ప్రమాదంలో కాపాడేవి ఎయిర్‌బ్యాగ్స్‌ మాత్రమే కాదు.. ఇతర సేఫ్టీ ఫీచర్ల గురించి మీకు తెలుసా?

ఇప్పుడు కారు కొనుగోలుదారులు చేసే ముందు చాలా మంది సేఫ్టీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కువ ఇంటీరియర్‌ ఫీచర్లు అందించే కార్లకంటే సేఫ్టీ ఫీచర్లు అధికంగా ఉండే వాటి పైనే జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ట్రెండ్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. అందులోనూ క్రాష్‌టెస్ట్‌లో కార్లు ఫర్ఫామెన్స్‌ రేటింగ్‌ ఆధారంగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రతీ కారులో ప్రయాణీకుల భద్రతకు ఎయిర్ బ్యాగ్స్‌ అనేవి చాలా కీలకం. భారీ ప్రమాదంలోనూ ఇవి ప్రయాణికుల ప్రాణాలను కాపాడగలవు. కారులోని ఇతర ఫీచర్లతో పోలిస్తే ప్రయాణీకులను రక్షించడంలో భద్రతా ఫీచర్లు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి మాత్రమే కాకుండా మిగతా సేఫ్టీ ఫీచర్లు వీటిని సకాలంలో తెరచుకునేందుకు ఎలా పనిచేస్తాయంటే?

యాక్సిడెంట్‌లో భద్రత కోసం సీట్ బెల్ట్స్‌ అత్యంత కీలకం. ఇవి ప్రయాణీకులను సురక్షితంగా ఉంచుతాయి. అంతే కాకుండా ప్రమాద తీవ్రతను కూడా తగ్గిస్తాయి. సీట్ బెల్ట్స్‌ని సరిగ్గా ఉపయోగిస్తేనే ఎయిర్ బ్యాగులు బాగా పనిచేస్తాయి. సీట్ బెల్ట్ ధరించకపోయినా, సరిగా బిగించకపోయినా ఎయిర్ బ్యాగ్ పనిచేయదు. వీటితో పాటు సడన్ బ్రేకింగ్ సమయంలో చక్రాలు లాక్ కాకుండా ABS (Anti Braking System) నిరోధిస్తుంది.

How-AirBags-Activate

ఈ బ్రేకింగ్‌ వాహనంపై పూర్తి నియంత్రణకు సహాయపడుతుంది. తడి, జారిపోయే రోడ్లపై ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఏబీఎస్ వాహనాలు మరింత సురక్షితంగా ఉంటాయి. వాహనం వేగంగా వెళుతున్నప్పుడు ఇసుకలో జారిపోవడం ఇతర చోట్ల నియంత్రణ కోల్పోకుండా నిరోధించడానికి ESP (Electronic Stability Program) సహాయపడుతుంది. వాహనం వన్ సైడ్‌లో ఒరిగే సమయంలోనూ ఇది బ్రేకులను ఆటోమేటిక్‌గా వర్తింపజేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఫీచర్ కీలకంగా ఉంటుంది.

క్రాంబుల్ జోన్ ప్రాంతాలు ప్రమాద సమయంలో ప్రభావ శక్తిని గ్రహిస్తాయి. క్యాబిన్‌కి ప్రమాదాని పంపే సమయంలో క్రాష్ ఫోర్స్‌ని తగ్గించడం ద్వారా ఇవి ప్రయాణీకులను రక్షించడంలో సహాయపడతాయి. ఆధునిక కార్లను భద్రతను మెరుగుపరచడానికి ఈ క్రాంబుల్ జోన్లతో రూపొందించారు. కారు కొనేటప్పుడు ఈ విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

AirBag-Light

వాహనం పక్క నుంచి మరో వాహనం ఢీకొన్న సందర్భంలో వాహనం పక్కకు సేఫ్టీ రీఇన్ఫోర్స్డ్ డోర్లు, సైడ్ ఎయిర్ బ్యాగులు ఏర్పాటు చేశారు. ఈ ఫీచర్లు పార్శ్వ ఘర్షణల సమయంలో ప్రయాణీకులను రక్షిస్తాయి. ఇలాంటి ప్రమాదాల్లో మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అలాగే ఏడీఏఎస్ టెక్నాలజీలో లేన్ చేంజింగ్ వార్నింగ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ వ్యవస్థలు డ్రైవర్లకు ప్రమాదాలను నివారించడంలో సహాయపడతాయి. ప్రస్తుతం చాలా కార్లు ఈ ఏడీఏఎస్ టెక్నాలజీతో వస్తున్నాయి. టీపీఎంఎస్ అని పిలువబడే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ టైర్ ప్రెజర్ తక్కువగా ఉన్నప్పుడు వాహనం డ్రైవర్లను హెచ్చరిస్తుంది.

Air-Bag-Light

వెహికల్ స్థిరత్వం మరియు ఫ్యూయల్ ఎకానమీ కొరకు సరైన టైర్ ప్రెజర్ అవసరం. ఇది టైర్ పేలిపోయే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇవాళ పలు వాహనాల్లో వచ్చింది. చైల్డ్ సేఫ్టీ సీట్లు మరియు ఐసోఫిక్స్ యాంకర్ పాయింట్ పిల్లలు సురక్షితంగా జతచేయబడేలా చూస్తాయి. ప్రమాదంలో పిల్లల భద్రతకు ఈ అంశాలు ముఖ్యమైనవి. ఇలాంటి ఫీచర్ ఉందని కూడా చాలా మందికి తెలియదు. దాని గురించి తెలుసుకోవడం మంచిది.

రెగ్యులర్ చెక్‌అప్‌తో సేఫ్టీ ఫీచర్లు సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. బ్రేకులు, టైర్లు, లైట్లను తనిఖీ చేయడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చు. ఇది వాహన పనితీరును మెరుగుపరచవచ్చు. అందుకే దూర ప్రయాణాలకు వెళ్తున్నప్పుడు అన్ని చెక్ చేసుకోవాలని ఆటోమొబైల్ తయారీదారులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. చివరగా కార్లకు ఎయిర్ బ్యాగులు చాలా అనివార్యమైనప్పటికీ, వాటిపై మాత్రమే ఆధారపడటం సరిపోదు. అన్ని సేఫ్టీలు కలిగిన కారుని ఎంచుకుని సురక్షిత ప్రయాణాన్ని కొనసాగించండి.

More from DriveSpark

Article Published On: Sunday, July 14, 2024, 10:59 [IST]
English summary
How other safety features activate airbags in emergency situation
Read more on: #airbag #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+