దసరాకు కారు కొంటున్నారా? షోరూమ్‌కి వెళ్లే ముందు తెలుసుకోవలసిన విషయాలు!

నవరాత్రి భారతదేశంలో అత్యంత ముఖ్యమైన, సుదీర్ఘంగా జరుపుకునే ఉత్సవాల్లో ఒకటిగా ఉంటుంది. ప్రతి సంవత్సరం హిందువులు ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే అట్టహసంగా జరుగుతుంది. ఈ సంవత్సర నవరాత్రి సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఘనంగా జరగుతుంది. ఈ పండుగల సీజన్‌లో చాలా మంది కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తుంటారు. పండుగ టైంలో వాహనం ఇంటికి తెచ్చుకుంటే కలిసి వస్తుందని అందరి భావన. ఇప్పటికే జీఎస్టీ తగ్గింపు కూడా అమల్లోకి రావడంతో తక్కువ ధరలో బైకులు, కార్లు వస్తున్నాయని చాలా మంది షోరూమ్‌లకు ఎగబడుతున్నారు.

అయితే వాహనం కొనేముందు ప్రజలు పలు కీలక విషయాలను గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. ప్రధానంగా లక్షలు విలువ చేసే కార్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కారు ఎంచుకునేటప్పుడు మొదటగా మీ అవసరాలు, ప్రయోజనాలు, వాస్తవ బడ్జెట్‌ను స్పష్టంగా చూసుకోవడం ముఖ్యం. ఇది సుస్థిర నిర్ణయం తీసుకునే ఆధారం అవుతుంది. అంతేకాదు, రానున్న కాలంలో వచ్చే టోటల్ ఖర్చును కూడా ముందే అంచనా వేసుకోవాలి.

How To Select The Right Car This Navratri Buying Guide For Customers

షోరూమ్ ధరకి మించిన రోడ్డు పన్ను, బీమా, అవసరమైన ఉపకరణాలు, ఫ్యూయల్ ఖర్చు, నిర్వహణ వ్యయం వంటి అంశాలు కలిపితే నిజమైన యాజమాన్య వ్యయం ఎలా ఉంటుందో తెలుస్తుంది. నవరాత్రి పండుగ సమయం వాణిజ్యంగా కీలకమైనది. చాలాబ్రాండ్లు, డీలర్లు ఈ సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తారు. ఈ ప్రత్యేక ప్రోత్సాహకాలు చూసి తొందరపాటుగా కాకుండా మీ అవసరాల్నీ బడ్జెట్‌నీ పరిగణలోకి తీసుకోవాలి.

ముందుగా అవసరాన్ని గుర్తుంచుకోండి: కారు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు, ముందుగా అది ఎలా ఉపయోగించబడుతుందో ఆలోచించడం అత్యంత అవసరం. రోజువారీగా నగరంలో ప్రయాణాలకు మాత్రమే వాడతారా? లేక తరచూ దూరప్రయాణాలు కూడా చేస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం మీ ఎంపికను మరింత స్పష్టంగా చేస్తుంది. చిన్న కుటుంబానికి లేదా కాంపాక్ట్ జీవనశైలికి సరిపోయే హ్యాచ్‌బ్యాక్ మంచి ఎంపికగా నిలుస్తుంది. నగర రోడ్ల రద్దీలో వీటిని నడపడం సులభం.

How To Select The Right Car This Navratri Buying Guide For Customers

అలాగే పార్కింగ్ విషయంలో కూడా సౌలభ్యం కలిగిస్తాయి. మీరు ఎక్కువసేపు రోడ్లపై గడపాల్సి వస్తే లేదా కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉంటే,సెడాన్ సరిపోతుంది. విశాలమైన కూర్చునే స్థలం, తగినంత లెగ్‌రూమ్, అలాగే పెద్ద బూట్ స్పేస్ ఉండటం వల్ల ఇవి దూర ప్రయాణాల్లో సౌకర్యాన్ని అందిస్తాయి. అదే సమయంలో, మీరు మరింత స్థలాన్ని కోరుకుంటే, లేదా సాహసయాత్రలు, దూర ప్రాంతాల ప్రయాణాలు ఎక్కువ చేస్తే, SUV సరైన ఎంపిక అవుతుంది.

SUVలలో ఉన్న ఎత్తైన సీటింగ్ పొజిషన్ రోడ్ల వీక్షణ మరింత స్పష్టంగా చూపిస్తుంది. అదనంగా, కఠినమైన రోడ్లపై నడుస్తాయి. అందుకే పెద్ద కుటుంబాలు, లేదా అడ్డంకులను లెక్క చేయని ప్రయాణికులు SUVలను ఎక్కువగా ఎంచుకుంటారు. ఇక ఆర్థిక ప్రణాళిక విషయానికి వస్తే, మీరు లోన్ తీసుకోవాలని అనుకుంటే ముందే అర్హతను నిర్ధారించుకోవాలి. పండుగ సీజన్‌లో బ్యాంకులు ప్రత్యేకమైన రుణ పథకాలు, తక్కువ వడ్డీ రేట్లు అందించే అవకాశం ఉంటుంది.

How To Select The Right Car This Navratri Buying Guide For Customers

గేర్‌బాక్స్ ఎంపిక: కారు కొనుగోలు చేసే సమయంలో గేర్‌బాక్స్ ఎంపిక కూడా ఒక ముఖ్యమైన అంశం. మాన్యువల్ గేర్‌బాక్స్ వాహనాన్ని మరింత నియంత్రణలో ఉంచే సౌలభ్యాన్ని ఇస్తుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన కార్లు నడపడం చాలా సులభం. క్లచ్ ఉపయోగించాల్సిన అవసరం లేకపోవడం, గేర్ మార్పుల భారం లేకపోవడం వలన, ఇవి ప్రత్యేకంగా భారీ నగర ట్రాఫిక్‌లో ప్రయాణించే వారికి మరింత సౌకర్యం ఇస్తాయి.

ఇంధన రకం: నెలకు 1,200 కిలోమీటర్లలోపు మాత్రమే డ్రైవ్ చేసే వారికి పెట్రోల్ కార్లు సరైన ఎంపిక. వీటిని కొనుగోలు చేయడం తక్కువ ఖర్చుతో కూడుకున్నదే కాకుండా, నిర్వహణ కూడా చౌకగా ఉంటుంది. మరోవైపు, మీరు తరచుగా ఎక్కువ దూరం ప్రయాణాలు చేస్తుంటే, ముఖ్యంగా నెలకు 1,500 కిలోమీటర్లకు పైగా డ్రైవ్ చేస్తే, డీజిల్ కార్లు మంచివి.

More from DriveSpark

Article Published On: Wednesday, September 24, 2025, 17:44 [IST]
English summary
How to select the right car this navratri buying guide for customers
Read more on: #tips #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+