సురక్షితమైన డ్రైవింగ్ కోసం కొన్ని చిట్కాలు
డ్రైవింగ్ అనేది కొందరికి సరదా, మరికొందరికి అవసరం. ఏదేమైనప్పటికీ, డ్రైవింగ్ అనేది ఓ మంచి అనుభూతిగా మిగిలిపోవాలే కాని, జీవితాల్లో మాయని మచ్చగా, తీర్చలేని లోటుగా మారకూడదు. డ్రైవింగ్ విషయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద పెద్ద తప్పిదాలకు కారణం కాకూడదు. డ్రైవింగ్ చేసేటప్పుడు పాటించాల్సిన కొన్ని చిట్కాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!
- సందేహం కలిగినప్పుడు బ్రేక్ అప్లయ్ చేయండి.
- హారన్ ఇవ్వకుండా లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్‌టేక్ చేసే మోటారిస్టుల పట్ల అప్రమత్తంగా ఉండండి.
- లేన్లను మారేటప్పుడు ఎల్లప్పుడూ ఇండికేటర్లను ఉపయోగించండి
- ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ లైట్ చూసి వేగంగా డ్రైవ్ చేయకండి, అది ఎప్పుడు ఎరుపు రంగులోకి మారిపోతుందో తెలుసుకోవటం కష్టం.
- రాత్రివేళ్లలో, ప్రత్యేకించి వర్షాకాలంలో హైబీమ్ లైట్లను ఉపయోగించకండి. ఎల్లప్పుడూ లోబీమ్ లైట్లనే వాడండి.
- మహిళలతో ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్నప్పుడు (లేదా రైడ్ చేసేది మహిళలే అయినా) దుపట్టాను సరిచేసుకోండి. అది చక్రాల్లో విరుక్కుపోకుండా జాగ్రత్త వహించండి.
- వంపు రోడ్లు, మలుపుల వద్ద ప్రయాణిస్తున్నప్పుడు లోపలివైపు నుంచి అస్సలు ఓవర్‌టేక్ చేయకండి. ఇలాంటి మలుపులు వద్ద నెమ్మదిగా, జాగ్రత్తగా ప్రయాణించండి.
- రియర్ వ్యూ మిర్రర్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ, మీ వెనుకగా వచ్చే వాహనాలపై ఓ కన్నేసి ఉంచండి.
- మీ కారు మార్జిన్లను చక్కగా తెలుసుకోండి, పార్కింగ్ సమయాల్లో, యూ టర్న్ తీసుకునే సందర్భాల్లో ఇది చాలా ముఖ్యం.
- బైలైన్ నుంచి మెయిన్ రోడ్డుకు జాయిన్ అయ్యేటప్పుడు రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్‌ను గమనించండి.
- డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్, గ్యాడెట్స్ వంటి పరికరాలను ఉపయోగించకండి.
- ఎట్టి పరిస్థితుల్లోను మద్యం సేవించి డ్రైవ్ చేయకండి.



Click it and Unblock the Notifications








