కారు మైలేజ్‌ను లెక్కించడం ఎలా..!?

మరి మైలేజ్ గురించి డీలర్లు, కంపెనీలు చెప్పినట్లుగానే వారి కార్లు ఎంత వరకూ మైలేజీనిస్తాయనే విషయాన్ని పరిశీలించుకోవాలి. కారు మైలేజీ అనేది వివిధ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మరి మీ కారు ఎంత మైలేజీనిస్తుందని విషయాన్ని తెలుసుకోవడం ఎలా.. అని ఆలోచించే వారి కోసం ఈ చిన్ని చిట్కాలు.
* ఇంధన (ఫ్యూయెల్) ట్యాంక్‌ను పై మూత వరకూ వచ్చేలా పూర్తిగా నింపేయండి.
* ఇంజన్‌ను స్టార్ట్ చేయడానికి ముందు ఓడోమీటర్ రీడింగ్‌ను నమోదు చేసుకోండి, మీ కారులో ట్రిప్ మీటర్ ఉన్నట్లయితే దాన్ని సున్నా (జీరో)కు సెట్ చేసుకోండి.
* మీరు ఎల్లప్పుడూ డ్రైవింగ్ చేసే విధంగానే కారును డ్రైవ్ చేయండి.
* ఫ్యూయెల్ గేజ్ కారులో ఇంధనం సగం ట్యాంక్ లేదా కాలుభాగం ఉన్నట్లు సూచించినప్పుడు మళ్లీ ట్యాంక్‌ను ఇంధనంతో పూర్తిగా ఫుల్ చేయించండి (ఇదివరకు ట్యాంక్ ఫుల్ చేయించిన పెట్రోల్ బంకులోనే ఇంధనం కొనుగోలు చేయడం ఉత్తమం).
* ట్యాంకులో ఖాలీ భాగాన్ని భర్తీ చేయడానికి ఎన్ని లీటర్ల ఇంధనం పట్టిందో నోట్ చేసుకోండి.
* మరోసారి ఓడోమీటర్ రీడింగ్‌ను కూడా నమోదు చేసుకోండి.
* తొలి మరియు తుది ఓడోమీటర్ రీడింగ్‌ల వ్యత్యాసాన్ని, రెండోసారి ఇంధనం భర్తీ చేయడానికి పట్టిన పరిమాణం (లీటర్లు)తో భాగిస్తే వచ్చే సగటే కారు యొక్క మైలేజ్ అవుతుంది.
ఉదాహరణకు మొదటిసారి ట్యాంక్ ఫుల్ చేయించినప్పుడు ఓడోమీటర్ రీడింగ్ 1000 కి.మీ. వద్ద ఉంది అనుకుందాం. రెండోసారి ట్యాంక్ ఫుల్ చేయించినప్పుడు ఓడోమీటర్ రీడింగ్ 1300 కి.మీ. వద్దకు చేరుకుని ఉండి, ట్యాంక్‌లో ఖాలీ స్థలాన్ని భర్తీ చేయడానికి 15 లీటర్ల ఇంధనం పట్టినట్లయితే, మీ కారు మైలేజీ ప్రతి లీటరుకు 20 కి.మీ అవుతుంది.
ఎలా అంటే, తొలి రీడింగ్ నుండి తుది రీడింగ్‌ను తీసివేస్తే ప్రయాణించిన మొత్తం దూరం వస్తుంది (1000km - 1300km = 300km). ఈ దూరం ప్రయాణించడానికి అయిన ఇంధన పరిమాణం మరియు రెండోసారి ట్యాంక్‌లోని ఖాలీ స్థలాన్ని నింపడానికి పట్టే ఇంధన పరిమాణం రెండూ కూడా సమానంగా ఉంటుంది. ప్రయాణించిన దూరాన్ని ఖర్చైన ఇంధనంతో భాగిస్తే మైలేజీ వస్తుంది.
ఇక్కడ ప్రయాణించిన దూరం 300 కి.మీ. మరియు ఖర్చైన ఇంధనం 15 లీటర్లు. 300 కి.మీ. లను 15 లీటర్లతో భాగిస్తే వచ్చే ఫలితం 20 కి.మీ. అంటే మీ కారు ఇచ్చే మైలేజ్ లీటరుకు 20 కిలోమీటర్లన్నమాట.


Click it and Unblock the Notifications








