మీ కారు ఆడియో సిస్టమ్ ఏ ప్రాబ్లమ్ లేకుండా ఎక్కువ కాలం పనిచేయాలంటే.. ఈ చిట్కాలు తప్పనిసరి.!!
కారులో లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ప్రయాణం విసుగులేకుండా ఆహ్లాదకరంగా ఉండాలని చాలా మంది అనుకుంటారు. అందుకే ప్రతి కారులో ఆడియో సిస్టమ్(Audio System) తప్పనిసరి. నచ్చిన పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ డ్రైవింగ్‌ను ఆస్వాదిస్తారు. అయితే కారులో ఇతర ఇంటీరియర్ మాదిరిగానే ఆడియో సిస్టమ్ కూడా సరిగ్గా పనిచేస్తుందా లేదా అని ఎప్పటికప్పుడు పరిశీలించాలి.
చాలా మంది ఎక్కువగా కారులో ఇతర పార్టుల పైన పెట్టిన దృష్టి ఆడియో సిస్టమ్(Car Audio System)పై పెట్టరు. కానీ ఆడియో సిస్టమ్ పనితీరును పరిశీలించడం కూడా చాలా ముఖ్యం. కొన్ని జాగ్రత్తలు, సూచనలు పాటించడం ద్వారా మీ కారు ఆడియో సిస్టమ్ ఎక్కువ కాలం మంచి కండిషన్‌లో ఉండేలా చూసుకోవచ్చు.

హెడ్ యూనిట్(Head Unit), స్పీకర్లు(Speakers), యాంప్లిఫైయర్(Amplifier)లతో సహా ఆడియో సిస్టమ్ యూనిట్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకావాలి. వీటిపైన ఉన్న దుమ్మును తొలగించడానికి సాఫ్ట్ మైక్రోఫైబర్ మాత్రమే ఉపయోగించాలి. ఇందులో కఠినంగా కెమికల్స్‌ను వాడకూడదని గమనించాలి. ఎందుకంటే అవి ఆడియో సిస్టమ్ భాగాలను దెబ్బతీసే అవకాశం ఉంది.
ఆడియో సిస్టమ్‌ను శుభ్రపరిచేటప్పుడు, కనెక్షన్స్ ఏమైనా వదులుగా ఉన్నాయా.. లేదంటే ఎక్కడైనా తుప్పు పట్టి ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఇంకా ఎక్కడైనా తేమ లాంటిది ఉందా అనేది కూడా తప్పనిసరిగా పరిశీలించారు. వీటి ద్వారా ఆడియో సిస్టమ్ యూనిట్లు త్వరగా దెబ్బతింటాయి.

కారు ఆడియో సిస్టమ్‌లో ఎక్కువ రిస్క్ ఉన్న వాటిలో స్పీకర్‌లు ఒకటి. స్పీకర్స్‌ను ఉపయోగించి ఎక్కువ సమయం పాటు హై వాల్యూమ్‌లో మ్యూజిక్ ప్లే చేయడం ద్వారా అవి త్వరగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎప్పుడైనా లో వాల్యూమ్‌లో వినేందుకు ప్రయత్నించాలి. దీని ద్వారా స్పీకర్లపై ప్రతికూల ప్రభావం ఉండదు.
అధిక టెంపరేచర్(High Temperature).. కారు పెయింటింగ్, టైర్‌లను దెబ్బతీయడమే కాకుండా కారు క్యాబిన్ యూనిట్ ఆడియో సిస్టమ్‌పై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆడియో సిస్టమ్‌లో చాలా యూనిట్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి కారు పార్క్ చేసేటప్పుడు ఎండ తగలని ప్రదేశాన్ని చూసి పార్క్ చేయడం ఉత్తమం.

కార్ ఇంజన్‌లు మరియు ఇతర యూనిట్‌లు ఎక్కువ కాలం పనిచేయడానికి రెగ్యులర్‌గా ఎలా ఉపయోగిస్తామో అదే విధంగా కారు ఆడియో సిస్టమ్ కూడా రెగ్యులర్‌గా పనిచేసేలా చూడాలి. ఇంజిన్ ఆఫ్ లేదా ఆన్ చేసినప్పుడు వోల్టేజ్ స్పైక్‌లు ఆడియో సిస్టమ్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది. అలాంటప్పుడు.. కారు ఇంజిన్‌ను ఆఫ్ చేసే ముందు ఆడియో సిస్టమ్‌ను కూడా ఆఫ్ చేయాలి.
కారు బ్యాటరీ(Car Battery)ని ఎల్లప్పుడూ మంచి కండిషన్‌లో ఉంచడం అనేది కారు మెయింటెనెన్స్‌లో కీలకం. దీని ద్వారా ఆడియో సిస్టమ్ కూడా సరిగ్గా పనిచేయడంలో సహాయపడుతుంది. బ్యాటరీ, పవర్ ద్వారా ఆడియో సిస్టమ్ పనిచేస్తుంది. కాబట్టి చెడిపోయిన కారణంగా బ్యాటరీ ఆడియో సిస్టమ్ పనిచేయకపోవచ్చు. అందుకోసం తరచుగా బ్యాటరీని కూడా తనిఖీ చేసుకోవాలి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








