భారత్‌లో కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేందుకు చిట్కాలు
గతంలో సమాజంలోని ధనిక ప్రజలు సాంప్రదాయ విధానం ద్వారా కారును కొనుగోలు చేసేవారు. ఆ తర్వాత కాల క్రమంలో జరిగిన సామాజిక మార్పులు, పారిశ్రామిక విప్లవం, ఉద్యోగాల పెరుగుల తదితర అంశాలతో సాధారణ వ్యక్తులు కూడా ఇప్పుడు కార్లను కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు శక్తి పెరగడంతో, రానున్న రోజుల్లో భారతీయ రోడ్లపై మరిన్ని కార్లను మనం చూసే అవకాశం ఉంది.
కాలగమనంలో ఒకప్పుడు విలాసంగా ఉన్న కారు నేడు అవసరంగా మారిపోయింది. ఇప్పుడు సాధారణ వ్యక్తి కారులో రోజూ ఆఫీసుకు వెళ్తాడు. గడచిన కొద్ది దశాబ్ధాలుగా గమనిస్తే, నాలుగు చక్ర వాహనాల విక్రయం గణనీయంగా పెరిగింది. అయితే, నాణేనికి రెండు ముఖాలు ఉన్నట్లుగా, ఓవైపు కార్ల ద్వారా ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వీటి వలన దష్ప్రయోజనాలు కూడా లేకపోలేదు.
నేటి ఆధునిక యుగంలో ప్రమాదాలు (యాక్సిడెంట్స్) సర్వసాధారణం అయిపోయాయి. ఇంకా దొంగతనాలు, కార్లను దుర్వినియోగం చేయటం వంటి అంశాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. అందరూ లక్కీ అని చెప్పడానికి లేదు, ఎందుకంటే, సేఫ్టీ విషయంలో జీవితాంతపు గ్యారంటీ లేదు కాబట్టి. ప్రమాదాలనేవి ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సమయంలోనైనా జరగవచ్చు. రోడ్డుపై నడవడమంటే, ప్రమాదపు అంచున నడవటమే. రోడ్డుపై ప్రమాదం ఎల్లప్పుడూ పొంచి ఉంటుంది.
మరి ఇందుకు పరిష్కారం ఏంటి? తెలుసుకుందాం రండి!

పరిష్కారం
ఇందుకు చక్కటి పరిష్కారం మీ వాహనాన్ని ఇన్సూర్ చేయించడమే. ఇలా చేయటం వలన రిస్క్ నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఈ రిస్క్ రకాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
* మీ వాహనాన్ని నాశనం చేసే కార్ యాక్సిడెంట్
* మీకు హాని కలిగించే రోడ్డు ప్రమాదం
* రోడ్డుపై మీ కారు వేరొక వాహనాన్ని ఢీకొట్టి, ఆ వాహనాన్ని డ్యామేజ్ చేస్తే
* మీ కారు వలన ఇతర వాహన డ్రైవర్, ప్యాసింజర్ల లేదా పాదచారులు గాయపడితే
* బాధితుడు (గాయపడిన థర్డ్ పార్టీ) మీపై చట్టపరమైన చర్య తీసుకుంటే
* మీ కారు వలన జరిగిన ప్రమాదంలో ఇతర వాహన డ్రైవర్, ప్యాసింజర్ల లేదా పాదచారులు మరణిస్తే
* మీ కారు దొంగిలించబడితే
* మీ కారుకు ఖరీదైన రిపేర్లు చేయాల్సి వస్తే
* మీ కారుపై చెట్టు విరిగి పడి, డ్యామేజ్ అయితే
* మీ కారు అగ్ని ప్రమాదానికి గురైతే
* మరిన్ని..
పైన తెలిపిన సమస్యల(రిస్క్)న్నింటికీ ఒక్కటే పరిష్కారం. అదే, చక్కటి కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయటం. మీరు హ్యాండిల్ చేయటానికి క్లిష్టమైన అత్యవసర పరిస్థితులను ఈ కార్ ఇన్సూరెన్స్ పాలసీనే చూసుకుంటుంది.

కార్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
సాంకేతికంగా చెప్పాలంటే, కార్ ఇన్సూరెన్స్ అనేది వాహన యజమాని ద్వారా ఎదుర్కొన్ని కొన్ని రకాల అత్యవసర పరిస్థితులకు / సంఘటనలకు బీమా కంపెనీ పరిహారాన్ని చెల్లించేలా, వాహన యజమానికి మరియు కార్ ఇన్సూరెన్ కంపెనీకు మధ్య కుదిరే ఒప్పందమే కార్ ఇన్సూరెన్స్. ఇక్కడ వాహన యజమాని భవిష్యత్తులో పరిహారం కోసం క్లెయిమ్ చేయాలంటే, సదరు వాహన యజమాని క్రమం తప్పకుండా నిర్ధేశిత మొత్తాన్ని బీమా కంపెనీకు చెల్లించాల్సి ఉంటుంది.

