మీ ఫోన్‌లో ఈ యాప్ ఉంటే చాలు డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు!

Written By:

వాహనాలకు సంభందించిన పత్రాలు మనతో పాటు తీసుకెళ్లడానికి ఎంతో ఇబ్బందిపడుతుంటాం. ట్రాఫిక్ పోలీసులు కూడా మన వాహనాలకు సంభందించిన పత్రాలు అన్నింటిని కూడా మన వెంట ఉంచుకోవాలని తెలిజేస్తుంటారు. కార్లు మరియు బైకుల్లో వీటిని తప్పనిసరిగా ఉంచుకోవాలి, అయితే వాటిని చాలా సందర్భాల్లో మనం ఎక్కువగా మరిచిపోతుంటాం.

లైసెన్స్, ఆర్‌సి బుక్ చేతిలో లేకుండా వాహనాలు నడపవచ్చు

ఇక టూవీలర్లు వినియోగించే వారు అయితే ఎన్నో సార్లు తమ పత్రాలను తీసుకెళ్లినపుడు జాగ్రత్తగా ఉండాలి. వర్షం వచ్చినపుడు, సర్వీసింగ్ చేయించినపుడు వాహనాలకు సంభందించిన పత్రాలు తడిచిపోతుంటాయి. ఇలాంటి కారణాల వలన ఎన్నో సార్లు జిరాక్సులు చేయించుకుంటుంటారు. అయితే ఇలాంటి సమస్యలకు చరమగీతం పాడుతూ భారత ప్రభుత్వం కొత్త విధాన్ని అందుబాటులోకి తెచ్చింది.

లైసెన్స్, ఆర్‌సి బుక్ చేతిలో లేకుండా వాహనాలు నడపవచ్చు

ప్రధాన మంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డిజిటల్ ఇండియాలో మరో మైలు రాయి ఈ డిజి లాకర్. ఇప్పుడు వాహన రంగానికి చెందిన రిజిస్ట్రేషన్, లైసెన్స్, ఇన్సూరెన్స్, ఉద్గార పరీక్షలు, వంటి అనేక పత్రాలను ఇక మీదట తమ వెంట తీసుకెళ్లకుండా డిజి లాకర్‌లోభద్రత పరుచుకోవచ్చు.

లైసెన్స్, ఆర్‌సి బుక్ చేతిలో లేకుండా వాహనాలు నడపవచ్చు

రవాణా మరియు జాతీయ రహదారుల రవాణా మంత్రిత్వ శాఖతో డిజిలాకర్ భాగస్వామ్యమై ఉంటుంది. తద్వారా వాహనదారులకు సంభందించిన రిజిస్ట్రేషన్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలను మొబైల్ యాప్‌లో భద్రపరుచుకోవచ్చు.

లైసెన్స్, ఆర్‌సి బుక్ చేతిలో లేకుండా వాహనాలు నడపవచ్చు

మీరు డిజి లాకర్ ద్వారా భద్రపరుచుకునే పత్రాలను ఆ యా రాష్ట్రాలకు సంభందించిన పోలీస్ మరియు ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేకించిన యాప్ ద్వారా వీటిని వెరిఫై చేసి ఆమోదిస్తారు.

లైసెన్స్, ఆర్‌సి బుక్ చేతిలో లేకుండా వాహనాలు నడపవచ్చు

ఒక్క సారి సంభందిత అధికారుల నుండి ఆమోదం పొందిన తరువాత భౌతిక రూపంలో ఉన్న లైసెన్స్ మరియు వాహనం యొక్క రిజిస్ట్రేషన్ పత్రాలను మీ వెంట తీసుకెళ్లనవసరం లేదు.

లైసెన్స్, ఆర్‌సి బుక్ చేతిలో లేకుండా వాహనాలు నడపవచ్చు

అత్యంత సులభమైన ఈ పద్దతి ఫాలో అవడానికి చేయాల్సిందల్లా, ముందుగా మీరు డిజి లాకర్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను డౌన్ లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.

లైసెన్స్, ఆర్‌సి బుక్ చేతిలో లేకుండా వాహనాలు నడపవచ్చు

తరువాత ఆ అప్లికేషన్‌లో మీ మొబైల్ నెంబర్ ద్వారా సైన్ ఇన్ అయి వన్ టైమ్ పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవ్వచ్చు.

లైసెన్స్, ఆర్‌సి బుక్ చేతిలో లేకుండా వాహనాలు నడపవచ్చు

ఆధార్ వివరాలు నమోదు చేసి మీ పత్రాలను అప్ లోడ్ చేసి వాటికి పేర్లు ఇవ్వచ్చు. ఆ తర్వాత వాటంతట అవే ఇ-డ్యాక్యుమెంట్స్‌గా రూపాంతరం చెందుతాయి.

లైసెన్స్, ఆర్‌సి బుక్ చేతిలో లేకుండా వాహనాలు నడపవచ్చు

అలా ఈ-డాక్యుమెంట్స్‌గా రూపాంతరం చెందిన డ్రైవింగ్ లైసెన్స్ మరియు వెహికల్ రిజిస్ట్రేషన్ పత్రాలను మీరు ట్రాఫిక్ పోలీసులు ఆపినపుడు చూపించవచ్చు.

లైసెన్స్, ఆర్‌సి బుక్ చేతిలో లేకుండా వాహనాలు నడపవచ్చు

అయితే ఆ యా రంగానికి చెందిన ప్రభుత్వాధికారులు వీటిని గమనించే అవకాశం ఉంటుంది. అందుకోసం వారి వెర్షన్‌లోప్రత్యేక మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంటుంది. ఆ యాప్ ద్వారా జరిమానాలు కూడా విధిస్తారు.

లైసెన్స్, ఆర్‌సి బుక్ చేతిలో లేకుండా వాహనాలు నడపవచ్చు

పేపర్ వినియోగాన్ని తగ్గిస్తూ మరియు అన్ని పత్రాలు ఉన్నా కూడా మరిచిపోవడ వలన జరిమానాలు చెల్లించే వాహన చోదకులు ఉన్నారు, ఇలాంటి వారికి ఉపయుక్తంగా ఉంటే ఈ డిజి లాకర్ ఎంతో సులభంగా ఉందని వాహనా చోదకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

English summary
India Government Launches Digilocker App To Carry Driving License
Please Wait while comments are loading...

Latest Photos