మీ కారు మైలేజీని ఎలా లెక్కించాలి.. మైలేజీని పెంచడానికి ఈ చిట్కాలు తప్పకుండా తెలుసుకోవాలి
కార్లను కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అంశాల్లో మైలేజ్ చాలా ముఖ్యమైనది. తాము కొనుగోలు చేసే కారు కొత్తదైనా, పాతదైనా సరే మైలేజ్ విషయంలో ప్రత్యేక దృష్టి సారించడం అవసరం. మీరు కారు రన్నింగ్ కాస్ట్‌ను తగ్గించుకోవాలంటే ఎక్కువ మైలేజీనిచ్చే కార్లనే కొనుగోలు చేయటం మంచిది.
చాలా వరకు కార్ల కంపెనీలు సర్టిఫై చేసే మైలేజ్(Car Mileage) గణాంకాలు చాలా సందర్భాల్లో పేపరు మాత్రమే పరిమితమై ఉంటాయి. వాస్తవంలోకి వస్తే డ్రైవింగ్ కండిషన్స్‌లో, కంపెనీలు పేర్కొన్నట్లుగా ఖచ్చితమైన మైలేజీని పొందటం సాధ్యం కాదు. ఇంకా మరికొన్ని సందర్భాల్లో కంపెనీ పేర్కొన్న మైలేజీ కన్నా ఎక్కువ మైలేజీ ఇచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి.

కానీ ఇక్కడ సందర్భం ఏదైనా కారుకు సంబంధించి మైలేజీ అనేది ముఖ్యం. కారును నడిపే తీరు, రోడ్డు, లోడ్, టైర్ ప్రెజర్ ఇలా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మరి మీరు నడిపే కారు ఖచ్చితంగా ఎంత మైలేజీనిస్తుందనే విషయాన్ని తెలుసుకోవానుకుంటున్నారా.. దానికి చిన్న క్యాలుక్యులేషన్ ఉంది. ఈ కథనం ద్వారా మీ కారు మైలేజీని ఎలా లెక్కించాలో తెలుసుకోండి. మీ ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఇది మీకు సహాయపడుతుంది.
ఓడో మీటర్ రీడింగ్: మొదటగా మీ కారులో ట్రిప్ మీటర్‌ని రీసెట్ చేయండి లేదా ఓడోమీటర్ నుంచి ప్రస్తుత రీడింగ్‌ను నోట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ప్రయాణించే మొత్తం దూరాన్ని ట్రాక్ చేసుకోండి. ఇప్పుడు మీ కారులో ఫ్యూయెల్ ఉన్నా మళ్లీ దానిని పూర్తిగా నింపండి. ఇప్పుడు మీరు అదనంగా నింపిన ఫ్యూయెల్ మొత్తాన్ని నోట్ చేసుకోండి.

స్పీడ్ డ్రైవింగ్ వద్దు: మీ కారును ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత, మీరు పరిమిత వేగంతో మాత్రమే కారును నడపండి. ఎప్పుడైనా సరే మీరు స్పీడ్ లిమిట్స్ నిర్వహించడం ద్వారా అధిక మైలేజీ పొందే అవకాశం ఉంది. ఇప్పటివరకు మీరు ప్రయాణించిన దూరాన్ని లెక్కించడానికి ఓడో మీటర్‌లో ప్రస్తుత రీడింగ్ నుంచి మొదటగా నోట్ చేసుకున్న రీడింగ్‌ను తీసివేయండి.
ఇప్పుడు మీ కారు ఎంత మైలేజీ ఇస్తుందో తెలుసుకోవడానికి మీరు అదనంగా నింపిన ఫ్యూయెల్ ఎన్ని లీటర్లు ఉందో దానితో ప్రయాణించిన దూరాన్ని విభజించండి. దీని ద్వారా మీ కారు ఎంత మైలేజ్ ఇస్తుందో తెలుసుకోవచ్చు. దానికి అనుగుణంగా మీరు మిగతా ట్రిప్‌లను ప్లాన్ చేసుకోవచ్చు.

రెగ్యులర్ మెయింటెనెన్స్: మీరు మీ కారును ఆయిల్ మార్పులు, టైర్ రొటేషన్లు మరియు ఎయిర్ ఫిల్టర్ రీప్లేస్‌మెంట్‌లతో సహా క్రమం తప్పకుండా మెయింటనెన్స్ చేయడం చాలా అవసరం. తరచుగా మీ కారుకు సర్వీసింగ్, సరైన నిర్వహణ చేయడం ద్వారా మెరుగైన ఇంధన సామర్థ్యం ఇస్తూ మీ కారు పనితీరును పెంచుతుంది.
మీ కారుకు సంబంధించి మైలేజీ వివరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. అంటే ఏ సమయంలో ఎంత మైలేజీ ఇస్తుంది లాంటివి, ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నాయా అనేది పరిశీలించాలి. ఇంధన సామర్థ్యంలో తగ్గుదలను గమనిస్తే.. మీరు మీ డ్రైవింగ్ తీరులో సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. లేదంటే మంచి మెకానిక్‌తో మీ కారును తనిఖీ చేయించడం ఉత్తమం. తద్వారా మంచి ఇంధన సామర్థ్యాన్ని పొందుతూ డబ్బును ఆదా చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








