మీ కారు వరద నీటిలో మునిగిపోయిందా? దయచేసి అతి తెలివి ప్రదర్శించకండి.. ముందు ఇలా చేయండి!

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగి పొర్లడంతో వరదలు ఎక్కువై జనావాసాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ వర్షాలతో భారీ ఆస్తి నష్టం జరుగుతోంది. దాదాపు వందల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. కొన్ని కార్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కార్ల రిపేర్‌కి భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మేము అందించే చిట్కాలను పాటించి మీ ఖర్చుని ముందుగా అంచనా వేసుకోండి. తద్వారా అదనపు ఖర్చు భారాన్ని తగ్గించుకోండి. అనవసరంగా తొందరిపడి మీ కారు రిపేర్‌ ధరను మీరే పెంచేసుకోకండి.

టైర్లు: భారీ వర్షాలకు టైర్లు భూమిలో కూరుకుపోతాయి. అలా చేయడం వల్ల టైర్స్‌ వద్ద ఉండే స్లాష్ గార్డ్స్ (Splash Guards) చుట్టూ బురద పేరుకుంటుంది. దీంతో మీ కారు ముందుకు కదలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలానే మీ కారుని ముందుకు కదిలించలేని స్థితిలో ఉంటే వెంటనే వాటర్‌ స్ప్రే చేసి బురదను తొలగించిన తర్వాతే కారుని ముందుకు కదిలించండి. ఇంజిన్‌ దెబ్బతినని సందర్భాల్లో ఈ మాత్రం చేస్తే సరిపోతుంది.

Checking Post Vehicle Maintenance after floods in Ap and Telangana

వైపర్లు, విండ్‌షీల్డ్: వరదలో చిక్కుకున్న కార్లపై దుమ్ము, చెత్త వచ్చి చేరుతుంది. ఇది వైపర్లు, విండ్‌షీల్డ్‌లను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ సమయంలో మీరు వైపర్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల అవి త్వరగా అరిగిపోతాయి. అంతేకాకుండా విండ్‌షీల్డ్‌పై గీతలు ఏర్పడతాయి. దీనివల్ల విండ్‌షీల్డ్‌ పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ కారు పరిస్థితిని బట్టి వైపర్లను మొదటగా క్లీన్‌ చేయండి. లేదా స్ప్రే నాజిల్‌తో కాసేపు ఆన్‌ చేసి శుభ్రం చేయండి.

బ్రేక్స్‌: మీ కారు నీటిలో మునిగితే బ్రేక్ ప్యాడ్స్‌, డిస్క్‌లు పూర్తిగా దెబ్బతింటాయి. ఈ బ్రేక్స్‌ పనితీరు భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మీరు అదే తడి రోడ్లపై డ్రైవింగ్‌ కొనసాగాలని భావిస్తే బ్రేకింగ్ సిస్టమ్‌ త్వరగా అప్లై అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. ఇది కొత్త చిక్కులను తెచ్చిపెడుతుంది. మీ కారు నీటిలో తడిసిన తర్వాత బ్రేక్‌లను చాలా సేప్‌ అప్లై చేస్తూ వదిలేయాలి.

Checking Post Vehicle Maintenance after floods in Ap and Telangana

ఎలక్ట్రికల్ సిస్టమ్స్: కారు ఎలక్ట్రికల్ సిస్టమ్స్‌ తేమ కారణంగా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇది లైట్లు, సెన్సార్లు, ఇతర భాగాలలో షార్ట్ సర్క్యూట్‌లకు దారి తీస్తుంది. కావున కనెక్టర్లపై డై-ఎలక్ట్రికక్‌ గ్రీజును అప్లై చేయండి. ఎలక్ట్రికల్ వైరింగ్‌ సరిగ్గా ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోండి. ఆ తర్వాత బ్యాటరీ టెర్మినల్స్, ఫ్యూజ్ బాక్స్‌లను చెక్‌ చేయండి. ఆ తర్వాత ఓ సారి ఇంజిన్‌ ఆన్‌ చేయండి.

ఇంజిన్: ఇంజిన్‌లోకి ప్రవేశించే నీరు నేరుగా సిలిండర్‌లలోకి వెళ్తుంది. ఇది పిస్టన్ కదలికను అడ్డుకుంటుంది. దీని వలన తీవ్ర నష్టం జరుగుతుంది. ఇది ఇంజిన్‌లో కీలకం కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకుని ఇంజిన్‌ని స్టార్ట్‌ చేయండి. ఇందుకోసం నిపుణుల లేదా మెకానిక్‌ సహాయం తీసుకోండి. మీకు అవగాహన లేకుంటే అలానే వదిలేయండి కానీ అనవసర ప్రయత్నాలు చేసి కొత్త చిక్కులు తెచ్చుకోవద్దు.

Cars Underbody Protection

అండర్ బాడీ పార్ట్స్‌: ఎగ్జాస్ట్ సిస్టమ్, ఫ్యూయల్ లైన్స్‌, సస్పెన్షన్‌తో సహా కారులోని అండర్ బాడీ పార్ట్స్‌ ఎక్కువ రోజులు బురదలో ఉంటే తుప్పు పట్టే అవకాశం ఉంది. దీని కోసం యాంటీ-రస్ట్ క్లీనింగ్ చేయించాలి. ఇక బ్యాటరీలను బేకింగ్ సోడా లిక్విడ్‌ లేదా పెట్రోలియం జెల్లీని ఉపయోగించి క్లీన్‌ చేయండి. ఇక మీ కారు పెయింటింగ్‌ పూర్తిగా తొలగిపోయిందని భావిస్తే హై-క్వాలిటీ పెయింట్‌ వాక్సింగ్‌ చేయించుకోవాలి.

More from DriveSpark

Article Published On: Thursday, September 5, 2024, 12:52 [IST]
English summary
How to check post flood vehicle damage and precautions need to follow
Read more on: #auto tips #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+