోన్ కోసం కావలసిన పత్రాలు:

కార్ లోన్లపై ప్రతి బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థలు అందించే వడ్డీ రేట్లు వేర్వేరుగా ఉంటాయి. అలాగే కారు లోన్ మంజూరు కోసం ఈ కిందివాటిలో కనీసం కొన్ని పత్రాలను సదరు బ్యాంకు కానీ లేదా ఫైనాన్సు సంస్థలకు గానీ సమర్పించాల్సి ఉంటుంది.

ఉద్యోగస్తులు సమర్పించాల్సిన పత్రాలు:
* చిరుమానా కోసం వీటిలో ఏదైనా ఒక పత్రాన్ని సదరు ఫైనాన్స్ సంస్థలకు సమర్పించాల్సి ఉంటుంది. (ఇంటి లీజు లేదా లైసెన్స్ అగ్రిమెంట్, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇంటి పన్ను చలానా, వోటర్ గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్, టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, నీటి పన్ను చలానా, క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్, పోస్ట్ పెయిడ్ మొబైల్ ఫోన్ బిల్లు)

* గుర్తింపు కోసం వీటిలో ఏదైనా ఒక పత్రాన్ని సదరు ఫైనాన్స్ సంస్థలకు సమర్పించాల్సి ఉంటుంది. (పాస్‌పోర్టు, ఫోటో క్రెడిట్ కార్డు, పాన్ కార్డు, వోటర్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ రంగ ఉద్యోగులైతే.. ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డు, స్థానిక పంచాయితీ గుర్తింపు కార్డు)

* అలాగే ఉద్యోగుల ఆదాయ ధృవీకరణ కోసం ఫారమ్ 16ను, తాజాగా జారీ చేసిన శాలరీ పే స్లిప్‌లను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి.

వ్యాపారస్తులు సమర్పించాల్సిన పత్రాలు:
* చిరునామా కోసం సమర్పించే పత్రాలలో వ్యాపారానికి (ఫ్యాక్టరీ, సంస్థ) సంబంధించిన చిరునామా ప్రతిభింభించేలా ఉండాలి.

* గుర్తింపు కోసం వీటిలో ఏదైనా ఒక పత్రాన్ని ఫైనాన్స్ సంస్థలకు సమర్పించాల్సి ఉంటుంది. (పాస్‌పోర్టు, ఫోటో క్రెడిట్ కార్డు, పాన్ కార్డు, వోటర్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, తాజా సేల్స్ టాక్స్ వివరాలతో కూడిన పత్రం, సేల్ టాక్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్)

* ఆదాయ ధృవీకరణ కోసం తాజా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ (ఆదాయపు పన్ను పత్రం)ను సిద్ధంగా ఉంచుకోవాలి.

ఈ పత్రాలు మీ వద్ద ఉన్నట్లయితే బ్యాంకు ద్వారా కానీ.. లేదా ఫైనాన్సు సంస్థల ద్వారా రుణాన్ని సులువుగా పొందవచ్చు. వాహన రుణం తీసుకునేముందు ఒకటికి రెండు సార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్న వడ్డీ రేట్లను సరిపోల్చుకున్నట్లయితే తక్కువ వడ్డీకే మంచి లోన్ పొందవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, February 11, 2011, 11:50 [IST]
English summary
Are you going to buy a new Car in finance. Then please spend a few minutes here, you will find the right way to get good deal. So many new car buyers are overlook for the importance of financing a car properly. For getting the right car loan, at a good interest rate is the best way to cut car-related costs. Here is some basic information about Car Financing.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+