మోటార్‌సైకిల్ ఇంజన్ ఆయిల్ మార్చటం ఎలా - చిట్కాలు
మోటార్‌సైకిల్ ఇంజన్ స్మూత్‌గా నడవాలంటే.. ఇంజన్‌లో తగినంత మరియు నాణ్యమైన ఇంజన్ ఆయిల్ ఉండటం ఎంతో అవసరం. ఇంజన్ ఆయిల్‌ను నిర్దిష్ట కిలోమీటర్లకు ఒక్కసారి చొప్పున మార్చుకుంటూ ఉండాలి లేకపోతే ఇంజన్‌లో పిస్టన్‌ల ఫ్రిక్షన్ అస్తవ్యస్తంగా జరిగి ఇంజన్ సీజ్ అయ్యే ఆస్కారం ఉంది. అంతేకాకుండా, ఎప్పటికప్పుడు ఇంజన్‌లోని ఇంజన్ ఆయిల్ స్థాయిని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఇంజన్ ఆయిల్ స్థాయి తగ్గినట్లు అనిపిస్తే సరిపడా ఇంజన్ ఆయిల్‌తో ఇంజన్‌ను నింపాలి.
ఇంజన్ ఆయిల్ రంగు మారినట్లు అనిపిస్తే దానిని పూర్తిగా తీసివేసి కొత్త ఇంజన్ ఆయిల్‌తో ఇంజన్‌ను నింపాలి. ఇంజన్ లైఫ్ పెరగాలంటే, నాసి రకం ఇంజన్ ఆయిల్స్ కాకుండా కంపెనీ ప్రతిపాదించే బ్రాండెడ్ ఇంజన్ ఆయిల్స్‌ను వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. సాధారణంగా ఇంజన్ ఆయిల్‌ను మార్చుకునేందుకు చాలా మంది తరచూ మెకానిక్‌లను ఆశ్రయిస్తుంటారు. వాస్తవానికి ఇంజన్ ఆయిల్‌ను మార్చుకోవటం చాలా సులువు. ఇంటివద్దనే అందుబాటులో ఉండే వస్తువులు, స్పేర్స్ సాయంతో ఇంజన్ ఆయిల్‌ను మార్చుకోవచ్చు. అదెలానో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!
అస్సలు ఇంజన్ ఆయిల్ ఎందుకు వాడాలి..?
ఇంజన్‌లో పిస్టన్ వద్ద చలనంలో ఉన్న రెండు తలాల మధ్య రాపిడి వల్ల ఘర్షణ పుట్టి ఇంజన్ సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి ఇంజన్‌లో చిక్కగా ఉండే ఇంజన్ ఆయిల్‌ను ఉపయోగిస్తారు. పిస్టన్స్ పనిచేస్తున్నప్పుడు చిక్కటి ఇంజన్ ఆయిల్ ఓ సన్నటి పొరగా ఏర్పడి ఘర్షణని తగ్గిస్తుంది తద్వారా ఇంజన్ సామర్థ్యం పెరిగి ఎక్కువకాలం పనిచేస్తుంది.

మోటార్‌సైకిల్ ఇంజన్ ఆయిల్ మార్చటం ఎలా?
ముందుగా టూల్ కిట్, ఇంజన్ ఆయిల్‌ను సిద్ధం చేసుకోవాలి.

మోటార్‌సైకిల్ ఇంజన్ ఆయిల్ మార్చటం ఎలా?
ఇంజన్‌కు పైభాగంలో ఇచ్చిన ప్లాస్టిక్ క్యాప్‌ను తొలగించి, అందులోని ఫ్యూయెల్ లెవల్ ఇండికేటర్ సాయంతో ఇంజన్ ఆయిల్ ఏ రంగులో ఉంది, ఏ స్థాయిలో ఉందో చెక్ చేసుకోవాలి.

మోటార్‌సైకిల్ ఇంజన్ ఆయిల్ మార్చటం ఎలా?
ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇంజన్ ఆయిల్‌ను మార్చాలని నిర్ణయించుకుంటే, ఇంజన్‌కు క్రింది భాగంలో ఇంజన్ ఆయిల్‌ను డ్రెయిన్ చేసుకునేందుకు ఇచ్చిన బోల్టును స్పానర్ సాయంతో తొలగించుకోవాలి.

మోటార్‌సైకిల్ ఇంజన్ ఆయిల్ మార్చటం ఎలా?
ఇంజన్ ఆయిల్‌ను ఇంజన్ నుంచి బయటకు తీసేందు కోసం క్రింది భాగంలో అమర్చిన బోల్టును తొలగించడానికి ముందుకుగా, డ్రెయిన్ అయ్యే ఇంజన్ ఆయిల్ క్రింద పడకుండా ఉండేందుకు, ఇంజన్ క్రింది భాగంలో ఓ పాత ప్లాస్టిక్ ట్రే లాంటి దానిని ఉంచాలి.

మోటార్‌సైకిల్ ఇంజన్ ఆయిల్ మార్చటం ఎలా?
ఇంజన్ నుంచి ఇంజన్ ఆయిల్ పూర్తిగా తొలగిపోయిన తర్వాత, ఇంజన్ క్రింది భాగంలో ఉండే బోల్టును యదావిధికా బిగించి, కొత్త ఇంజన్ ఆయిల్‌ను ఇంజన్ పైభాగంలో ఉండే రంధ్రం గుండా నింపాలి. ఇంజన్ ఆయిల్ స్థాయిని చెక్ చేసుకున్న తర్వాత ప్లాస్టిక్ క్యాప్‌తో గట్టిగా ఈ రంధ్రాన్ని మూసివేయాలి.

మోటార్‌సైకిల్ ఇంజన్ ఆయిల్ మార్చటం ఎలా?
చూశారా ఇంజన్ ఆయిల్‌ను మార్చుకోవటం ఎంత సులువో.. ఇది తెలియక అనేక మంది మెకానిక్‌లకు డబ్బులు సమర్పించుకుంటుంటారు.


Click it and Unblock the Notifications