కార్ ఇన్సూరెన్స్ కొనడానికి ప్రధాన కారణాలేంటి?
భారత్‌లో కార్ ఇన్సూరెన్స్ కొనడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి:
* చట్ట ప్రకారం ఇది తప్పనిసరి.
* మానవ తప్పిదాలు, ప్రకృతి భీభత్సాల వలన సంభవించే అనేక రకాల అత్యవసర పరిస్థితుల నుంచి వాహనాన్ని, వాహన యజమానులను ఇది రక్షిస్తుంది.
చట్టపరమైన అభ్యంతరం
భారతదేశంలో వాహన బీమా తప్పనిసరి. మోటార్ వాహన చట్టం 1988 ప్రకారం, భారతదేశంలోవి వాహన యజమానులందరూ వాహన బీమా పాలసీని కలిగి ఉండాలి. ఈ నేపథ్యంలో, వాహన బీమాను కొనుగోలు చేయటానికి ముందు, ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయని, వాటిలో చట్ట ప్రకారం దేనిని కొనుగోలు చేయాలనే అంశాలను మీరు తెలుసుకోవాలి.

భారతదేశంలో వాహన బీమాను రెండు రకాలు వర్గీకరించారు, అవి:
1. థర్డ్ పార్టీ లయబలిటీ ఇన్సూరెన్స్
2. కాంపర్‌హెన్సివ్ కార్ ఇన్సూరెన్స్
1. థర్డ్ పార్టీ లయబలిటీ ఇన్సూరెన్స్:
మీ కారు వలన యాక్సిడెంట్ జరిగినప్పుడు ధర్డ్ పార్టీకి శారీరకంగా దెబ్బ తగిలినా, మరణించినా లేదా వారి ప్రాపర్టీకి నష్టం వాటిళ్లినా అందువల్ల ఎదురయ్యే చట్టపరమైన ఇబ్బందులు, ఆర్థిక నష్టాల నుంచి వాహన యజమానిని థర్డ్ పార్టీ లయబలిటీ ఇన్సూరెన్స్ కాపాడుతుంది.

2. కాంపర్‌హెన్సివ్ కార్ ఇన్సూరెన్స్:
ఇందులో థర్డ్ పార్టీ లయబలిటీ ఇన్సూరెన్స్‌లోని ప్రయోజనాలు, కవరేజ్‌లతో పాటుగా మరిన్ని అదనపు రిస్కులు కవర్ అవుతాయి. ప్రకృతి విపత్తులు, మానవ తప్పిదాల వలన మీ వాహనానికి వాటిళ్లే డ్యామేజ్‌కు అయ్యే ఖర్చును మీరు భరించాల్సిన అవసరం లేకుండా కాంపర్‌హెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని రక్షిస్తుంది.
చట్టపరమైన అభ్యంతరాలను పూర్తి చేయటానికి వాహన యజమాని థర్డ్ పార్టీ లయబిలిటీ ప్లాన్‌ను కొనుగోలు చేయటం తప్పనిసరి, దీనినే తప్పనిసరి ప్లాన్ (మ్యాన్‌డేటరీ ప్లాన్) అని కూడా అంటారు.

థర్డ్ పార్టీ ప్లాన్ ఎందుకు కొనాలి? తప్పించుకోవటానికి ఏదైనా మార్గం ఉందా?
చట్ట ప్రకారం ఇది తప్పనిసరి కాబట్టి, వాహన యజమానులు ఎట్టి పరిస్థితుల్లోను ఈ పాలసీని కొనుగోలు చేసి తీరాల్సిందే. దీనిని నుంచి తప్పించుకునే మార్గమే లేదు. ఒకవేలా చేసినట్లనయితే, చట్ట ప్రకారం విధించే జరిమానాలు, శిక్షలకు మీరు అర్హులు అవుతారు. భారతదేశంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా కారు నడపటం నేరం, అలా చేస్తే మీరు క్రింది శిక్షలు అనుభవించే అవకాశం ఉంటుంది:
* భారీ జరిమానా (మోటార్ వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం)
* జైలు శిక్ష (యాక్సిడెంట్ తీవ్రతను బట్టి, అవతలి వారు పెట్టే కేసును బట్టి)

థర్డ్ పార్టీ లయబిలిటీ ప్లాన్ కొనుగోలు చేయటానికి మరొక కారణం ఏంటంటే, మీ కారు వలన థర్డ్ పార్టీ ఆస్తికి తీవ్ర నష్టం వాటిళ్లనట్లయితే, సదరు థర్డ్ పార్టీ మీపై తీసుకునే చట్టపరమైన చర్యల నుంచి మీరు దూరంగా ఉండొచ్చు. ఉదాహరణకు, మీ కారుతో యాక్సిడెంట్ చేయటం వల్ల థర్డ్ పార్టీ కారుకి తీవ్ర నష్టం సంభవిస్తే, ఆ నష్టాన్ని చెల్లించాల్సిందిగా సదరు కారు యజమాని మిమ్మల్ని కోరటం, అలా చేయటంలో మీరు విఫలమైనట్లయితే మీపై అతను చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతుంది.

