ఎలక్ట్రిక్ వాహనం యొక్క రేంజ్ (మైలేజ్) ను మెరుగుపరచుకోవడం ఎలా? : చిట్కాలు

భారతదేశంలో ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులు మరియు వినియోగం గణనీయంగా పెరిగింది. గడచిన 2020లో అంతంతమాత్రంగా ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు, 2021 సంవత్సరంలో రెట్టింపు అయ్యాయి. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల భారం నుండి తప్పించుకునేందుకు ప్రజలు ఇప్పుడు బ్యాటరీలతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెరిగాయి.

ఎలక్ట్రిక్ వాహనం యొక్క రేంజ్ (మైలేజ్) ను మెరుగుపరచుకోవడం ఎలా? : చిట్కాలు

ఎలక్ట్రిక్ వాహనాలు నిర్వహణ మరియు యాజమాన్యం విషయంలో పాకెట్ ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా, పర్యా వరణం పరంగా కూడా ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి. అయితే, ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో బాధాకరమైన విషయం మరియు కస్టమర్లను ఆలోచనలో పడవేసే విషయం ఏంటంటే, వాటి యొక్క రేంజ్. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మైలేజ్. సింగిల్ చార్జ్ పై అవి ఆఫర్ చేసే రేంజ్ మరియు మనం నడిపే తీరు అలాగే రోడ్ల పరిస్థితులు మొదలైన అంశాలు ఎలక్ట్రిక్ వాహనాల రేంజ్ ను ప్రభావితం చేస్తాయి.

ఎలక్ట్రిక్ వాహనం యొక్క రేంజ్ (మైలేజ్) ను మెరుగుపరచుకోవడం ఎలా? : చిట్కాలు

ఎలక్ట్రిక్ వాహనాల రేంజ్ ఎలా ఉన్నప్పటికీ, మనం పాటించే కొన్ని చిట్కాల ద్వారా వాటి యొక్క రేంజ్ ను మెరుగుపరచుకోవచ్చు. అదెలానో ఈ కథనంలో చూద్దాం రండి. ఎలక్ట్రిక్ కార్లు రెండు ప్రధాన కారణాల వలన పట్టణ ప్రాంతాల్లో చాలా అద్భుతంగా అనిపిస్తాయి. ఇందులో ఒకటి ఎలక్ట్రిక్ కార్లు చాలా నిశ్శబ్దంగా ఉండి వాయి కాలుష్యాన్ని తగ్గిస్తాయి మరియు అదే సమయంలో ఆటోమేటిక్ కార్ల మాదిరిగా హుందా అయిన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. ఇకపోతే, రెండవది, చాలా వరకూ ఎలక్ట్రిక్ కార్లు బ్రేక్ రీజనరేషన్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. వీటి వలన ప్రయాణంలో బ్రేక్ ప్రతిసారీ కారులోని బ్యాటరీ రీఛార్జ్ అవుతూ ఉంటుంది. ఫలితంగా వాటి రేంజ్ కూడా పెరుగుతూ ఉంటుంది.

ఎలక్ట్రిక్ వాహనం యొక్క రేంజ్ (మైలేజ్) ను మెరుగుపరచుకోవడం ఎలా? : చిట్కాలు

ఎలక్ట్రిక్ వాహనాలను మరింత సమర్థవంతంగా చేయడానికి ట్రాఫిక్‌లో అనుసరించాల్సిన విషయాలు:

సాధారణంగా సిగ్నల్ పడేటప్పుడు కారును అతి వేగంతో నడపకూడదని చాలా మంది చెబుతుంటారు. అయితే, ఈ నిబంధన ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తింపజేయకపోవడమే మంచిది. కానీ, అదే సమయంలో అతి వేగంతో వెళ్లడం కూడా మంచిది కాదు. నియంత్రించదగిన మరియు సురక్షితమైన వేగంతో కారును నడుపుతూ వీలైనంత వరకూ సుదీర్ఘమైన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నిలిచిపోకుండా ఉండేలా చూసుకోండి. ఇది బ్యాటరీ నుండి అనవసరమైన శక్తిని ఉపయోగించడాన్ని నివారిస్తుంది. ఒకవేళ, ఎక్కువ సమయం సిగ్నల్ వద్ద వాహనాన్ని నిలపాల్సి వస్తే, ఇంజన్ ను స్విచ్ ఆఫ్ చేసి, బ్యాటరీ పవర్ ను ఆదా చేసుకోండి.

