డ్రైవింగ్ లైసెన్స్‌తో ఆధార్ నెంబర్ లింక్ చేయడం ఎలా

నకిలీ కార్డులను గుర్తించి రద్దు చేయడం మరియు పారదర్శకతను పెంచడానికి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రవాణా శాఖలు కొత్తగా తీసుకునే డ్రైవింగ్ లైసెన్సులకు ఆధార్ కార్డును తప్పనిసరి చేశాయి.

By Anil Kumar

భారత నివాసితుల కోసం కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన విశిష్ట గుర్తింపు కార్డు ఇప్పుడు ప్రతి ప్రభుత్వ, ప్రయివేట్ మరియు ఆన్‌లైన్ సేవలకు తప్పనిసరి అయిపోయింది. మొబైల్ నెంబర్ నుండి పాన్ కార్డ్, బ్యాంకు ఖాతా మరియు డ్రైవింగ్ లైసెన్స్‌తో సహా ఇంకా ఎన్నో సేవలకు ఆధార్ తప్పనిసరి చేశారు.

డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్ నెంబర్ లింక్

నకిలీ కార్డులను గుర్తించి రద్దు చేయడం మరియు పారదర్శకతను పెంచడానికి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రవాణా శాఖలు కొత్తగా తీసుకునే డ్రైవింగ్ లైసెన్సులకు ఆధార్ కార్డును తప్పనిసరి చేశాయి. అంతే కాకుండా ఇది వరకు తీసుకున్న డ్రైవింగ్ లైసెన్సులకు ఆధార్ నెంబర్ లింక్ చేసుకునే అవకాశాన్ని వెబ్‌సైట్లలో అందించాయి.

డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్ నెంబర్ లింక్

సులభమైన పద్దతిలో మీ డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలో నాలుగు సింపుల్ స్టెప్స్‌లో డ్రైవ్‌స్పార్క్ తెలుగు ఇవాల్టి స్టోరీలో వివరిస్తోంది. చూద్దాం రండి...

డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్ నెంబర్ లింక్

ఏపి, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రవాణా శాఖ వెబ్‌సైట్లలో డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేసుకునే సేవలను అందుబాటులో ఉంచాయి. ఉదాహరణ కోసం ఆంధ్రప్రదేశ్ వెబ్‌సైట్ ద్వారా ఆధార్ లింకింగ్ ఎలా చేయాలో చూద్దాం రండి.

డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్ నెంబర్ లింక్

#1

వెబ్‌సైట్ హోం పేజీలో ఎడమవైపున ఆధార్ నెంబర్ ఎంట్రీ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో ఆధార్ నెంబర్ ఎంట్రీ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి.

డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్ నెంబర్ లింక్

#2

ఆధార్ డిటైల్స్ ఎంట్రీ అనే పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలక్ట్ సెర్చ్ ఎలిమెంట్ బాక్సులో రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా లైసెన్స్ ఆప్షన్స్‌లో ఒక దానిని ఎంచుకుని, రిజిస్ట్రేషన్ నెంబర్ బాక్సులో డ్రైవింగ్ లెసెన్స్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డిటైల్స్ మీద క్లిక్ చేయాలి.

డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్ నెంబర్ లింక్

#3

డ్రైవింగ్ లైసెన్స్‌కు సంభందించిన డిటైల్స్‌తో పాటు క్రింది వైపున ఆధార్ మరియు మొబైల్ నెంబర్ కాలమ్ కనిపిస్తుంది. ఇక్కడ 12 అంకెల ఆధార్ నెంబర్ మరియు 10 అంకెల మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్ నొక్కాలి.

డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్ నెంబర్ లింక్

#4

మొబైల్ నెంబర్‌కు వచ్చిన నాలుగు అంకెల వన్ టైమ్ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి కన్‌ఫర్మ్ చేంజెస్ అనే ఆప్షన్ నొక్కగానే మీ ఆధార్ నెంబర్ డ్రైవింగ్ లైసెన్స్‌తో లింక్ అయిపోతుంది.

డ్రైవింగ్ లైసెన్స్‌తో ఆధార్ నెంబర్ లింక్ చేయడం ఎలా?

మీ ఫోన్‌లో ఈ యాప్ ఉంటే చాలు డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు!

ట్రాఫిక్ పోలీసులు ఆపినపుడు ఏం చేయాలి, ఎలా వ్యవహరించాలి ?

ఏ/సి వాడకం కారు మైలేజ్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఏబిఎస్ అంటే ఏమిటి ? ఎలా పని చేస్తుంది ?

Most Read Articles

English summary
Read In Telugu: How to link aadhaar driving licence online
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X