కారు బ్రేకింగ్ సిస్టమ్ జీవితకాలం పెరగాలంటే: చాలా సింపుల్.. ఇలా చేయండి

సాధారణంగా వాహనాల భద్రతా విషయంలో బ్రేకులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు అత్యవసర సమయంలో ఈ బ్రేకులు వాహనదారుల ప్రాణాలనే కాపాడతాయి. అది కారు కావచ్చు లేదా బైక్ కావచ్చు. కావున వాహనాలలో బ్రేకింగ్ సిస్టం చాలా ఖచ్చితంగ పనిచేసేలా చూసుకోవాలి. అంతే కాకుండా ఈ బ్రేకులు ఎక్కువరోజులు మన్నికైనవిగా ఉండాలంటే ఏం చేయాలి అనే కొన్ని సాధారణ పద్దతులను గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

కారు బ్రేకింగ్ సిస్టమ్ జీవితకాలం పెరగాలంటే: చాలా సింపుల్.. ఇలా చేయండి

కారు బ్రేక్ వేసేముందు నెమ్మదిగా నడపడం:

రహదారపైనా మీరు కారులో వెళ్తున్నప్పుడు అత్యంత వేగవంతం అత్యంత ప్రమాదాన్ని తీసుకువస్తుంది. ఎందుకంటే ఎక్కువ వేగంగా కారు నడిపే సమయంలో వెంటనే కారుని కంట్రోల్ చేయడం చాలా వరకు అసాధ్యం. ఎందుకంటే గతి శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు, బ్రేక్ ప్యాడ్‌లు బ్రేకింగ్ ప్రక్రియలో ఉత్పన్నమయ్యే వేడిని గ్రహిస్తాయి. కాబట్టి తక్కువ వేగంతో బ్రేకింగ్ చేసినప్పుడు తక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. కావున డ్రైవర్ ఈ పద్దతిని అనుసరిస్తే తరచుగా బ్రేక్‌లను మార్చాల్సిన అవసరం లేదు.

కారు బ్రేకింగ్ సిస్టమ్ జీవితకాలం పెరగాలంటే: చాలా సింపుల్.. ఇలా చేయండి

ఇది కేవలం బ్రేకుల జీవిత కాలాన్ని మెరుగుపరచమే కాదు, తక్కువ వేగంతో ప్రయాణించడం వల్ల మంచి ఫలితాలు కూడా వస్తాయి. ముఖ్యంగా ప్రాణహానినుంచి బయటపడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా రోడ్డు ప్రమాదాల నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ కారుని పరిమిత వేగంతో మాత్రమే నడపాలి. ఇది కేవలం వాహన వినియోగదారులకు మాత్రమే కాదు, రోడ్డుపైన ప్రయాణించే ఇతరులకు కూడా ఇబ్బంది కలిగించకుండా చేస్తుంది.

కారు బ్రేకింగ్ సిస్టమ్ జీవితకాలం పెరగాలంటే: చాలా సింపుల్.. ఇలా చేయండి

బ్రేక్ ఫ్లూయిడ్‌ మార్చడం:

సాధారణంగా బ్రేక్ ప్లూయిడ్ నీటిని పీల్చుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ విధంగా నీటిని పీల్చుకున్నప్పుడు అందులోని తేమ లోపల తుప్పు ఏర్పడటానికి కారణం అవుతుంది, అంతే కాకూండా ఇందులోని రబ్బరు ముద్రలను కూడా పూర్తిగా నాశనం చేస్తుంది. ఈ తేమ పదే పదే బ్రేక్‌లు వేసినప్పుడు బ్రేకింగ్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కావున ఈ సందర్భంలో ఎప్పటికప్పుడు బ్రేక్ ఫ్లూయిడ్‌ను మార్చుతూ ఉండాలి. అప్పుడే బ్రేకులు చాలా సమర్థంగా ఉంటాయి.

కారు బ్రేకింగ్ సిస్టమ్ జీవితకాలం పెరగాలంటే: చాలా సింపుల్.. ఇలా చేయండి

ఎప్పటికప్పుడు బ్రేక్ ప్లూయిడ్ మార్చుతూ ఉండటం వల్ల, బ్రేక్ సిస్టమ్ యొక్క జీవితకాలం కూడా పెరుగుతుంది. అలాగే బ్రేకింగ్ సిస్టమ్ పనితీరును మెరుగుపరుస్తుంది. కాబట్టి బ్రేక్ ఫ్లూయిడ్‌ని సరైన సమయంతో సరిగ్గా భర్తీ చేయండి. దీనిని డ్రైవర్ ఎప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బ్రేకులు సరిగ్గా పనిచేయకపోతే అనుకోని ప్రమాదాలు జరుగుతాయి. అవి ప్రాణాన్ని కూడా హరించవచ్చు.

కారు బ్రేకింగ్ సిస్టమ్ జీవితకాలం పెరగాలంటే: చాలా సింపుల్.. ఇలా చేయండి

కుడి పాదంతో బ్రేక్ చేయడం:

కారులో బ్రేకులు కూడా కుడి పాదంతో వేయడం వల్ల అవి ఎక్కువ కాలం మన్నికైనవిగా ఉంటాయి. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కారు నడపడం సాధారణం, అంటే ఎడమ కాలుతో బ్రేక్‌ని తేలికగా నొక్కాలి. మీరు బ్రేక్ సిస్టమ్ ఎక్కువసేపు ఉండాలనుకుంటే ఈ అలవాటును పూర్తిగా మానేయాలి. బ్రేకులు ఎల్లప్పుడూ కుడి పాదంతోనే వేయడం ప్రయత్నించండి. ఇది కూడా డ్రైవర్ తప్పకుండా గుర్తుంచుకోవాలి.

