Winter Car Wiper : చలికాలంలో కారు విండ్‌షీల్డ్‌ వైపర్‌ సేఫ్టీకి ఈ టిప్స్‌ పాటించండి.. లేదంటే రిస్క్‌ తప్పదు.!!

కారు విండ్‌షీల్డ్‌ వైపర్ల అవసరం ఏడాది పొడవునా ఉంటుంది. దుమ్ము, ధూళితో పాటు వర్షాకాలం, చలికాలంలో వర్షపు నీరు, పొగ మంచును శుభ్రం చేయడానికి వైపర్ల అవసరం తప్పనిసరి. చలికాలంలో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో కారు విండ్‌షీల్డ్‌ వైపర్ల(Windshield Wipers) పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

చలికాలంలో వాహనాల వైపర్లను సురక్షితంగా ఉంచుకోవడం చాలా అవసరం. లేదంటే డ్రైవింగ్‌లో ఉన్నప్డుడు అకస్మాత్తుగా వైపర్ పని చేయకపోతే, ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా మీరు రాత్రిపూట ప్రయాణిస్తున్నప్పుడు ఉష్ణోగ్రత పడిపోతే, కారు విండ్‌షీల్డ్‌పై మంచు పేరుకుపోయి గడ్డ కడుతుంది. దీనికి తొలగించడానికి వైపర్లు చాలా అవసరం. అప్పుడే స్పష్టమైన విజిబిలిటీ ఉంటుంది. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలి.

Windshield-Wiper-Care-In-Winter

విండ్‌షీల్డ్ నుంచి వైపర్‌లను తీసివేయాలి: మీరు శీతాకాలంలో మీ కారును ఎక్కువసేపు ఒకే చోట పార్క్ చేయాలని ప్లాన్ చేస్తే, విండ్‌షీల్డ్ నుండి వైపర్‌(Windshield Wipers Safety Tips)లను తీసివేయడం ఉత్తమం. చలికాలంలో, వైపర్ బ్లేడ్‌లోని రబ్బరు విండ్‌షీల్డ్‌కు అంటుకునే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి, కారును పార్క్‌ చేసేముందు వైపర్‌ను తొలగించాలి.

వాటర్ స్ప్రింక్లర్: మీరు కారులో ప్రయాణిస్తున్నప్పుడు, గ్లాస్ చాలా మురికిగా ఉంటే కారు విండోలపై నేరుగా నీటిని స్ప్రే చేయడానికి వాటర్ స్ప్రింక్లర్‌లతో కూడిన పరికరాలు మార్కెట్లో దొరుకుతాయి. వీటిని ఉపయోగించి విండ్‌షీల్డ్‌పై నీటిని స్ప్రే చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా డ్రైవర్‌కు విజిబిలిటీ సమస్య ఉండదు.

Windshield-Wiper-Care-In-Winter

వేడినీరును ఉపయోగించవద్దు: ప్రతిరోజూ ఉదయం తమ కారును శుభ్రం చేసేముందు చలికాలం కాబట్టి చాలా మంది తమ కారు విండోలను వేడి నీటితో శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇలా అస్సలు చేయకూడదు. వేడి నీటితో కారు విండోలను శుభ్రం చేయడం ద్వారా శీతాకాలంలో విజిబిలిటీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా చేయకూడదు.

క్రమం తప్పకుండా శుభ్రం చేయండి: కారు వైపర్‌ని రెగ్యులర్‌గా ఉపయోగిస్తూ ఉండాలి. లేదంటే అవి పనిచేయకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిసారీ కారు వైపర్‌లను తనిఖీ చేయాలి. స్ప్రేయర్‌తో నీటిని స్ప్రే చేయడం ద్వారా కారు విండ్‌షీల్డ్‌ను శుభ్రంగా ఉంచవచ్చు. కారు విండ్‌షీల్డ్‌ను చల్లని వాతావరణంలో ఎక్కువసేపు ఉంచకుండా చూసుకోవాలి.

Windshield-Wiper-Care-In-Winter

వైపర్‌ రబ్బరును సురక్షితంగా ఉంచండి: వాహన వైపర్లపై బ్లేడ్ రబ్బరుతో తయారు చేయబడి ఉంటుంది. శీతాకాలంలో ఈ రబ్బరు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రబ్బరు చల్లని వాతావరణానికి గట్టిపడి రాయిలా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీ కారు వైపర్‌లపై ఉన్న రబ్బరును ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.

మీరు శీతాకాలంలో మీ కారును ఎక్కువసేపు ఉపయోగించకుండా పార్క్ చేస్తున్నట్లయితే.. విపరీతమైన చలి కారణంగా రబ్బరు మీ కారు విండ్‌షీల్డ్‌ను దెబ్బ తీసే ప్రమాదం ఉంది. అందుకే అలాంటి సమస్య తలెత్తకుండా కార్లలో రబ్బరు బ్లేడ్లను తీసివేయడం ఉత్తమం. కారు ఎక్కువ సేపు పార్క్ చేసి ఉంటే దానిపై దుమ్ముతో సహా రకరకాల నిక్షేపాలు ఉంటాయి.

Windshield-Wiper-Care-In-Winter

ఈ దుమ్ము, ధూళిని వైపర్‌తో తుడిచే ప్రయత్నం చేయకండి. మెత్తని క్లాత్‌ ద్వారా దుమ్ము మొత్తం శుభ్రం చేసిన తర్వాత మంచి నీటితో శుభ్రం చేయాలి. చలికాలంలో కారు విండ్‌షీల్డ్‌ను శుభ్రంగా ఉంచడం చాలా అవసరం. ఈ సమయంలో విజిబిలిటీ మెరుగ్గా ఉండాలి. కాబట్టి కారు వైపర్లను సరిగ్గా నిర్వహించాలి. ఈ కాలంలో విండ్‌షీల్డ్‌పై సరైన శ్రద్ధ చూపకపోతే, కొత్త విండ్‌షీల్డ్‌ కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, December 22, 2023, 15:12 [IST]
English summary
Important tips for car windshield wiper care in winter season
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+