రూ. 5 లక్షలతో మీ కారు బుల్లెట్ ఫ్రూఫ్‌గా మార్చుకోవచ్చు.. ఇదిగో వివరాలు!
ప్రపంచంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా తమ ప్రాణాలకు ముప్పు ఉండటంతో తమ వాహనాలను బుల్లెట్ ఫ్రూఫ్‌గా వినియోగిస్తున్నారు. దీనివల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా తమను తాము రక్షించుకోగలుగుతామని విశ్విస్తారు. మీ సాధారణ కారును బుల్లెట్ ప్రూఫ్ కారుగా మార్చాలంటే ఏం చేయాలి.. దీనికోసం మీ కారులో చేయాల్సిన భారీ మార్పులు తదితర అంశాలకు సంబధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
ప్రస్తుతం వాహనాలను కొనుగోలు చేసే ముందు ప్రతి ఒక్కరు సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎక్కువగా రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తల నుంచి ప్రాణాపాయం ఉన్న ప్రతి ఒక్కరూ సురక్షిత ప్రయాణం కోసం బుల్లెట్ ఫ్రూఫ్‌ని వినియోగిస్తున్నారు. వీటి వినియోగం రోజు రోజుకి పెరుగుతుంది. కానీ ఆ కార్లను సామాన్యులు కొనలేరు. అయితే బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని ఎలా తయారు చేస్తారో ఈ కథనంలో తెలుసుకుందాం..

బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఖరీదైనవి. సాధారణ కార్లలో బుల్లెట్ ప్రూఫ్ టెక్నాలజీ ఉండదు. దీనిని మార్పు చేసేందుకు వేర్వేరు దశలు ఉన్నాయి. ప్రతి దశలో వివిధ రకాల అంశాలు ఉంటాయి. కారును మోడిఫై చేసే దానికంటే వాటి కోసం ఉపయోగించే భాగాలు, ఇతర ఫీచర్లు అత్యంత ఖరీదైనదైనవిగా ఉంటాయి. బయటి భాగాలను బుల్లెట్ ప్రూఫ్‌ని అల్యూమినియంతో పూర్తిగా అమర్చాలి. తద్వారా బుల్లెట్లు లోనికి రాదు.
కారు చుట్టూ ఉండే స్టీల్ ప్లేట్స్ (బలిస్టిక్ నైలాన్,కెవ్లర్)తో మిళితం చేయబడి ఉంటుంది. ఇది బుల్లెట్స్‌ని లోనికి వెళ్లనివ్వదు. దీనిని ఫుల్ బాడీ చుట్టూ ఇన్‌స్టాల్ చేసే ముందు బాడీ ఏరియాతో పాటు, డోర్ ఏరియాను పూర్తిగా మార్చాలి. ఆ తర్వాతే అప్‌గ్రేడ్ చేయడానికి వీలు ఉంటుంది. అయితే ముందు భాగంలోని గాజు అద్దంలో ఈ ఆప్షన్ ఉండదు.

బుల్లెట్లు లోనికి వెళ్లకుండా ఉండేందుకు స్ట్రాంగ్ గ్లాసెస్ మార్కెట్‌లో ఉన్నాయి. ఆ అద్దాలను ఉపయోగించడం ద్వారా తుపాకీ బుల్లెట్ దాడి నుండి తప్పించుకోవచ్చు. ఇక టైర్ల విషయానికొస్తే బుల్లెట్లు గుచ్చుకుంటే అందులోని గాలి విడుదలై మొత్తం పంక్చర్ అవుతుంది. కానీ టైర్లను తుపాకులతో గుచ్చినా ఆపరేట్ చేసేలా చేయవచ్చు. పంక్చర్ అయిన టైర్లతో నిర్ణీత వేగంతో కొంత దూరం ప్రయాణించే సామర్థ్యం ఉన్న టైర్లు మార్కెట్లో ఉన్నాయి.
చివరగా సస్పెన్షన్ వ్యవస్థను కూడా మార్చాల్సి ఉంది. అసలు కారు లోపల సస్పెన్షన్ అనేది ఎందుకు మార్చాల్సిన అవసరం ఉంటుదని ఆశ్చర్యపోకండి. మీరు మీ వాహనాన్ని బుల్లెట్ ప్రూఫ్ చేసినప్పుడు, వాహనం బరువు చాలా రెట్లు పెరుగుతుంది. కారు కొనుగోలు చేసేటప్పుడు వచ్చే సస్పెన్షన్ సిస్టమ్.. మీ కారును బుల్లెట్ ప్రూఫ్‌గా అప్‌గ్రేడ్ చేయాల్సి వచ్చినప్పుడు సస్పెన్షన్ ప్లాన్‌ని కచ్చితంగా మార్చాలి.

సస్పెన్షన్ మార్చినప్పుడు మీరు మరింత మెరుగ్గా డ్రైవింగ్ చేయగలుగుతారు. దీనికి ఎక్కువ ఖర్చు అవుతుంది. కారు పరిమాణాన్ని బట్టి ఖర్చు ఆధారపడి ఉంటుంది. కారు ఎంత పెద్దదైతే ఖర్చు అంత ఎక్కువగా ఉంటుంది. చిన్న కారు అయితే కాస్త తక్కువే ఉంటుంది. మన దేశంలో కార్లను బుల్లెట్ ప్రూఫ్‌గా మార్చడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇందుకోసం రూ .5 లక్షల నుండి రూ .40 లక్షల వరకు ఖర్చవుతుంది.
డ్రైవ్స్‌పార్క్ వ్యాఖ్య: ఇక లగ్జరీ కారు అయినా, పెద్ద కారు అయినా రూ.కోటి వరకు ఖర్చవుతుంది. చాలా మంది వాహనదారులు తమ వాహనాన్ని బుల్లెట్ ప్రూఫ్ చేయాలని కోరుకుంటారు. కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. దీనికోసం అయ్యే ఖర్చు గురించి చాలా మందికి తెలియదు. కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ కథనాన్ని అందించాము.


Click it and Unblock the Notifications