ఎలక్ట్రిక్ వాహనం యొక్క రేంజ్ (మైలేజ్) ను మెరుగుపరచుకోవడం ఎలా? : చిట్కాలు

రీజనరేటివ్ బ్రేకింగ్ ఫీచర్ ను ఎక్కువగా ఉపయోగించుకోండి:

ప్రస్తుతం విక్రయిస్తున్న చాలా ఎలక్ట్రిక్ కార్లు పునరుత్పత్తి సామర్థ్యంతో (రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్) వస్తున్నాయి. వాహనం ఆఫ్-థ్రోటిల్‌లో నడుస్తున్నప్పుడు కారు బ్యాటరీని ఒక నిర్దిష్ట స్థాయికి రీఛార్జ్ చేయడానికి ఇవి సహాయపడతాయి. మీరు మీ కారులో ఈ ఫీచర్‌ని కలిగి ఉన్నట్లయితే, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది అదనపు రేంజ్ ను పొందడానికి మార్గం సుగమం చేస్తుంది.

ఎలక్ట్రిక్ వాహనం యొక్క రేంజ్ (మైలేజ్) ను మెరుగుపరచుకోవడం ఎలా? : చిట్కాలు

శీతాకాలంలో హీటర్లను ఉపయోగించడం మానుకోండి:

ప్రస్తుత కార్లలో హీటర్‌తో కూడిన ఎయిర్ కండిషనింగ్ సౌకర్యం ఉంది. ఇది ఎలక్ట్రిక్ కార్లలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ శీతాకాలంలో క్యాబిన్ ఉష్ణోగ్రతను పెంచడానికి సహాయపడుతుంది. శీతాకాలంలో సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఈ ఫీచర్ అందించబడింది. ఈ ఫీచర్ ను ఉపయోగించడం వలన కారు లోపల ఉష్ణోగ్రతలు, క్యాబిన్ లో వెచ్చగా అనిపిస్తుంది. నిజానికి, ఇది బాగానే ఉన్నప్పటికీ బ్యాటరీ పవర్ ఖర్చు పరంగా చూసుకుంటే, ఇది చాలా ఎక్కువ చార్జింగ్ పవర్ ను గ్రహిస్తుంది.

ఎలక్ట్రిక్ వాహనం యొక్క రేంజ్ (మైలేజ్) ను మెరుగుపరచుకోవడం ఎలా? : చిట్కాలు

ఫలితంగా, ఈవీ రేంజ్ కూడా తగ్గుతుంది. ప్రత్యేకించి, ఎలక్ట్రిక్ కార్లలో హీటర్ ఫీచర్ ను ఉపయోగించడం వలన ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా వేడి చేయబడుతుంది. ఫలితంగా ఎలక్ట్రిక్ మోటార్ మాత్రమే కాకుండా బ్యాటరీ కూడా వేడెక్కుతుంది. ఇది బ్యాటరీ యొక్క జీవితకాలాన్ని మరియు రేంజ్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల, ఎలక్ట్రిక్ కార్లలో హీటర్లను ఎక్కువగా ఉపయోగించకపోవడమే మంచిది.

ఎలక్ట్రిక్ వాహనం యొక్క రేంజ్ (మైలేజ్) ను మెరుగుపరచుకోవడం ఎలా? : చిట్కాలు

AC వినియోగంలో మరింత శ్రద్ధ అవసరం:

సాధారణ పెట్రోల్ కార్లలో ఉపయోగించినట్లుగా, ఎలక్ట్రిక్ కార్లలో ఏసిని అనవసరంగా ఉపయోగించడం మంచిది కాదు. ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ పవర్ తో పనిచేస్తుంది కాబట్టి, మనం ఆ కారులో ACని ఉపయోగించినప్పుడు అది ఆ ఎలక్ట్రిక్ కారు యొక్క రేంజ్ ను మరియు సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి, అవసరాన్ని బట్టి ఏసీని ఉపయోగించడం ఉత్తమం. ఇది ఎలక్ట్రిక్ కారు యొక్క బ్యాటరీ సామర్థ్యాన్ని వృధా చేయకుండా ఉండటానికి సహాయపడుతుంది.

ఎలక్ట్రిక్ వాహనం యొక్క రేంజ్ (మైలేజ్) ను మెరుగుపరచుకోవడం ఎలా? : చిట్కాలు

వీలైనంత వరకూ ఎలక్ట్రిక్ కార్లను ఇంటి వద్ద ఛార్జర్ తోనే చార్జ్ చేసుకోండి:

ప్రస్తుతం, నగరాల్లో హైస్పీడ్ ఛార్జింగ్ స్టేషన్లు చాలా చోట్ల అందుబాటులోకి వస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని దాదాపు అన్ని ప్రముఖ ప్రదేశాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. సాధారణంగా, తక్కువ సమయంలో తమ ఎలక్ట్రిక్ కార్లను వీలైనంత ఎక్కువ చార్జింగ్ చేసుకోవడానికి వినియోగదారులు ఈ హై-స్పీడ్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఉపయోగిస్తుంటారు. నిజానికి హై-స్పీడ్ చార్జర్లు వాహనం యొక్క చార్జింగ్ సామర్థ్యాన్ని మరియు బ్యాటరీ పనితీరును దెబ్బతీసే ప్రమాదం ఉంది.

ఎలక్ట్రిక్ వాహనం యొక్క రేంజ్ (మైలేజ్) ను మెరుగుపరచుకోవడం ఎలా? : చిట్కాలు

కాబట్టి, వీలైనంత వరకూ ఇంటి వద్దనే ఉండే హోమ్ చార్జర్ల సాయంతో కారులోని బ్యాటరీని చార్జ్ చేసుకోండి. తప్పనిసరి పరిస్థితుల్లో లేదా మార్గ మధ్యంలో ఉన్నప్పుడు మాత్రమే హై-స్పీడ్ చార్జర్ లను ఉపయోగించండి. ఇంటి వద్ద ఛార్జ్ చేసుకునేందుకు తయారీదారులు అందించే ఛార్జింగ్ పరికరాన్ని తరచుగా ఉపయోగించడం వల్ల బ్యాటరీ జీవితకాలం కూడా పొడిగించవచ్చని ఎలక్ట్రిక్ వాహన నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు బ్యాటరీ పూర్తిగా అయిపోకముందే ఇలా చేయడం వల్ల బ్యాటరీ జీవితకాలం కూడా చాలా రెట్లు పొడిగించబడుతుందని చెబుతున్నారు.

ఎలక్ట్రిక్ వాహనం యొక్క రేంజ్ (మైలేజ్) ను మెరుగుపరచుకోవడం ఎలా? : చిట్కాలు

ట్రాఫిక్ జామ్‌లను వీలైనంత వరకు నివారించండి:

పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల మాదిరిగానే, ట్రాఫిక్ రద్దీ వలన ఎలక్ట్రిక్ వాహనాల రేంజ్ కూడా తగ్గుతుంది. రద్దీగా ఉండే ట్రాఫిక్‌లో ఎక్కువ సమయం వాహనాన్ని ఆన్ లో ఉంచడం వలన బ్యాటరీ పవర్ వృధా అవుతుంది. ఒకవేళ, మీరు ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు లేదా పట్టణ ప్రాంతాలలో ప్రయాణించేటప్పుడు రద్దీగా ఉండే రోడ్లను ఉపయోగించకపోవడమే మంచిది. అదే సమయంలో, ఎలక్ట్రిక్ వాహనాలను తక్కువ వేగంతో నడిపితే ఎక్కువ రేంజ్ ను అందిస్తాయి కాబట్టి, వాటిని నగరాల్లో తక్కువ వేగంతో నడపటమే మంచిది.

ఎలక్ట్రిక్ వాహనం యొక్క రేంజ్ (మైలేజ్) ను మెరుగుపరచుకోవడం ఎలా? : చిట్కాలు

క్రూయిజ్ కంట్రోల్ ఉపయోగించవచ్చు:

కార్లలో క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్ అనేది హైవేలపై ప్రయాణించేటప్పుడు కారును స్థిరమైన డ్రైవింగ్ వేగంతో ఆటోమేటిక్ గా డ్రైవర్ నుండి యాక్సిలరేషన్ ఇన్‌పుట్ అవసరం లేకుండా నడపడంలో సహాయపడుతుంది. పెట్రోల్ కార్ల విషయంలో ఇది మైలేజ్ ను పెంచడంలో సహాయపడుతుంది. అలాగే, ఎలక్ట్రిక్ కార్ల విషయంలో కూడా క్రూయిజ్ కంట్రోల్ వాటి బ్యాటరీ రేంజ్ ను పెంచడంలో సహకరిస్తుంది.

Most Read Articles

English summary
How to improve electric vehicle range tips and tricks
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X