కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ విషయాలు అస్సలు మరిచిపోకండి.. అవేంటంటే.!!
కారు డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డు భద్రత చాలా ముఖ్యం. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఏకాగ్రతగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా డ్రైవింగ్‌లో తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలి. ఈ క్రమంలో సేఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలను ఇక్కడ మీకు అందిస్తున్నాం.
అప్రమత్తంగా ఉండాలి: కారు డ్రైవింగ్ చేసేటప్పుడు మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చే పోయే వాహనాలపై అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ముందున్న రహదారిని చూస్తూ బ్లైండ్ స్పాట్‌లను తనిఖీ చేసుకోవాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు కారులో అన్ని భాగాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో కూడా గమనించాలి. దీని ద్వారా మున్ముందు పొరపాట్లు, ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చు.

బ్లైండ్ స్పాట్ తనిఖీ: కారు డ్రైవింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా బ్లైండ్ స్పాట్‌లను తనిఖీ చేసుకోవాలి. ప్రత్యేకంగా పెద్ద కార్లు నడుపుతున్నప్పుడు బ్లైండ్ స్పాట్‌లపై మరింత అవగాహన కలిగి ఉండాలి. ప్రమాదానికి కారణమయ్యే చిన్న కార్లు లేదా ఇతర వాహనాలు ఏమైనా వస్తున్నాయా అనేది బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ ద్వారా తెలుసుకోవచ్చు.
లిమిట్ స్పీడ్: రహదారిపై కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిర్దేశించిన స్పీడ్ లిమిట్‌లోనే డ్రైవింగ్ చేయడమనేది ముఖ్యమని గుర్తుంచుకోవాలి. మీరు హై స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు సౌకర్యంగా భావించకపోయినా, లేదంటే భయాందోళనకు గురవుతున్నట్లు భావించినా.. వెంటనే స్పీడ్ తగ్గించండి. ఎప్పుడైనా పరిమిత స్పీడ్‌లోనే వెళ్లడం బెటర్ అని గుర్తుంచుకోవాలి.

లేన్ నిర్వహణ: రహదారిపై సురక్షితమైన డ్రైవింగ్‌లో ముఖ్యమై భాగం ఓపికగా, మర్యాదగా డ్రైవ్ చేయగలడం. అంతే కాకుండా మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎవరైనా రోడ్డు దాటుతూ ఉంటే వాళ్ల కోసం ఖచ్చితంగా మీ కారు వేగాన్ని తగ్గించాలి. ఈ సందర్భంలో డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి.
ఇండికేటర్స్ ఉపయోగించాలి: రోడ్డుపై వెళ్లేటప్పుడు ఇండికేటర్స్‌ను ఉపయోగించే సందర్భాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు రోడ్డుపై లేన్‌లను మార్చేటప్పుడు వెనుక వచ్చే వాహనదారులను అలర్ట్ చేయడానికి సరైన ఇండికేటర్లను సరిగ్గా ఉపయోగించాలి. టర్నింగ్‌ల్లో, లేన్‌లను మార్చేటప్పుడు, పార్కింగ్ స్పాట్‌ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇండికేటర్లను ఆన్ చేయాలి.

తగినంత దూరం పాటించాలి: రహదారిపై డ్రైవ్ చేస్తున్నప్పుడు ముందూ వెనుక వచ్చే వాహనాల నుంచి సరైన దూరం పాటించాలి. ఎందుకంటే ఒక్కోసారి రోడ్డుపై వెళ్తున్నప్పుడు సడెన్ బ్రేక్ వేయాల్సి వస్తుంది. ఈ సందర్భంలో సరైన దూరం పాటించడం ద్వారా ప్రమాదాలు జరగకుండా ఉంటుంది.
కారు మెయింటెనెన్స్: సురక్షిత కారు డ్రైవింగ్ కోసం కారు ఎల్లప్పుడూ మంచి కండిషన్‌లో ఉండేలా చూసుకోవాలి. రెగ్యులర్ మెయింటెనెన్స్ ద్వారా కారు సడెన్‌గా రిపేర్లకు గురికాకుండా ఉంటుంది. దీని ద్వారా మీరు లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైవ్ చేయవచ్చు.

కారు డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు చాలా ఏకాగ్రతతలో ఉండాలి. పరధ్యానంగా డ్రైవింగ్ చేయడం అనేక ప్రమాదాలకు దారి తీస్తుంది. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ను ఉపయోగించకూడదు. రోడ్డుపై దృష్టి సారించడం చాలా ముఖ్యం. ఆటో మేకర్లు ఇప్పుడు కార్లలో అధునాతన ఫీచర్లను ప్రవేశపెట్టారు. దీని ద్వారా మీరు మొత్తం సమాచారాన్ని డిజిటల్ స్ర్కీన్‌పై పొందవచ్చు. తద్వారా డ్రైవింగ్ సులభంగా ఉంటుంది.

డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు పొగ మంచు, వర్షం వంటి ప్రతికూల పరిస్థితుల్లో కారు హెడ్‌లైట్లను తప్పనిసరిగా ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు కార్లలో భద్రతా ఫీచర్లలో ప్రధానమైనది ADAS సిస్టమ్. ఇది మంచి ఫీచర్ అయినా.. అవి పెద్దగా సహాయం చేయని సందర్భాలు ఉన్నాయి. మీ డ్రైవ్‌ను సులభతరం చేసేందుకు, మీకు డ్రైవింగ్‌లో ఒత్తిడిని తగ్గించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతున్నా.. రోడ్డుపై డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని గుర్తుంచుకోవాలి.



Click it and Unblock the Notifications








