మీ కారు విండ్‌షీల్డ్‌పై తరచూ పగుళ్లు ఏర్పడుతున్నాయా.. ఈ టిప్స్‌తో చెక్ పెట్టండి ఇలా.!!
కారు కొన్న తర్వాత.. ముఖ్యంగా దాని మెయింటెనెన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే తర్వాత రిపేర్లకు వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా కారు విండ్(Car Windshield Cracks) షీల్డ్.. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా కారు విండ్‌షీల్డ్‌కి పగుళ్లు ఏర్పడుతుంటాయి. అయితే ఈ పగుళ్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
సాధారణంగా కారు విండ్‌షీల్డ్‌పై పగుళ్లు మొదట చాలా చిన్నవిగా ఉంటాయి. ఇవి కనపడవు. రోజులు గడిచేకొద్దీ అవి విస్తరిస్తాయి. అయితే దీనిని నిర్లక్ష్యం చేయకూడదని అంటున్నారు ఆటో నిపుణులు. మొదట్లో చిన్నగా ఏర్పడి.. తర్వాత అది పెద్దదిగా విస్తరించి చివరికి పగిలిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితి రాకుండా కొన్ని చిట్కాలు పాటించాలి.

Superglue: సూపర్‌గ్లూ ఇప్పుడు మార్కెట్లో విస్తృతంగా అందుబాటులో ఉంది. పగిలిన వస్తువులను త్వరగా అతికించడానికి ఈ సూపర్‌గ్లూలు బాగా పనిచేస్తాయి. పగిలిన విండ్‌షీల్డ్‌పై సూపర్‌గ్లూని ఉపయోగించడం వల్ల పగుళ్లు మరింతగా విస్తరించకుండా చూస్తుంది. ముందుగా విండ్ షీల్డ్‌పై పగుళ్లు వచ్చిన ప్రదేశాన్ని ఆల్కహాల్, గ్లాస్ క్లీనర్లు లేదా సబ్బు నీటితో శుభ్రం చేసి పూర్తిగా ఆరబెట్టండి. ఇలా చేయడం ద్వారా, సూపర్‌గ్లూ మెరుగైన సీల్‌గా బాగా పని చేస్తుంది.
Nail Polish: సూపర్‌గ్లూ మాదిరిగా పనిచేసే మరో పదార్ధం నెయిల్ పాలిష్‌లు. విండ్‌షీల్డ్ పగుళ్లను నివారించడం కోసం కలర్‌లెస్ నెయిల్ పాలిష్‌లను ఉపయోగించాలి. ఇవి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. పగుళ్లపై దీనిని వాడటం ద్వారా అవి అతక్కుపోతాయి. దీని ద్వారా పగుళ్లు మరింత విస్తరించకుండా ఉంటుంది.

Windshield Repair Kit: మార్కెట్లో ఈ కిట్ అందుబాటులో ఉంటుంది. దీనిని పంక్చర్ కిట్ లాగా ఉపయోగించవచ్చు. సరసమైన ధర నుండి అధిక ధర వరకు దొరుకుతాయి. మీరు చాలా చౌకైన కిట్‌ను కొనుగోలు చేయడం కంటే.. న్యూట్రల్ కిట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందుతారు.
గ్లాస్ రిపేర్ స్పెషలిస్ట్‌లను సంప్రదించండి: కారు విండ్‌షీల్డ్ పగుళ్ల సమస్యను పరిష్కరించడానికి మీకు సమయం లేకపోతే.. గ్లాస్ రిపేర్ స్పెషలిస్టులను సంప్రదించండి. దీనిని వారు పర్ఫెక్ట్‌గా పూర్తి చేస్తారు. దీనిని కొంత ఖర్చు అవుతుంది. డబ్బు ఆదా చేయాలనుకుంటే మీరే స్వయంగా రిపేర్ చేసుకోవడం బెటర్.

ఎండలో పగిలిన విండ్‌షీల్డ్‌తో కారును పార్క్ చేయకండి: దీని ద్వారా అధిక వేడి మరింత పగుళ్లకు దారితీసే అవకాశం ఉంటుంది. ఎండ తగిలే ప్రదేశాల్లో వాహనాన్ని పార్క్ చేయకుండా నీడ ఉండే చోటు చూసుకుని పార్క్ చేయాలి. అంతే కాకుండా వీలైనంత వరకు పీక్ అవర్స్‌లో ప్రయాణానికి దూరంగా ఉండటం బెస్ట్ అంటున్నారు ఆటోమొబైల్ పరిశ్రమ నిపుణులు.
ఆ రోడ్లపై డ్రైవింగ్ వద్దు: పగిలిన విండ్‌షీల్డ్‌తో ఉన్న వాహనాన్ని ఎగుడుదిగుడుగా ఉండే రోడ్లు, గుంతల రోడ్లపై నడపడం, అధిక వేగంతో నడపడం ద్వారా.. దీంతో పగుళ్లు మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. మితిమీరిన వైబ్రేషన్స్ ద్వారా కూడా పగిలిన విండ్‌షీల్డ్ పూర్తిగా పగిలిపోయే అవకాశం ఉంది. అందుకే ఈ తరహా వాహనాలను చాలా జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది.
పైన పేర్కొన్న చిట్కాలన్నీ కూడా తేలికపాటి లేదా చిన్న పగుళ్లకు మాత్రమే వర్తిస్తాయని గమనించాలి. అయితే బాగా పగిలిన వాహనాలను ఎలాగైనా నడపవచ్చని మీరు అనుకుంటే ఈ చిట్కాలను పాటించవచ్చు. భారీగా పగిలిన విండ్‌షీల్డ్ ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుందో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా అవసరమని గుర్తుంచుకోవాలి.


Click it and Unblock the Notifications