కారు బ్రేకింగ్ సిస్టమ్ జీవితకాలం పెరగాలంటే: చాలా సింపుల్.. ఇలా చేయండి

కారును ఓవర్‌లోడ్ చేయకుండా ఉండటం:

మీ కారుని అనవసరంగా ఎక్కువ లోడ్ తో లోడ్ చేయవద్దు. కారు బరువు పెరగడం వల్ల బ్రేకులు మాత్రమే కాకుండా టైర్లపై కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి కారులో అనవసరమైన వస్తువులు ఉంటే, వాటిని తొలగించండి. ఇది బ్రేక్‌ల పనితీరుతో పాటు కారు మొత్తం పనితీరును మెరుగుపరుస్తుంది. కావున కారులో మీకు అవసరమైన వాటిని మాత్రమే తరలించడానికి శ్రద్ద చూపాలి.

కారు బ్రేకింగ్ సిస్టమ్ జీవితకాలం పెరగాలంటే: చాలా సింపుల్.. ఇలా చేయండి

బ్రేక్‌ను జాగ్రత్తగా ఎంచుకోవడం:

కారులో మీరు అమర్చుకుని బ్రేకులు కూడా చాలా నాణ్యత ఉన్న బ్రేకులు ఎంచుకుని అమర్చుకోవాలి. ఆలా కాకుండా తక్కువ ధర మరియు నాణ్యత లేని బ్రేక్‌లు అమర్చుకోవడం వల్ల, అవి త్వరగా పాడవుతాయి. కావున ఎల్లప్పుడూ మంచి క్వాలిటీ బ్రేకులు కారులో ఉపయోగించడానికి ప్రయత్నించాలి. బ్రేకులు వాహనదారుల రక్షణకు చాలా అవసరం అన్న సంగతి మీరు ఎప్పుడూ మరచిపోకూడదు. ఆలా చేసినట్లయితేనే మీరు బ్రేకులు పటిష్టంగా ఉంచుకోగలరు.

కారు బ్రేకింగ్ సిస్టమ్ జీవితకాలం పెరగాలంటే: చాలా సింపుల్.. ఇలా చేయండి

కారులో బ్రేకులు మాత్రమే కాకుండా టైర్ వంటి భాగాలపై కూడా తప్పకుండా శ్రద్ధ వహించాలి. సరైన సమయానికి కారును సర్వీసింగ్ చేయడం ద్వారా అనవసరమైన సమస్యలను నివారించవచ్చు. కాబట్టి కార్ల తయారీదారులు / అధీకృత సర్వీస్ సెంటర్ల ద్వారా కారు సమయానికి సర్వీస్ చేయబడిందని నిర్ధారించుకోండి. ఇది చాలా అవసరం.

కారు బ్రేకింగ్ సిస్టమ్ జీవితకాలం పెరగాలంటే: చాలా సింపుల్.. ఇలా చేయండి

బ్రేక్‌ల మాదిరిగానే, క్లచ్ కూడా కారు యొక్క అత్యంత ముఖ్యమైన భాగాలలో ఒకటి. అయితే కొంతమంది క్లచ్ వాడేటప్పుడు చాలా తప్పులు చేస్తుంటారు. ఇది క్లచ్ యొక్క జీవితకాలాన్ని తగ్గిస్తుంది. కానీ కొన్ని సాధారణ పద్ధతుల ద్వారా క్లచ్ యొక్క జీవితకాలం పెంచవచ్చు.

కారు బ్రేకింగ్ సిస్టమ్ జీవితకాలం పెరగాలంటే: చాలా సింపుల్.. ఇలా చేయండి

క్లచ్ యొక్క జీవితకాలాన్ని పెంచే పద్దతుల విషయానికి వస్తే, చాలా మంది కార్ డ్రైవర్లు తమ పాదాలను క్లచ్ పెడల్‌పై ఉంచే అలవాటు కలిగి ఉంటారు. అయితే ఇది మంచి అలవాటు కాదు. పాదాలను క్లచ్‌పై అనవసరంగా ఉంచినట్లయితే, క్లచ్ యొక్క జీవితకాలం తగ్గుతుంది. కాబట్టి క్లచ్‌ను ఉపయోగించేటప్పుడు మాత్రమే, క్లచ్‌పై కాలును ఉంచండి.

కారు బ్రేకింగ్ సిస్టమ్ జీవితకాలం పెరగాలంటే: చాలా సింపుల్.. ఇలా చేయండి

సిగ్నల్ అంటి ప్రదేశాలలో వేచి ఉన్నప్పుడు కారు తటస్థంగా ఉంచండి. ఇది చాలా మంచి ప్రక్రియ, కానీ చాలా మంది డ్రైవర్లు సిగ్నల్స్ వద్ద వేచి ఉన్నప్పుడు కూడా క్లచ్‌ని ఉపయోగిస్తారు. సిగ్నల్స్ వద్ద వేచి ఉన్న సమయంలో క్లచ్‌ని పట్టి ఉండటం మంచి పద్ధతి కాదు. అయితే క్లచ్ కేవలం కొన్ని సెకన్లు మాత్రమే ఉంటుంది. దీనిని గుర్తించాలి అప్పుడే క్లచ్ జీవిత కాలం కూడా పెరుగుతుంది.

Most Read Articles

Read more on: #టిప్స్ #tips
English summary
How to increase life of car braking system helpful tips details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X