ఇన్సూరెన్స్ కంపెనీ పాత్ర:
మీరు క్రమం తప్పుకుండా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం చెల్లిస్తారు కాబట్టి, ఈ అత్యవసర పరిస్థితులను సదరు కంపెనీయే చూసుకుంటుంది. మీ కారుతో గుద్దడం వలన థర్డ్ పార్టీ కారు డ్యామేజ్ అయ్యి, దాని రిపేరుకు అయ్యే ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీనే భరిస్తుంది. ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లో పేర్కొన్న నియమ నిబంధనలకు లోబడి పరిహారం చెల్లించడం జరుగుతుంది. కాబట్టి, ఇది మిమ్మల్ని ఆర్థికంగా, చట్టపరంగా ఆదుకుంటుంది.

కాంపర్‌హెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎందుకు కొనాలి? తప్పించుకునే మార్గం ఏదైనా ఉందా?
ఇది ఎలాంటి కారు యజమానికైనా అత్యంత విలువైన ప్లాన్. ఇది రోడ్డుపై వెళ్తున్నప్పుడ జరిగే ప్రమాదాలకే కాకుండా, స్థిరంగా ఉన్నప్పుడు సంభవించే ప్రమాదాలకు కవరేజ్‌ను అందిస్తుంది. ఇందులో అనేక రకాల రిస్క్ కవరేజీలుంటాయి.
ఉదాహరణకు.. రోడ్డుపై మీరు ఓ ప్రమాదాన్ని ఎదుర్కున్నారనుకుందాం. ఈ ప్రమాదంలో కారు బాగా దెబ్బతినడంతో పాటుగా మీకు తక్షణ వైద్య సాయం అవసరమైందనుకోండి, ఈ మొత్తం విధానానికి (కారు రిపేరుకు, వైద్య చికిత్సకు) భారీగా ఖర్చు అవుతుంది. మరి ఈ ఖర్చు నుండి బయటపడటం ఎలా?

ఇన్సూరెన్స్ కంపెనీ పాత్ర:
మీ కారును సమీపంలోని గ్యారేజ్ వద్ద రిపేర్ చేయించి, బిల్లుల మరియు రికార్డులను జాగ్రత్త ఉంచుకోండి. అలాగే మీ వైద్య చికిత్స కోసం అయిన బిల్లులు, రికార్డులను కూడా భద్రపరచుకొని క్లెయిమ్ చేయండి. అనంతరం బీమా కంపెనీ కారు రిపేరుకు, మీ వైద్య చికిత్సకు, ఆస్పత్రి ఖర్చులకు, మందులకు అయ్యే అన్ని ఖర్చులను తిరిగి చెల్లిస్తుంది.

బోనస్
ఒకవేళ మీ చేతిలో డబ్బులు లేకుండా ఉండి, అత్యవసరంగా ఆస్పత్రి ఖర్చులకో లేక కారు రిపేరుకో డబ్బులు అవసరమైన, ఇన్సూరెన్స్ కంపెనీ మీకు సాయం చేస్తుంది. ఈ సౌకర్యాన్నే నగదు రహిత సేవలు (క్యాష్‌లెస్ సర్వీస్) అని అంటారు. ఈ సేవల్లో భాగంగా బీమా కంపెనీ లిస్ట్ చేయబడే గ్యారేజ్‌లలో మీ కారును డబ్బు చెల్లించకుండానే రిపేర్ చేయించుకోవచ్చు. అలాగే లిస్టెడ్ ఆస్పత్రులలో నగదు రహిత చికిత్సను పొందవచ్చు. ఈ లిస్టెడ్ గ్యారేజ్‌లు ఆస్పత్రులు ఇన్సూరెన్స్ ప్లాన్‌లో పేర్కొన్న నియమ నిబంధనలకు లోబడిన సర్వీసుల కోసం మిమ్మల్ని డబ్బు అడగవు. ఈ బిల్లులను ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా సెటిల్ చేయబడుతాయి.

ఇతర ప్రయోజనాలు
మానవ తప్పిదాలు, ప్రకృతి విపత్తుల వలన సంభవించే అనేక రకాల రిస్కుల నుంచి ఈ కాంపర్‌హెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ మీ కారును అలాగే మిమ్మల్ని రక్షిస్తుంది.

ప్రకృతి విపత్తులు
అగ్నిప్రమాదం, వరదలు, పేలుడు, తుఫాను, స్వీయ జలనం, మెరుపు తాకిడి, కొండ చెరియలు విరిగి పడటం, స్టోర్మ్, సైక్లోన్, ఫ్రోస్ట్, హారికేన్, ల్యాండ్ స్లైడ్, టెంపెస్ట్ మొదలైనవి.

మానవ తప్పిదాలు
దొంగతనం, దోపిడి, అల్లర్లు, మోసపూరిత చర్య, తీవ్రవాద చర్య, స్ట్రైక్, బాహ్య అంశాల వల్ల జరిగే ప్రమాదాలు మొదలైనవి.


Click it and Unblock the Notifications








