వర్షాకాలంలో సురక్షితంగా వాహనం నడపటం ఎలా? - చిట్కాలు

వర్షాకాలంలో వాహనాలను నడపటం చాలా సవాలుతో కూడుకున్న పని. ప్రత్యేకించి ఈ కాలంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, రోడ్లపై భారీగా నిలిచిపోయే వర్షపు నీరు, నోరు తెరకుచునే నాళాలు ఇలా అనేక సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కార్ల డ్రైవింగ్ లేదా ద్విచక్ర వాహనాల రైడింగ్‌కు ఆటంకాలుగా మారుతాయి.

వర్షాకాలంలో సురక్షితంగా వాహనం నడపటం ఎలా? - చిట్కాలు

వర్షాకాలంలో తడిగా ఉండే రోడ్లపై వాహనాలను కంట్రోల్ చేయటం లేదా అత్యవసర పరిస్థితుల్లో బ్రేక్ వేసి వాహనాన్ని నిలుపదల చేయటం కొంచెం కష్టంతో కష్టంగా ఉంటుంది. మరోవైపు జోరున కురిసే వర్షంలో డ్రైవర్/రైడర్ దృశ్యమానత (విజిబిలిటీ) కూడా తక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి సవాలుతో కూడుకున్న వాతావరణంలో వాహనాలను సురక్షితంగా నడపటం ఎలానో తెలుసుకుందాం రండి.

వర్షాకాలంలో సురక్షితంగా వాహనం నడపటం ఎలా? - చిట్కాలు

1. అరిగిపోయిన టైర్లను మార్చండి

వర్షాకాలంలో తడిసిన రోడ్లపై టైర్లకు మరియు రోడ్డుకు మధ్య ఘర్షణ చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీ వాహనపు టైర్లు పూర్తిగా అరిగిపోయి ఉన్నట్లయితే, అలాంటి వాహనాలు వర్షా కాలంలో తక్కువ స్టాపింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే, బ్రేక్ వేసిన ప్రాంతం నుండి వాహనం నిలిచే ప్రాంతం మధ్య దూరం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుంది.

వర్షాకాలంలో సురక్షితంగా వాహనం నడపటం ఎలా? - చిట్కాలు

ఇటువంటి సందర్భాల్లో అత్యవసరంగా బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు వాహనం రోడ్డుపై జారిపోయి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి, ఈ సీజన్‌లో మీ ప్రయాణం సురక్షితంగా సాగాలంటే, మీ వాహనానికి సరైన గ్రిప్‌తో కూడిన టైర్లు ఉండటం అవసరం. టైర్లు అరిగిపోయినట్లుగా భావిస్తే, తక్షణమే వాటిని కొత్త వాటితో రీప్లేస్ చేసుకోవటం మంచిది.

వర్షాకాలంలో సురక్షితంగా వాహనం నడపటం ఎలా? - చిట్కాలు

2. బ్రేక్‌లను తనిఖీ చేయండి

సాధారణంగా వానాకాలంలో తడిరోడ్లపై బ్రేకులు సరిగ్గా పనిచేయవు. పొడిగా ఉన్న రోడ్లతో పోల్చుకుంటే, తడిరోడ్లపై వెహికల్ స్టాపింగ్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. తడిసిన బ్రేక్ రోటర్లు/కాలిపర్లు కారణంగా బ్రేకింగ్ సామర్థ్యం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా, అరిగిపోయిన బ్రేక్ షూలు ఈ సమయంలో ప్రమాదాలకు కారణం అవుతుంటాయి.

వర్షాకాలంలో సురక్షితంగా వాహనం నడపటం ఎలా? - చిట్కాలు

కాబట్టి వర్షాకాలానికి అనుగుణంగా బ్రేక్‌లను సిద్ధం చేసుకోవటం మంచిది. ఆరోగ్యకరమైన బ్రేకులు అంటే, సురక్షితమైన స్టాపింగ్ అని గుర్తుంచుకోండి. వర్షం పడుతున్నప్పుడు మరియు తడిసిన రోడ్లపై వాహనాలను నెమ్మదిగా నడపండి. ప్రత్యేకించి మలుపుల వద్ద వేగాన్ని తగ్గించి, జాగ్రతగా డ్రైవ్ చేయండి.

వర్షాకాలంలో సురక్షితంగా వాహనం నడపటం ఎలా? - చిట్కాలు

3. అధిక వేగాన్ని నివారించండి

వర్షాకాలంలో అధిక వేగంతో వాహనాలను నడపడం చాలా ప్రమాదకరం. వర్షంలో అధిక వేగం ప్రమాదాల తీవ్రతను పెంచుతుంది. ఈ సందర్భంలో, కారును చాలా నెమ్మదిగా నడపడం శ్రేయస్కరం. ఇటువంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా బ్రేకులు వేయటం లేదా స్టీరింగ్ వీల్‌ని అకస్మాత్తుగా తిప్పడం చేయకూడదని గుర్తుంచుకోవాలి.

వర్షాకాలంలో సురక్షితంగా వాహనం నడపటం ఎలా? - చిట్కాలు

4. తడిసిపోయి కారులోకి ప్రవేశించకండి

వానలో ముద్దగా తడిసిపోయి మాత్రం కారులోకి ప్రవేశించకండి. తడిసిన బట్టలతో డ్రైవింగ్ చేయటం కాస్తంత చిరాకుగా అనిపిస్తుంది. దీని వలన పరధ్యానానికి లోనై ప్రమాదాలను కొని తెచ్చుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా తడిసిన సీట్లు కారు లోపల దుర్వాసనకు కారణం కావచ్చు. వర్షాకాలంలో వీలైనంత వరకూ కారులో ఒక గొడుగు, ఒక జత పొడి బట్టలు మరియు కొన్ని ప్లాస్టిక్ బ్యాగ్స్‌ను ఉంచుకోవటం మంచిది.

వర్షాకాలంలో సురక్షితంగా వాహనం నడపటం ఎలా? - చిట్కాలు

5. కారుని సర్వీస్ చేయించండి

వర్షాకాలంలో మీ కారుని తప్పనిసరిగా సర్వీస్ చేయించాలి. వానాకాలంలో డ్రైవింగ్‌కి అనుగుణంగా మీ కారును సిద్ధంగా ఉంచుకోవాలి. టెక్నీషియన్ సలహా మేరకు అవసరమైన అన్ని మరమ్మతులు చేయించుకోవాలి. పైన తెలిపిన అంశాలనే కాకుండా వైపర్స్, హెడ్‌లైట్స్, హాజర్డ్ లైట్స్, బ్రేక్స్ లైట్స్ మరియు బ్యాటరీ వంటి పలు అంశాలను కూడా తనిఖీ చేయించాలి అవసరమైన వాటిని కొత్త వాటితో భర్తీ చేసుకోవాలి.

Most Read Articles

English summary
How to drive a vehicle safely in rainy season tips
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X