హైబీమ్, లోబీమ్ హెడ్‌లైట్లను ఎప్పుడు ఉపయోగించాలి?

By Ravi

రాత్రివేళల్లో సురక్షితమైన ప్రయాణం చేయాలంటే వాహనాలకు హెడ్‌లైట్స్ ఎంతో ముఖ్యమైనవి. రాత్రి సమయంలో డ్రైవ్ ప్లాన్ చేసుకునేటప్పుడు, డ్రైవ్ చేయడానికి ముందు హెడ్‌లైట్స్, టెయిల్ లైట్స్, ఇండికేటర్ లైట్స్, హజార్డ్ లైట్స్ వంటివి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. కాంతి తక్కువగా ఉండే సందర్భాల్లో ఫాగ్ ల్యాంప్స్, హెడ్‌లైట్స్‌ను ఉపయోగించేటప్పుడు హైబీమ్ లైట్లను ఎప్పుడు ఉపయోగించాలి, లోబీమ్ లైట్లను ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకోవటం కూడా ఎంతో అవసరం.

హెడ్‌ల్యాంప్స్ (హైబీమ్-లోబీమ్)ను ఎప్పుడు వాడాలి?
సూర్యాస్తమయం, సూర్యోదయం లేదా వివిధ వాతావరణ పరిస్థితుల కారణంగా రోడ్డుపై కాంతి తక్కువగా ఉండే సమయాల్లో హెడ్‌లైట్లను తప్పనిసరిగా ఆన్ చేయాలి. పగటి వేళల్లో వాహనం నడిపేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ హైబీమ్ లైట్లను ఉపయోగించరాదు. భారీ వర్షాలు, పొగమంచు లేదా పొడిమంచు వంటి వాతావరణ పరిస్థితుల్లో వాహనం నడిపేటప్పుడు మీ హెడ్‌లైట్స్‌‌ను ఎల్లప్పుడూ లోబీమ్‌లోనే ఉంచాలి. మరీ క్లిష్టమైన పరిస్థితుల్లో రోడ్డును స్పష్టంగా చూడటం కష్టమైనప్పుడు, మీకు ఎదురుగా/వెనుకగా వచ్చేవాళ్లు మీ వాహనాన్ని గుర్తించేందుకు హజార్డ్ లైట్లను ఆన్ చేసుకుని డ్రైవ్ చేయవచ్చు.

ఎలాంటి రోడ్లపై అయినా, వీధి లైట్లు వెలుగుతున్నప్పటికీ మీరు హైబీమ్ లైట్లను ఉపయోగించవచ్చు. అయితే, మీకు ఎదురుగా సుమారు 200 మీటర్ల దూరంలో ఏదైనా వాహనం వస్తున్నప్పుడు మీ వాహన హెడ్‌లైట్లను లోబీమ్‌లోకి డిప్ చేయాలి. అలాగే ఏదైనా వాహనాన్ని మీరు వెనుక వైపు నుంచి ఓవర్‌టేక్ చేస్తున్నప్పుడు సుమారు 200 మీటర్ల దూరం నుంచే హెడ్‌లైట్లను డిప్ చేస్తూ మీ ముందు వెళ్లే వారికి సిగ్నల్స్ ఇవ్వాలి.

హైబీమ్, లోబీమ్ హెడ్‌లైట్లను ఎప్పుడు ఉపయోగించాలి?

హైబీమ్, లోబీమ్ హెడ్‌లైట్లను ఎప్పుడు ఉపయోగించాలి?

సిటీ రోడ్లపై ప్రయాణించేటప్పుడు హైబీమ్ లైట్లను ఉపయోగించటం ప్రమాదకరం. ఇది అవతలి వ్యక్తుల కంటిచూపుపై ప్రభావం చూపి, ప్రమాదాలకు కారణం కావచ్చు. అంతేకాకుండా, సిటీ రోడ్లపై హైబీమ్ లైట్లను ఉపయోగించటం చట్టరీత్యా నేరం, ఇందుకు రూ.100 మొదలకొని జరిమానా ఉంటుంది.

హైబీమ్, లోబీమ్ హెడ్‌లైట్లను ఎప్పుడు ఉపయోగించాలి?

హైబీమ్, లోబీమ్ హెడ్‌లైట్లను ఎప్పుడు ఉపయోగించాలి?

