పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ ఉందా?? వెంటనే తొలగించి ఈ 32 బ్యాంకుల్లో మాత్రమే ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోండి!!
ఆడిట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం పేమెంట్ బ్యాంక్‌పై చర్యలు తీసుకుంది. ఈ ఆంక్షల గురించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇకపై వాహనాలలో పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ (Paytm FASTag)ని కూడా వినియోగించలేరు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
మార్చి 15 తర్వాత పేటీఎం బ్యాంక్ ద్వారా రన్ అయ్యే ఫాస్ట్‌ట్యాగ్‌ని వినియోగించడం కుదరదు. మీరు అకౌంట్‌ని డియాక్టివేట్ చేసుకుని మరొక బ్యాంకు ద్వారా కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. Paytmపై ఫాస్ట్‌ట్యాగ్‌పై సైతం ఆంక్షలు ఎత్తివేస్తే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ బ్యాంకులను ఎంచుకోవాల్సిందిగా బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు.

మార్చి 15 తర్వాత Paytm లావాదేవీలు పరిమితం చేయబడినందున వాహనాలలో Paytm FASTag పని చేయదు. దీనివల్ల మీరు సాధారణ ధరల కంటే టోల్ గేట్ల (Tollgate) వద్ద రెండింతలు ఎక్కవ నగదు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలోని అన్నీ టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపు పరిమితం చేయబడింది. కేవలం ఫాస్ట్‌ట్యాగ్ చెల్లింపు వ్యవస్థ మాత్రమే అమలు చేయబడుతోంది. కాబట్టి మీకు ఫాస్ట్ ట్యాగ్ లేనట్లైతే డబుల్ అమౌంట్ చెల్లించాల్సిందే.
ప్రస్తుత RBI జారీ చేసిన ఆదేశాల ప్రకారం, Paytm FASTag మార్చి 5 వరకు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత, ఖాతాలో తగినంత డబ్బు ఉన్నప్పటికీ Paytm FASTag పని చేయదు. మార్చి 15 నుంచి Paytm బ్యాంక్ ద్వారా ఎటువంటి డిపాజిట్ లేదా లోన్ ఇవ్వకుండా, ఏ కస్టమర్‌కు టాప్-అప్, వాలెట్, ఫాస్ట్‌ట్యాగ్, NCMC కార్డ్, ఇతర సేవలను వెంటనే నిలిపివేయాలని RBI ఆదేశించింది.

అయితే వాలెట్‌లోని బ్యాలెన్స్‌ను ఉపసంహరించుకోవడం లేదా ఉపయోగించడంపై ఎలాంటి పరిమితి లేదు. ఇక ఏదైనా వడ్డీ చెల్లింపులు, క్యాష్‌బ్యాక్‌లు లేదా తిరిగి చెల్లింపులు ఎప్పుడైనా చేయవచ్చు. అయితే పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ ఉన్నవారు వెంటనే అకౌంట్‌ని డెలీట్ చేసుకోవాలి. అంతే కాకుండా ఇకపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సూచించిన 32 బ్యాంకుల ద్వారా మాత్రమే ఫాస్ట్‌ట్యాగ్‌లు జారీ చేయబడతాయి. దీనికి సంబంధించిన పూర్తి గైడ్‌లైన్స్ కోసం NHAI వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు.
NHAI అధికారికంగా గుర్తించిన బ్యాంకుల జాబితాలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిటీ యూనియన్ బ్యాంక్, కాస్మోస్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఉన్నాయి.

ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాలను తొలగించే పద్ధతులు: కొత్త బ్యాంకుల ద్వారా ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకునే వారు మొదటగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి తమ ఖాతాలను తొలగించాల్సి ఉంటుంది. ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాను తొలగింపు విధానం
1. మీ యూజర్ ఐడీ, వాలెట్ ఐడీ, పాస్వర్డ్‌ని ఉపయోగించి ఫాస్ట్‌ట్యాగ్‌ని ఉపయోగించి పేటీఎం పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి.
2. ఆ తర్వాత 'హెల్ప్ అండ్ సపోర్ట్' పై క్లిక్ చేయండి.
3. అందులోని 'ఫాస్ట్‌ట్యాగ్ ప్రొఫైల్ అప్డేట్ చేయడానికి సంబంధించిన ప్రశ్నలు' ఉన్న ఆప్షన్‌ని ఎంచుకోండి.
4. అందులో 'నేను నా ఫాస్టాగ్ క్లోజ్ చేయాలనుకుంటున్నాను' అనే ఆప్షన్‌కి క్లిక్ చేసి మీ అకౌంట్‌ని డెలీట్ చేసుకోవచ్చు.

ఫాస్ట్‌ట్యాగ్ అంటే ఏమిటి: ఫాస్ట్‌ట్యాగ్ అనేది భారతదేశంలో అమలు చేయబడిన ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ. ఇది NHAIచే నిర్వహించబడుతుంది. ప్రీపెయిడ్ వాలెట్లను ఉపయోగించి టోల్ బూత్‌లలో అతుకులు లేని చెల్లింపులను ప్రారంభించడానికి ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) సాంకేతికత ఆధారంగా ఆటోమేటిగ్ నగదు కట్ అవుతుంది. ఫాస్ట్‌ట్యాగ్‌లు వాహనాల విండ్‌షీల్డ్‌లకు అతికించబడతాయి. ఇది మాన్యువల్ నగదు లావాదేవీల అవసరాన్ని తొలగించి సమయాన్ని తగ్గిస్తుంది.


Click it and Unblock the Notifications








