బజాజ్ ఆటో ఒరిజినల్ విడిభాగాలను గుర్తించండం ఎలా..?

Bajaj Genuine Parts
నకిలీ విడిభాగాలకు (స్పేర్ పార్ట్స్) చెక్ పెట్టేందుకు బజాజ్ ఆటో తమ ఉత్పత్తులపై కొన్ని ప్రత్యేక గుర్తులను అలాగే, ప్రతి ప్యాక్‌పై ఓ హాలోగ్రాఫిక్ స్ట్రిప్‌ను జతచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నకిలీ ఉత్పత్తులను తయారు చేసే నకిలీ సంస్థ పెరుగుతునే ఉన్నాయి.

మరి ఒరిజిల్ స్పేర్ బజాజ్ పార్ట్‌కు నకిలీ స్పేర్ పార్ట్‌కు మధ్య తేడాలను ఎలా గుర్తించాలో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం...!

- టచ్ అండ్ ఫీల్: బజాజ్ ఆటో అందించే స్పేర్ పార్ట్‌లపై గోల్డ్ హలోగ్రాఫిక్ స్ట్రిప్ ఉంటుంది. దీనిని చేతితో స్పురించి (టచ్ చేసి) చూసినప్పుడు పేపర్ స్థాయి (పేపర్ లెవల్)కు స్ట్రిప్ స్థాయికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. అంటే, స్ట్రిప్ ఉన్న పేపర్ స్థాయి కన్నా కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఇది లేబుల్‌కు ఎడమ వైపు భాగంలో ఉంటుంది. ఒకవేళ ఇది సమానంగా ఉన్నట్లనిపిస్తే దానిని నకిలీ పార్ట్‌గా పరిగణించవచ్చు.

- పారదర్శక హలోగ్రాఫిక్ ఎఫెక్ట్ లేబుల్: బజాజ్ ఆటో స్పేర్ పార్ట్‌లపై పారద్శక హలోగ్రాఫిక్ అనుభూతితో కూడిన లోగో (బజాజ్ అనే లోగో) ఉంటుంది. ఇది లేబుల్ యొక్క కుడిచేతి వైపు పైభాగంలో మూలవాటంగా ఉంటుంది. ఈ లోగో ఉన్నట్లయితే వాటిని ఒరిజినల్ స్పేర్ పార్ట్‌లుగా పరిగణించవచ్చు.

- గోల్డ్ హలోగ్రాఫిక్ స్ట్రిప్‌పై స్విచ్ ఎఫెక్ట్: ఈ గోల్డ్ హలోగ్రాఫిక్ స్ట్రిప్‌ను 90 డిగ్రీల వాటంలో తిప్పి చూసినప్పుడు అందులో ప్రధానంగా బజాజ్ ఆటో లోగో కనిపిస్తుంది. సాధారణంగా ఉన్నప్పుడు జెన్యూన్ పార్ట్స్ అని కనిపిస్తుంది. ఈ మార్పు గనుక లేనట్లయితే దానిని నకిలీ స్పేర్ పార్ట్‌గా గుర్తించవచ్చు.

- హిడెన్ టెక్స్ట్: గోల్డ్ హలోగ్రాఫిక్ స్ట్రిప్‌ను నాణేం సాయంతో గీసినప్పుడు (స్క్రాచ్) దానిపై జెన్యూన్ అనే ఆంగ్ల పదం కనిపిస్తుంది. అది కనిపించలేదంటే సదరు స్పేర్ పార్ట్ నకిలీదని అర్థం.

పైన తెలిపిన విధంగా బజాజ్ ఆటో ఒరిజినల్ విడిభాగాలు, నకిలీ విడిభాగాలను గుర్తించవచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, January 28, 2012, 16:49 [IST]
English summary
Bajaj Auto has taken elaborate steps to ensure that its genuine spare parts are easy to identify. A holographic strip with special characteristics is a part of every packaged part. The details of the security measures are detailed on the Bajaj Auto website: www.bajajauto.com under the Service section.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+