సూర్యాస్తమయం, సూర్యోదయం లేదా వివిధ వాతావరణ పరిస్థితుల కారణంగా రోడ్డుపై కాంతి తక్కువగా ఉండే సమయాల్లో హెడ్‌లైట్లను తప్పనిసరిగా ఆన్ చేయాలి.

హైబీమ్, లోబీమ్ హెడ్‌లైట్లను ఎప్పుడు ఉపయోగించాలి?

హైబీమ్, లోబీమ్ హెడ్‌లైట్లను ఎప్పుడు ఉపయోగించాలి?

మరీ క్లిష్టమైన పరిస్థితుల్లో రోడ్డును స్పష్టంగా చూడటం కష్టమైనప్పుడు, మీకు ఎదురుగా/వెనుకగా వచ్చేవాళ్లు మీ వాహనాన్ని గుర్తించేందుకు హజార్డ్ లైట్లను ఆన్ చేసుకుని డ్రైవ్ చేయవచ్చు.

హైబీమ్, లోబీమ్ హెడ్‌లైట్లను ఎప్పుడు ఉపయోగించాలి?

హైబీమ్, లోబీమ్ హెడ్‌లైట్లను ఎప్పుడు ఉపయోగించాలి?

ఎలాంటి రోడ్లపై అయినా, వీధి లైట్లు వెలుగుతున్నప్పటికీ మీరు హైబీమ్ లైట్లను ఉపయోగించవచ్చు. అయితే, మీకు ఎదురుగా సుమారు 200 మీటర్ల దూరంలో ఏదైనా వాహనం వస్తున్నప్పుడు మీ వాహన హెడ్‌లైట్లను లోబీమ్‌లోకి డిప్ చేయాలి. అలాగే ఏదైనా వాహనాన్ని మీరు వెనుక వైపు నుంచి ఓవర్‌టేక్ చేస్తున్నప్పుడు సుమారు 200 మీటర్ల దూరం నుంచే హెడ్‌లైట్లను డిప్ చేస్తూ మీ ముందు వెళ్లే వారికి సిగ్నల్స్ ఇవ్వాలి.

హైబీమ్, లోబీమ్ హెడ్‌లైట్లను ఎప్పుడు ఉపయోగించాలి?

హైబీమ్, లోబీమ్ హెడ్‌లైట్లను ఎప్పుడు ఉపయోగించాలి?

పగటి వేళల్లో వాహనం నడిపేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ హైబీమ్ లైట్లను ఉపయోగించరాదు.

హైబీమ్, లోబీమ్ హెడ్‌లైట్లను ఎప్పుడు ఉపయోగించాలి?

హైబీమ్, లోబీమ్ హెడ్‌లైట్లను ఎప్పుడు ఉపయోగించాలి?

భారీ వర్షాలు, పొగమంచు లేదా పొడిమంచు వంటి వాతావరణ పరిస్థితుల్లో వాహనం నడిపేటప్పుడు మీ హెడ్‌లైట్స్‌‌ను ఎల్లప్పుడూ లోబీమ్‌లోనే ఉంచాలి.

హైబీమ్, లోబీమ్ హెడ్‌లైట్లను ఎప్పుడు ఉపయోగించాలి?

హైబీమ్, లోబీమ్ హెడ్‌లైట్లను ఎప్పుడు ఉపయోగించాలి?

మీకు ఎదురుగా సుమారు 200 మీటర్ల దూరంలో ఏదైనా వాహనం వస్తున్నప్పుడు మీ వాహన హెడ్‌లైట్లను లోబీమ్‌లోకి డిప్ చేయాలి.

హైబీమ్, లోబీమ్ హెడ్‌లైట్లను ఎప్పుడు ఉపయోగించాలి?

హైబీమ్, లోబీమ్ హెడ్‌లైట్లను ఎప్పుడు ఉపయోగించాలి?

ఫాగ్ ల్యాంప్స్‌ను ఎల్లప్పుడూ పొగమంచు ఎక్కువగా సమయాల్లో మాత్రమే ఉపయోగించాలి. రోడ్డుపై పొగమంచు ఉన్నప్పుడు దారి సరిగ్గా కనిపించదు. రాత్రయినా, పగలైనా పొగమంచు ఉన్నప్పుడు ఫాగ్‌ల్యాంప్స్ ఆన్ చేసుకొని వెళ్లటం వలన దారి సరిగ్గా కనిపించడమే కాకుండా, అవతలి వైపు నుంచి వచ్చే వ్యక్తులు మీ వాహనాన్ని సులువుగా గుర్తించేందుకు కూడా వీలవుతుంది.

