బైక్ రైడ్‌పై సురక్షితమైన బ్రేకింగ్ కోసం చక్కని చిట్కా..!!

Breaking While On Bike
బైక్‌ను వేగంగా నడపటం మహా గొప్పేమీ కాదు చేతిలో యాక్సిలేటర్ ఉంటే, 'ఇక చాలు ఆపరా బాబు.. ఇంతకంటే స్పీడ్ నేను వెళ్లలేను' అని బైక్ గోల పెట్టే వరకూ యాక్సిలరేట్ చేయవచ్చు. మరి అంత వేగంలో బైక్‌ను కంట్రోల్ చేయడం, అత్యంత నైపుణ్యంతో బ్రేక్‌ను అప్లయ్ చేయటం చాలా క్లిష్టమైన అంశం.

బ్రేక్ వేయడంలో ఉన్న మెళకువలను తెలుసుకోవాలి. బైక్ రైడ్ చేస్తున్నప్పుడు ముందుగా ఏదైనా అడ్డంకి వస్తుందని గ్రహించి నెమ్మదిగా వెళ్లాలనుకున్నప్పుడు, కొంత దూరం ముందు నుంచే బ్రేక్‌ను కొద్దిగా నొక్కి (హాఫ్ బ్రేక్) బైక్‌ను స్లో చేస్తాం. ఆ తర్వాత అడ్డంకిని అధిగమించిన తర్వాత మళ్లీ యాక్సిలరేట్ చేస్తాం.

బ్రేకింగ్ విధానంలో ఇది సాధారణంగా అందరూ పాటించే విధానం. అయితే, కొన్నిసార్లు వేగంగా వెళ్తున్నప్పుడు అకస్మాత్తు (సడెన్)గా బ్రేక్ వేయాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో బ్రేక్‌ను అత్యంత టెక్నిక్‌గా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇటువంటి అత్యవర పరిస్థితుల్లో బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు ముందు, వెనుక (ఫ్రంట్, రియర్) బ్రేక్‌లను ఒకేసారి గట్టిగా/బలంగా అప్లయ్ చేయకూడదు.

ఎందుకుంటే.. సాధారణంగా డ్రమ్/డిస్క్ బ్రేక్‌లు ఉండే బైక్‌లకు బ్రేక్ డిస్టన్స్ (బ్రేక్ అప్లయ్ చేసినప్పుడు, బైక్ పూర్తిగా ఆగడానికి పట్టే సమయం) ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అత్యవర పరిస్థితుల్లో, కంగారు పడిపోయి సడెన్ బ్రేక్ వేయడం వలన బైక్ జారిపోవడం, లేదా టైర్లు రాచుకుంటూ పోయి వేరకొ వాహనాన్ని ఢీకొట్ట వంటి ప్రమాదాలు జరిగే ఆస్కారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

ఇందుకు ప్రధాన కారణం, వేగంగా వెళ్తున్నప్పుడు బ్రేక్‌ (ఫ్రంట్ బ్రేక్ లేదా రియర్ బ్రేక్ లేదా రెండింటిని ఒకేసారి అప్లై చేసినప్పుడు) వేసినప్పుడు చక్రాలు తిరగడం (వీల్స్ రోలింగ్) ఆగిపోయి, టైర్లు లాక్ అయిపోతాయి, ఫలితంగా రోడ్డుపై బైక్ జారిపోతుంది. అలాకాకుండా.. అత్యవర పరిస్థితుల్లో బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు ఒకేసారి పూర్తిగా బ్రేక్‌ను నొక్కకుండా, తరచూ నొక్కుతూ వదులుతుండటం చేయాలి.

ఇలా చేయటం వలన వీల్ లాకింగ్ జరగదు. ఫలితంగా బ్రేక్ డిస్టన్స్ తగ్గడమే కాకుండా, బైక్ వేగం తగ్గి, వాహనం అదుపులోకి వస్తుంది. ఈ కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకునే ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) వ్యవస్థను రూపొందించడం జరిగింది. ఏబిస్ సిస్టమ్‌ ఉన్న బైక్‌ను రైడ్ చేస్తున్నప్పుడు బ్రేక్ వేసినప్పుడు వీల్ లాక్ కాకుండా.. అంచెలు అంచెలుగా బ్రేక్ పనిచేసి సురక్షితమైన బ్రేకింగ్‌ను అందిస్తుంది.

ఈ చిన్న కిటుకు తెలుసుకుంటే రోడ్లపై మనం సురక్షితంగా వెళ్లడమే కాకుండా.. పక్కవారిని, మనపై ఆధారపడిన వారిని కూడా సురక్షితంగా ఉంచగలం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి.. "వేగం కన్నా ప్రాణం మిన్న". కాబట్టి, ఎక్కడికైనా బయలుదేరే ముందుకు కాస్తంత ముందుగానే బయలుదేరి నెమ్మదిగా రైడ్ చేసి సురక్షితంగా గమ్యం చేరుకోండి. Drvespark wishes you "Have a Happy and Safe Journey".

More from DriveSpark

Article Published On: Tuesday, February 7, 2012, 19:49 [IST]
English summary
Using brakes while riding a motorcycle or bike can be considered as an art. Anticipate obstacles well in advance and apply brakes slowly to avoid skidding. If you have to apply brakes suddenly, do not press the brake completely, instead press it intermittently to avoid a wheel lock.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+