కొత్త కారు కొంటున్నారా..? ముందు మీరు ఈ కీలక విషయాలను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి
సొంత కారును కలిగి ఉండటం చాలా మంది కల. మొన్నటి వరకు ఇంటికి ఒక టూవీలర్ ఉండటం కనిపించేది. కానీ ఇప్పుడు ప్రజల ఆదాయ స్థితుల్లో కొంత మార్పులు రావడంతో కారును కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ధనవంతుల దగ్గర మాత్రమే కాకుండా ప్రస్తుతం మధ్యతరగతి ప్రజల ఇళ్లలో కూడా కార్లు ఉంటున్నాయి. కుటుంబ ప్రయాణాలకు ప్రాధాన్యత పెరగడం, నలుగురు కుటుంబ సభ్యులు కలిసి టూవీలర్లలో ప్రయాణించడానికి వీలు లేకపోవడంతో కార్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో వీటి సేల్స్ ప్రతి ఏడాది కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే కొత్త కారును కొనుగోలు చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అవసరానికి తగ్గట్టుగా, మీ వద్ద ఉన్న బడ్జెకు అనుగుణంగా కారును ఎంచుకోవాలి. కారును కొనుగోలు చేయడం అనేది చాలా బాధ్యతలతో కూడుకుంది.
బడ్జెట్: మొదటగా కారును కొనుగోలు చేయాలని ఆలోచన చేసినప్పుడు కచ్చితంగా మీ వద్ద అందుకు తగ్గట్టు బడ్జెట్ అందుబాటులో ఉంచుకోవాలి. బడ్జెట్ ఎంత ఉందో ఆ ధరలో లభించే కారును ఎంచుకోవాలి. మార్కెట్లో ప్రస్తుతం వాహన తయారీ కంపెనీలు వరుస బెట్టి కార్లను విడుదల చేస్తున్నాయి. వీటిలో బడ్జెట్‌కు అనుగుణంగా మోడల్‌ను ఎంచుకోవాలి. ధర వివరాలను ముందుగా షోరూమ్‌లో సంప్రదించి తెలుసుకోవాలి. ఏమైనా ఆఫర్స్ ఉన్నట్లయితే వాటిని సద్వినియోగం చేసుకోవాలి.

సేఫ్టీ: కారును కొనుగోలు చేయడం అంటే బాధ్యతతో కూడుకుంది. దేశంలో కారు ప్రమాదాల కారణంగా చాలా మంది చనిపోతున్నారు. అందుకే ఆకస్మాత్తుగా అనుకోకుండా జరిగిన ప్రమాదంలో లోపల కూర్చున్న ప్రయాణికుల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. మంచి సేఫ్టీ ప్రమాణాలను కలిగిన కారును ఎంచుకోవడం అత్యంత ముఖ్యం. ఇటీవల కార్లను క్రాష్ టెస్ట్ చేస్తున్నారు. వీటిలో మెరుగైన రేటింగ్ సాధించిన వాటిని ఎంచుకోవడం ఉత్తమం. దీంతో సురక్షితమైన ప్రయాణానికి వీలవుతుంది.
కారు మోడల్: కారును కొనుగోలు చేసే ముందు మీకు మీ కుటుంబ అవసరానికి అనుగుణంగా మోడల్‌ను ఎంచుకోవాలి. ముఖ్యంగా చిన్న కుటుంబానికి హ్యాచ్‌బ్యాక్, లేదంటే SUVలు, సెడాన్‌లు, ఎంపీవీలు మార్కెట్లో చాలా మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మీకు అవసరయ్యే దాన్ని నచ్చిన కలర్ వేరియంట్‌లో కొనుగోలు చేయచ్చు. కారు లోపల అధునాతన ఫీచర్లు ఉండటం అవసరం. ఎందుకంటే ఇవి లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా ప్రయాణికులు, డ్రైవర్‌కు సహాయకరంగా ఉంటాయి.

టెస్ట్ డ్రైవ్: కారు మోడల్‌ను ఎంచుకున్న తర్వాత షోరూమ్ వద్దకు వెళ్లి టెస్ట్ డ్రైవింగ్ చేయడం కూడా చాలా అవసరం. ఎందుకంటే కారులో ఉన్న ఫీచర్లు, దాని పనితీరు గురించి ముందే తెలిసినప్పటికి కూడా కారును ఒకసారి రోడ్డుపై రైడ్ చేసినట్లయితే ప్రాక్టికల్‌గా కారుపై అవగాహనకు రావడానికి వీలవుతుంది. టెస్ట్‌లో మీకు సౌకర్యంగా, మీ అవసరాలను ఉపయోగకరంగా ఉంటుందని అనిపించినప్పుడు ఆ మోడల్‌ను కొనుగోలు చేయడం ఉత్తమం.
కొత్త కారును కొనుగోలు చేసే ముందు పై ముఖ్యమైన విషయాలు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. మరో విషయం ఏమిటంటే కారును కొనే సమయంలో ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. దీని వల్ల ప్రమాదాల తర్వాత కారు యజమానులకు, భద్రత, మరింత ఆర్థిక భరోసా లభిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