హైబీమ్, లోబీమ్ హెడ్‌లైట్లను ఎప్పుడు ఉపయోగించాలి?

హైబీమ్, లోబీమ్ హెడ్‌లైట్లను ఎప్పుడు ఉపయోగించాలి?

పొగమంచు తొలగిపోయి రోడ్డు స్పష్టంగా కనిపించడం ప్రారంభిస్తే, వెంటనే ఫాగ్ ల్యాంప్స్‌ను ఆఫ్ చేయాలి లేకపోతే అవి మీ ఎదురుగా డ్రైవర్ కళ్లపై పడి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. పొగమంచు (ఫాగ్) సమయంలో హైబీమ్ లైట్లను ఉపయోగించినట్లయితే, పొగమంచుకు కాంతిని పరావర్తనం చెందించే గుణం ఉంటుంది కాబట్టి, రోడ్డును స్పష్టంగా చూడటం అసాధ్యం అవుతుంది.

ఫాగ్ ల్యాంప్స్‌ను ఎప్పుడు వాడాలి?
కారు ముందు వైపు బంపర్‌కు ఇరువైపులా అమర్చి ఉండే రెండు చిన్న పాటి లైట్లను ఫాగ్ ల్యాంప్స్ అంటారు. ఇందులో సాధారణ బల్బులను లేదా ఎల్ఈడి బల్బులను ఉపయోగించవచ్చు. ఫాగ్ ల్యాంప్స్‌ను ఎల్లప్పుడూ పొగమంచు ఎక్కువగా సమయాల్లో మాత్రమే ఉపయోగించాలి. రోడ్డుపై పొగమంచు ఉన్నప్పుడు దారి సరిగ్గా కనిపించదు. రాత్రయినా, పగలైనా పొగమంచు ఉన్నప్పుడు ఫాగ్‌ల్యాంప్స్ ఆన్ చేసుకొని వెళ్లటం వలన దారి సరిగ్గా కనిపించడమే కాకుండా, అవతలి వైపు నుంచి వచ్చే వ్యక్తులు మీ వాహనాన్ని సులువుగా గుర్తించేందుకు కూడా వీలవుతుంది.

పొగమంచు తొలగిపోయి రోడ్డు స్పష్టంగా కనిపించడం ప్రారంభిస్తే, వెంటనే ఫాగ్ ల్యాంప్స్‌ను ఆఫ్ చేయాలి లేకపోతే అవి మీ ఎదురుగా డ్రైవర్ కళ్లపై పడి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. పొగమంచు (ఫాగ్) సమయంలో హైబీమ్ లైట్లను ఉపయోగించినట్లయితే, పొగమంచుకు కాంతిని పరావర్తనం చెందించే గుణం ఉంటుంది కాబట్టి, రోడ్డును స్పష్టంగా చూడటం అసాధ్యం అవుతుంది.

ఏదేమైనప్పటికీ, సిటీ రోడ్లపై ప్రయాణించేటప్పుడు హైబీమ్ లైట్లను ఉపయోగించటం ప్రమాదకరం. ఇది అవతలి వ్యక్తుల కంటిచూపుపై ప్రభావం చూపి, ప్రమాదాలకు కారణం కావచ్చు. అంతేకాకుండా, సిటీ రోడ్లపై హైబీమ్ లైట్లను ఉపయోగించటం చట్టరీత్యా నేరం, ఇందుకు రూ.100 మొదలకొని జరిమానా ఉంటుంది. కాబట్టి, అవసరమైనప్పుడు మాత్రమే మీ వాహన హెడ్‌లైట్లను హైబీమ్‌లో ఉంచుకొని, అవసరం లేనప్పుడు లోబీమ్‌లో ఉంచి, మీరు సురక్షితంగా ప్రయాణించడమే కాకుండా, మీకు ఎదురుగా వచ్చే వారిని, మిమ్మల్ని ఫాలో అయ్యే వారిని కూడా సురక్షితంగా ఉంచగలరు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 29, 2013, 16:24 [IST]
English summary
Do you know when to use high and low beam lights? Here is the answer for this question. You can use high beam lights on any road, even if there are street lights. However, you must dip your headlights to low beam when a vehicle coming toward you is within 200 metres and when driving 200 metres or less behind another vehicle. Don't drive with high beam on during the day.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+