హైబ్రిడ్ కారు ఉన్న వారికే ఈ రహస్యం తెలుస్తుంది.. పెట్రోల్‌ లేకుండా కారు నడుస్తుందా?

ఈ రోజుల్లో హైబ్రిడ్ వాహనాల వినియోగం పెరుగతోంది. ఇది ఎలక్ట్రిక్ కార్లను మించి వీటిని ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. మంచి మైలేజీ అందించడమే కాకుండా.. పర్యావరణానికి అనుకూలంగా ఉండడం.. ఈ హైబ్రిడ్ వాహనాల వినియోగానికి కారణాలుగా చప్పవచ్చు. అయితే.. చాలా మందికి ఈ హైబ్రిడ్ వాహనాల వినియోగం గురించి అవగాహన ఉండదు. అవి ఎలా పనిచేస్తాయో కూడా తెలియదు.

అయితే ఈ హైబ్రిడ్ కార్లు గ్యాస్‌ లేకుండా నడుస్తాయా? నడవవా? అంటే.. అది మన వాహనంలో వినియోగించే హైబ్రిడ్ సాంకేతికతపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. మరి ఈ హైబ్రిడ్ కార్లలో చాలా మందికి ఉండే సందేహాలకు సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం. మైల్డ్- హైబ్రిడ్ వాహనాల్లో చిన్న బ్యాటరీతో పాటు, ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది గ్యాసోలిన్ ఇంజిన్‌ను వినియోగించేందుకు సాయపడుతుంది.

Hybrid Vehicles Operating Techniques

ఈ వాహనాలు కేవలం బ్యాటరీ పవర్‌తో మాత్రమే ప్రయాణించలేవు. కానీ.. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకుగాను ఇందులో ఎలక్ట్రిక్ మోటార్ ఉపయోగపడుతుంది. అయితే.. మైల్డ్ హైబ్రిడ్ వాహనాల్లో గ్యాసోలిన్ అయిపోతే మాత్రం ఇవి కదలవు. ఫుల్ హైబ్రిడ్ వాహనాలు... ఎలక్ట్రిక్ మోటార్‌తో గ్యాసోలిన్ ఇంజిన్‌తో ఉంటాయి. ఎలక్ట్రిక్ పవర్ మాత్రమే వినియోగించి తక్కువ దూరాలను తక్కువ వేగంతో వీటి ద్వారా ప్రయాణించవచ్చు.

అయితే ఇందులోని బ్యాటరీ అయిపోతే మాత్రం గ్యాసోలిన్ ఇంజిన్‌ వినియోగం తప్పనిసరి అవుతుంది. గ్యాసోలిన్, లేదా ఛార్జ్‌డ్ బ్యాటరీ లేకుండా ఈ కారు ఇక కదలదు. ఇక ప్లగ్-ఇన్-హైబ్రిడ్ వాహనాల విషయానికి వస్తే ఇది పెద్ద బ్యాటరీలతో వస్తాయి. వీటిని ఎక్స్‌టర్నల్‌గా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇవి గ్యాసోలిన్ మీద ఆధారపడకుండా.. ఎక్కువ దూరం ఎలక్ట్రిక్ పవర్ ఆధారంగా ప్రయాణిస్తాయి.

Hybrid Vehicles Operating Techniques

ఎప్పుడైతే ఇవి పూర్తిగా ఛార్జ్ అవుతాయో.. అప్పుడు గ్యాసోలిన్ లేకుండా కూడా చాలా కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. మైల్డ్ హైబ్రిడ్, ఫుల్ హైబ్రిడ్ వాహనాల వినియోగదారులు.. గ్యాస్ లేకుండా ప్రయాణించడం కాస్త ఇబ్బందికరమే అని చెప్పాలి. ఈ కార్లు అధికంగా ఫ్యూయల్ పైన ఆధారపడుతాయి. ప్లగ్- ఇన్-హైబ్రిడ్ వాహనాల్లో బ్యాటరీ ఛార్జ్ చేసి ఉన్నట్లయితే.. కొంత రిలీఫ్ ఉంటుంది. కానీ, లాంగ్ జర్నీ చేయాల్సి వస్తే మాత్రం గ్యాస్ వినియోగం తప్పనిసరి.

అందువల్ల ఈ సమస్యలు రాకుండా ఉండేందుకు తగినంత ఫ్యూయల్- లెవెల్స్‌ను మెయింటెయిన్ చేయడం తప్పనిసరి అని చెప్పవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్‌లో సరిపడినంత ఫ్యూయల్ ఉన్నట్లయితే.... ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమస్యలు లేకుండా ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది. వినియోగదారులకు హైబ్రిడ్ టెక్నాలజీ వాహనాలు.. ఎఫీషియన్సీ, పర్యావరణ హితకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. వీటిల్లో ఏరకం ఎలా పని చేస్తుందో అవగాహన ఉన్నట్లయితే... ఫ్యూయల్ మేనేజ్‌మెంట్, వాహనాల ఎంపిక సమయంలో సరైన నిర్ణయం తీసుకునేందుకు తోడ్పడుతుంది.

Hybrid Vehicles Operating Techniques

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: హైబ్రిడ్ వాహనాల విషయంలో చాలా మందికి ఈ సందేహాలు ఉంటాయి. పైన చెప్పినట్లుగా మైల్డ్ హైబ్రిడ్ కార్లు.. గ్యాసోలిన్ లేకుండా ఆపరేట్ చేయలేం. ఇక స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు షార్ట్ డిస్టేన్స్ కోసం పని చేస్తాయి. ప్లగ్- ఇన్-హైహ్రిడ్ వాహనాలు లాంగ్ డిస్టేన్స్ ప్రయాణాల కోసం అనుకూలంగా ఉంటాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, February 18, 2025, 13:27 [IST]
English summary
Hybrid vehicles operating techniques makes you more profit check how here
Read more on: #hybrid cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+