ఎమర్జెన్సీలో హ్యాండ్‌ బ్రేక్‌కి సంబంధించి ఈ తప్పులు అస్సలు చేయకండి.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు

ప్రపంచవ్యాప్తంగా కార్ల వినియోగం పెరుగుతుండటంతో ఉత్పత్తి కూడా ఊపందుకుంటోంది. టెక్నాలజీని ఉపయోగించి ప్రస్తుతం వస్తున్న కార్లు పూర్తి అప్‌గ్రేడ్స్‌తో స్మార్ట్‌ ఫీచర్లను కంపెనీలు జోడిస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న కార్లలో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ (ADAS) వంటి వాటితో కారు ప్రయాణం సాఫీగా సాగుతుంది. మానవ తప్పిదాల వల్ల కొన్ని సందర్భాల్లో మాత్రమే విషాదంగా మారుతున్నాయి. కారు యాక్సిండెట్స్‌లో బ్రేక్ అనేది చాలా కీలకం. పాత రోజుల్లో కారును ఆపడానికి పెద్ద వైరును లాగాల్సిన అవసరం ఉండేది. తాజాగా ఈ పద్ధతికి స్వస్తి చెప్పి హ్యాండ్‌బ్రేక్‌, స్మార్ట్‌ బ్రేక్‌ వరకు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఈ హ్యాండ్ బ్రేక్‌ని సరిగ్గా ఎలా ఉపయోగించాలో తెలియని వారు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు.

ఒక స్థిరమైన ప్రయాణాల్లో లేదా పార్కింగ్‌ చేసేటప్పుడు కారుని కదలకుండా చేయడానికి హ్యాండ్ బ్రేక్‌ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్‌ వద్ద ఎక్కువ సేపు ఆగాల్సి వచ్చినప్పుడు ఈ హ్యాండ్‌బ్రేక్‌ ఎక్కువగా ఉపయోగపడుతుంది. కారు ఇంజిన్ ఆఫ్‌ చేయకుండా హ్యాండ్ బ్రేక్ వేయవచ్చు. ఇతర అత్యవసర ప్రమాదాల నుంచి ఈ హ్యాండ్‌ బ్రేక్‌ సౌలభ్యం వల్ల బయటపడవచ్చు.

Hand-Brake-Uses

కాబట్టి దీని ఉపయోగంపై ప్రతి ఒక్కరికి అవగాహన కచ్చితంగా ఉండాలి. కారును అకస్మాత్తుగా ఆపడానికి ఫస్ట్ అటెంప్ట్‌గా బ్రేక్‌ని ఉపయోగిస్తారు. ఇంకా కొన్ని సందర్భాల్లో కారును మరింత వేగంగా ఆపడానికి మన ఎడమ చేయి ఆటోమేటిక్‌గా హ్యాండ్ బ్రేక్ మీదకు వెళుతుంది. ఇక్కడే కొందరు చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు. హైస్పీడ్‌లో డ్రైవింగ్ చేసేటప్పుడు హ్యాండ్ బ్రేక్ ఉపయోగించవద్దు. ప్రమాదం జరిగే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడాలి.

హైస్పీడ్‌లో హ్యాండ్ బ్రేక్ వాడితే కారు వెనుక చక్రాలు లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. కారుని మీరు నెమ్మదిగా ఆపవలసి వచ్చిన సందర్భాల్లో మాత్రమే హ్యాండ్‌ బ్రేక్‌ని ఉపయోగించాలి. ఒకవేళ ఫుట్ బ్రేక్ పెడల్ పని చేయకపోతే హ్యాండ్ బ్రేక్ ఉపయోగించడం తప్ప మరో మార్గం లేదు. కానీ మీరు దానిని ఆచీతూచి ఉపయోగించాలి. ఆకస్మాత్తుగా హ్యాండ్‌ బ్రేక్‌ వేయకుడదు.

how-To-Apply-Emergency-Handbrake-In-Cars

కార్లలో ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉంటే హ్యాండ్ బ్రేక్‌ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కారులోని హ్యాండ్‌బ్రేక్‌ స్మార్ట్‌ బటన్ నొక్కితే చాలు కారు వెంటనే ఆగిపోతుంది. అయితే దీనిని నెమ్మదిగా నొక్కడానికి ప్రయత్నించండి. హ్యాండ్ బ్రేక్ ఉపయోగించేటప్పుడు రోడ్డు మీద పూర్తి శ్రద్ధ వహించాలి. లేదంటే ఎదుటివారికి హాని తలపెట్టిన వారు అవుతారు. ఒకవేళ కారు స్కిడ్ అవుతున్నట్లయితే, హ్యాండ్ బ్రేక్‌ని మరింత నెమ్మదిగా (స్మూత్‌)గా ఉపయోగించండి.

కారు పార్కింగ్ చేయడానికి ముందు హజార్డ్ లైట్లను ఆన్ చేయండి. ఇది ఇతర వాహనదారులను అప్రమత్తం చేస్తుంది. ఆ తర్వాత వీలైనంత వరకు కారును సురక్షితమైన ప్రదేశంలో పార్క్ చేయండి. అత్యవసర పరిస్థితుల్లో హ్యాండ్ బ్రేక్ ఉపయోగించడం వల్ల మీ కారు బ్రేక్ సిస్టమ్ లేదా ఇతర భాగాలు దెబ్బతింటాయి. అత్యవసర పరిస్థితుల్లో హ్యాండ్ బ్రేక్ వాడిన తర్వాత మెకానిక్‌తో మీ కారును రిపేర్ చేయించుకోవడం మంచిది.

దానివల్ల ఎఫెక్ట్ అయిన భాగాలను మెకానిక్‌ తిరిగి సాధారణ పరిస్థితిలోకి తీసుకువస్తాడు. మీ ప్రమాద లేదా అత్యవసర సమయాన్ని బట్టి కారు భాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎమర్జెన్సీలో హ్యాండ్ బ్రేక్‌ని దూకుడుగా ఉపయోగించడం విచ్ఛిన్నానికి దారితీస్తుందని గుర్తుంచుకోవాలి. కంగారు పడకుండా హ్యాండ్ బ్రేక్ ఉపయోగించడం చాలా ముఖ్యం. హ్యాండ్ బ్రేక్ ఉపయోగించేటప్పుడు మీ మానసిక స్థితి స్థిరంగా ఉండటం మరియు ఉద్వేగానికి లోను అవ్వద్దు.

More from DriveSpark

Article Published On: Monday, June 24, 2024, 12:31 [IST]
English summary
How to stop car smoothly by using handbrake precautions explained
Read more on: #off beat #road safety #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+