బైక్‌పై వెళ్లే వారు ఇలాంటి 'రెయిన్‌కోట్స్‌' తీసుకుంటే ఇబ్బందులు ఉండవు..లేదంటే తడిసిపోతారు..!

వర్షాకాలం వచ్చిందంటే మనలో చాలామంది రెయిన్ కోట్స్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయాల పనుల్లో నిమగ్నమై పోతారు. ఇందులో బైకర్లు కూడా ఒక గ్రూప్. వర్షాకాలం ప్రారంభం కాగానే బైకర్లు చేసే మంచి రెయిన్ కోట్ తీసుకోవడం తెగ ఇబ్బందులు పడతారు. సరైన రెయిన్ కోట్‌ను ఎలా ఎంచుకోవాలో ఈ కథనంలో చూద్దాం.

వాటర్ ప్రూఫ్ మెటీరియల్: మనం రెయిన్ కోట్ కొన్నప్పుడు మొదట చూడాల్సింది రెయిన్ కోట్ దేనితో తయారైందో. మనం తీసుకునే కోటు మామూలు ప్లాస్టిక్ కంటే మంచి మెటీరియల్‌తో తయారైతే.. వర్షపు నీరు లోపలికి రాకుండా అడ్డుకుంటుంది.

Raincoats-for-Riders

ఫిట్ అండ్ సైజ్: రెయిన్‌కోట్ కొనేటప్పుడు గుర్తుంచుకోవలసిన మరో ముఖ్యమైన అంశం రెయిన్‌కోట్ యొక్క సైజ్ మరియు ఫిట్. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేటప్పుడు కొందరు అయోమయానికి గురై పెద్ద పరిమాణంలో ఉన్న రెయిన్ కోట్ ను ఎంచుకుంటారు. తద్వారా వర్షపు నీరు కోటులోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది.

విజిబిలిటీ: రెయిన్‌కోట్ కొనేటప్పుడు మరో ముఖ్యమైనది దాని విజిబిలిటీ. దీనికి కారణం రాత్రిపూట మనం తిరిగేటప్పుడు ఎదురుగా వచ్చే వాహనాలు సులభంగా గుర్తించేలా వాహనదారులకు అనువైన కలర్లను ఎంచుకోవాలి. రిఫ్లెక్టర్లు ఉన్న కోటును కొనుగోలు చేయడం ఇంకా మంచిది.

Raincoats-for-Bike Riders

పాకెట్లు: రెయిన్ కోట్ లో పాకెట్లు చాలా ముఖ్యమైనవి. వర్షాకాలంలో బైక్ నడిపేటప్పుడు మనకు కావాల్సిన వస్తువులను తడిసిపోకుండా జేబుల్లో వేసుకునే వీలుంటుంది. రెయిన్ కోట్ కొనేటపుడు .. జేబులు లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాబట్టి పాకెట్లు ఎక్కువగా ఉన్న వాటిని కొనుగోలు చేయాలి.

క్వాలిటీ: రెయిన్‌కోట్ కొనేటప్పుడు మంచి క్వాలిటీ ఉన్న రెయిన్‌కోట్‌ను ఎంచుకోవాలి. తక్కువ ధరకే మంచి క్వాలిటీ మన్నికైన రెయిన్ కోట్స్ కూడా ఉన్నాయి. మనం ఎంచుకున్నప్పుడు దాన్ని సరిగ్గా పరిశీలించి ఎంచుకోవాలి. క్వాలిటీ వియంలో రాజీపడితే త్వరగా చెడిపోతాయి. తద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Raincoats

వానకాలంలో బైక్ నడిపేటప్పుడు మీరు కచ్చితమైన జాగ్రత్తలు పాటించాలి. లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా వానాకాలంలో బైక్స్ స్కిడ్ అయ్యే అవకాశం ఎక్కువ కాబట్టి తక్కువ స్పీడ్‌లో ప్రయాణం చాలా ఉత్తమం.

వానాకాలంలో రోడ్లపై పడే ఇంధనం, ఆయిల్‌లు ఉంటాయి. వీటికి జారే గుణం ఉంటుంది. కాబట్టి ప్రయాణంలో సడెన్ బ్రేక్స్ వేయడం ప్రమాదాలను కొని తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచీతూచి డ్రైవ్ చేయాలి. టైర్లలో గాలి, బ్యాటరీ పనితీరు సరిగ్గా ఉంచుకోవడం ద్వారా వానాకాలంలో ప్రయాణాలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు.

Raincoats-for-Riders

డ్రైవ్స్‌పార్క్‌ వ్యాఖ్య: రెయిన్ కోట్ కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలలలో ఇవి కీలకం. వీటిని కొనేముందు ఉపయోగాలు , రివ్యూల ఆధారంగా తీసుకుని పరిశీలించాలి. కొన్నిసార్లు మన కోటు ఏ బ్రాండ్ సంబంధించిందో తెలుసుకుని కొనడం చాలా ముఖ్యం.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, July 7, 2023, 20:54 [IST]
English summary
How to choose best raincoats for bike riders deails in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+