వేసవిలో ఈ జాగ్రత్తలు లేని ప్రయాణం ప్రమాదకరం.. తప్పనిసరిగా ఇవి పాటించండి.!!
వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్యాక్టరీలు, బిల్టింగుల్లో తరచూ ఫైర్ యాక్సిడెట్లు చోటుచేసుకోవడం చూస్తూనే ఉంటాం. ఇదిలా ఉండగా ఈ కాలంలో వాహనాల్లో సడెన్‌గా మంటలు రావడం, పొగలు వ్యాపించడం చూస్తూ ఉంటాం. అందుకే వాహన యజమానులు వేసవిలో చాలా అప్రమత్తంగా ఉండాలి.
సమ్మర్‌లో ముఖ్యంగా కార్లలో ఇంజిన్‌లో మంటలు ఎగిసిపడటం, బ్యాటరీ కాలిపోయి పొగలు వ్యాపించడం జరుగుతుంటాయి. ఇక ఎక్కువగా బైక్‌ల టైర్లు పేలిపోవడం, సడెన్‌గా ఇంజిన్‌లో మంటలు వ్యాపిస్తుంటాయి. వేసవిలో ఇలాంటి ఘటనలు తలెత్తకుండా వాహనదారులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే..

ఇంజిన్ కూలింగ్: వేసవిలో వాహనాల ప్రమాదాలకు చాలా కారణాలుంటాయని ఆటో నిపుణులు చెబుతున్నారు. అందుకే వాహనాల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా కారు యజమానులు.. రేడియేటర్‌లో నీరు తగ్గకుండా చూసుకోవాలని అంటున్నారు. ఒకవేళ మీ కారు ఇంజిన్‌లో కూలింగ్ లెవెల్ తక్కువగా ఉంటే డిస్టిల్ వాటర్‌తో సరిచేసుకోవాలి.
ఓవర్ హీట్: ఒకవేళ కారు ఇంజిన్‌లో ఓవర్ హీట్ అయితే లీకేజీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఎదురైతే కూలెంట్ లేకేజీ సమస్య ఉందా అని పరిశీలించుకోవాలి. అప్పుడు మెకానిక్‌ను సంప్రదించి మరమ్మతులు చేయించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కారులో ఇంజిన్ ఆయిల్ సరిపడా ఉండేలా చూసుకోవాలి. ఆయిల్ తక్కువైతే ఇంజిన్ వేడెక్కుతుంది. ఓవర్ హీట్ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

టైర్ కండిషన్: మీరు కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లేటప్పుడు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం కారు టైర్లు. మెకానిక్ నిపుణుల మేరకు ఎప్పుడూ టైర్లలో గాలి ఉండేలా చూసుకోవాలి. టైర్ల కండిషన్ కూడా సరిచూసుకోవాలి. టైర్ల కండిషన్ సరిగా లేకుండా వాటిని మార్చి కొత్త టైర్లు వేయించడం ఉత్తమమైన పని.
బ్యాటరీ: వేసవిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కార్లకు లైట్లు, హారన్లు, ఇతర పరికరాలను అమర్చుకోవడానికి ప్రయత్నిచకండి. ఎందుకంటే కంపెనీ తమ కార్లలో అమర్చే లైట్లు వైర్లకు అనుకూలంగా ఉంటాయి. మీరు ఆఫ్టర్ మార్కెట్ ద్వారా ఎలక్ట్రానిక్ పరికరాలను అమర్చినట్లయితే ఆ వైర్లలో నాణ్యత ఉండకపోవచ్చు. తద్వారా బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి అగ్ని ప్రమాదాలు జరగొచ్చు.

కండిషన్: కారును యజమానులు నిత్యం కండిషన్‌లో ఉండేలా చూసుకోవాలి. కారును బయటకు తీసేముందు ఇంజిన్ ఆయిల్, కూలెంట్‌ను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. షోరూంలలోనే ఎక్కువగా సాధారణ చెకప్‌లు చేయించుకోండి. వాహనం సరైన కండిషన్‌లో ఉందని నిర్ధారణకు వస్తే లాంగ్ డ్రైవ్‌ను సురక్షితంగా చేయవచ్చు.
వేసవిలో మీ వాహనాల్లో ఏ చిన్న సమస్యలు ఎదురైనా వెంటనే మెకానిక్‌ను సంప్రదించండి. ప్రధానంగా లీకేజీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సాధ్యమైనంత వరకూ మీ టూ వీలర్లలో ఫుల్ ట్యాంక్ చేయించకుండా ఉండేలా చూసుకోండి. బంకుల్లో పెట్రోల్ కొట్టించుకునే ముందు మాత్రమే ఫ్యూయెల్ ట్యాంక్ మూత తీసి ఉంచండి. ముందే తీసి ఉంచితే ఆ వాతావరణంలో వాహనాలు పేలిపోయే ప్రమాదం ఉంటుంది.
లూబ్రికేషన్: ఈ కాలంలో మీ బైక్ లేదా స్కూటర్ చైనుకు తరచూ లూబ్రికేషన్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకు కారణం మీరు ఎండలో మీ టూ వీలర్‌ను పార్క్ చేసినట్లయితే చైన్ వేడెక్కుతుంది. అందుకే తరచూ లూబ్రికేషన్ చేయించాలని ఆటో నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా మీరు ప్రీమియం బైక్‌ను కలిగి ఉన్నట్లయితే కూలెంట్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి.
సమ్మర్‌లో మీ బైక్ లేదా స్కూటర్ పెట్రోల్ ట్యాంక్‌పై నిత్యం కవర్‌ను కప్పి ఉంచాలి. సాధ్యమైనంత వరకూ మీ వాహనాన్ని నీడలో పార్క్ చేయడానికే ప్రయత్నించండి. టైర్ సామర్థ్యాన్ని బట్టి గాలిని నింపుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ కాలంలో మీరు టూ వీలర్‌పై దూర ప్రయాణాలను నియంత్రించడం ఉత్తమమని ఆటో నిపుణులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications








