బైక్ 'హ్యాండిల్ బార్స్' వల్ల కలిగే లాభాలు తెలిస్తే వెంటనే బింగించుకుంటారు!
నేడు ప్రతీ ఇంట్లో బైక్ అనేది సర్వసాధారణం అయ్యింది. చాలా మంది నేడు బైక్‌లను వినియోగిస్తున్నారు. అయితే మనం బైక్‌లలో క్రమం తప్పకుండా లేదా ఉపయోగించే కొన్ని బైక్ భాగాల పనితీరు గురించి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా 100 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న బైక్ హ్యాండిల్స్‌కి ఇరువైపులా కొంతమంది ప్రత్యేకమైన 'ఎడ్జ్'లను బిగించడం మనం గమనించే ఉంటాం. ఇది బైక్ హ్యాండిల్ బార్ పొడవుని పెంచడంతో పాటు బైక్‌కి అదనపు అందాన్ని అందిస్తుందని అందరూ నమ్ముతారు. కానీ హ్యాండిల్ బార్ ప్రొటెక్టర్ అని పిలువబడే వీటివల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆ వివరాలపై ఓ లుక్కేయండి.
హ్యాండిల్ బార్ సేఫ్టీ ప్రమాదాల సమయాల్లో కాపాడుతుంది. రైడింగ్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ సమయంలో నష్టం నుంచి రక్షణ కల్పించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సమయంలో హ్యాండిల్ బార్ జరిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. బ్రేక్, క్లచ్ లివర్స్ వంగకుండా లేదా విరిగి పోకుండా ఉండేలా చేస్తుంది. హ్యాండిల్ బార్ ఎండ్ ప్రొటెక్టర్లు లివర్లకు ఎటువంటి హాని తలెత్తకుండా చూస్తాయి.

ముఖ్యంగా చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు ఈ ప్రొటెక్టర్స్ ఎంతో విలువైనవి కాబట్టి అనవసర ఖర్చులను తగ్గించుకోవచ్చు. బైక్ ఇతర వాహనాలు లేదా వస్తువులను ఢీకొన్నప్పుడు హ్యాండిల్ బార్ ఎండ్ సేఫ్టీ ఫీచర్‌గా పనిచేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో రైడర్ చేతులను కాపాడేందుకు, అద్దాలు పగిలిపోకుండా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేశారు. అందువల్ల హ్యాండిల్ బార్స్‌ని పెట్టుకోవడం సేఫ్టీ అని చెప్పవచ్చు.
హ్యాండిల్ బార్ ఎండ్ ప్రొటెక్టర్స్ బైక్ వైబ్రేషన్‌ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. రైడ్ సమయంలో వైబ్రేషన్స్ కాస్త ఇబ్బందులకు గురిచేస్తాయి. ఈ ప్రొటెక్టర్స్ ఈ వైబ్రేషన్స్‌ని తగ్గించడానికి హ్యాండిల్ సజావుగా ఉండేలా చేస్తుంది. వైబ్రేషన్ లేకపోతే రైడ్స్ మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. వాహనాన్ని నియంత్రించడం సులభం కావడం వల్ల రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా పెరుగుతుంది.

ఇక వివిధ బైకులలో, హ్యాండిల్ బార్ ఎండ్ ప్రొటెక్టర్స్ ఐరన్ లేదా ప్లాస్టిక్‌తో ఉంటాయి. అయితే ఈ రెండు కూడాను ఒకే సేఫ్టీని అందిస్తాయి. సేఫ్టీ, రైడర్ల సౌలభ్యానికి ఇది గొప్ప మంచి ఆప్షన్‌గా ఉంటుంది. కాబట్టి ఈ భాగం అన్ని మోటారుసైకిళ్లకు అదనపు రక్షణను కల్పిస్తుంది. చాలా మంది బైక్ లుక్‌ని పెంచే విషయంగా వీటిని అర్థం చేసుకుంటారు. కానీ ఇవి పైన తెలిపిన విధంగా ఉపయోగపడతాయి.
కొన్ని కంపెనీలు బైక్ హ్యాడింల్ వైబ్రేషన్‌ని తగ్గించడానికి తయారీదారులు వాటిని కొంచెం మందమైన డిజైన్లలో అందిస్తున్నారు. చాలా మంది ద్విచక్ర వాహనదారులకు ఈ విషయం పూర్తిగా తెలియదు. ప్రస్తుతం భారత రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయి. మనకు తెలియకపోయినా వాహనం కిందపడే పరిస్థితులు ఎదురుకావచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఉపయోగపడే ఇలాంటి మెటీరియల్స్ వాహనాన్ని కాపాడటమే కాకుండా డ్రైవింగ్‌ని మరింత సులభతరం చేస్తాయి.

ఈ హ్యాండిల్ బార్ ఎండ్ ప్రొటెక్టర్స్ మోటార్ సైకిల్ స్టైలింగ్‌ని పెంచుతాయి. బజాజ్ సంస్థ పల్సర్ బైక్‌లో ఈ ఎండ్స్‌ని ఇన్‌బిల్ట్‌గా అందిస్తుంది. కానీ అన్నింటికంటే ముఖ్యంగా ఇద అందిచే సేఫ్టీ అని గుర్తుంచుకోవాలి. బైక్ కొనేటప్పుడు ఇలాంటి ప్రయోజనాలు కలిగించే భాగాలపై అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే బైక్‌లోని ప్రతీ పార్ట్ ఏదో ఒక సమయంలో మీకు సహాయపడే అవకాశం ఉంటుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








