చలికాలంలో కారు కేర్ చిట్కాలు.. అద్దాలపై పొగ మంచు సమస్య వేధించకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వండి.!!
చలికాలం మొదలైంది. ఈ సీజన్‌లో పొగమంచు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దీంతో రోడ్లపై వెళ్లే వాహనాదారులు సరిగ్గా రోడ్డు కనిపించక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా కారు అద్దాలపై మంచు పేరుకుపోయి ఉంటుంది. ఈక్రమంలో ప్రతిరోజూ కారు శుభ్రం చేస్తున్నా.. విండ్ షీల్డ్, డోర్ అద్దాలపై మంచు ఏర్పడుతుంది.
చలికాలంలో కార్ల యజమానులు ఉదయం నిద్ర లేవగానే కారును బయటకు తీయాలంటే ముందుగా ఏర్పడే సమస్య.. కారు అద్దాల(Fogging On Car Windshield)పై మంచు ఏర్పడటం. అయితే ఈ సమస్యను ఎలా నివారించాలి.. ఈ కాలంలో కారును ఎలా మెయింటెన్ చేయాలో చాలా మందికి తెలియదు. అందుకు సంబంధించి కొన్ని చిట్కాలను ఈ కథనంలో అందిస్తున్నాం.

అయితే మొదటగా.. కారు అద్దాల(Fogging On Car Glasses)పై మంచు నీటి బిందువులు ఎలా ఏర్పడతాయో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. రాత్రిళ్లు కారుని పార్కింగ్ స్థలంలో వదిలి, అన్ని కారు డోర్లు, విండోలను మూసివేసి సురక్షితంగా లాక్ చేస్తారు. ఈ సమయంలో కారులోపల వేడి పెరుగుతుంది.
తెల్లవారుజామున 3 గంటల సమయంలో వాతావరణం మరింత చల్లగా మారడంతో.. కారు బయట ఉష్ణోగ్రత, లోపల కంటే తక్కువగా ఉంటుంది. దీని ద్వారా కారు లోపల వేడి కూడా క్రమంగా తగ్గుతుంది. దీని ద్వారా ఈ టెంపరేచర్ల మధ్య ప్రాంతంలో మంచు నీటి బిందువులు ఏర్పడతాయి. ఇలా కారు అద్దాలపై నీటి బిందువులు ఏర్పడిన తర్వాత వాటిని తొలగించడం కాస్త కష్టంతో కూడుకున్నది.

కాగా నేడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న చాలా కార్లు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్‌తో వస్తున్నాయి. దీని ద్వారా కారును స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్‌గా సమస్యలను పరిష్కరిస్తుంది. అయితే అన్ని కార్లలోనూ ఈ సిస్టమ్ అందుబాటులో ఉండాలని లేదు. అలా ఈ సిస్టమ్ లేని కార్లలో ఈ మంచు నీటి బిందువుల సమస్యను ఎలా పరిష్కరించాలో ఇక్కడ మీకు చిట్కాలు ఇస్తున్నాం.
కారు పార్కింగ్ చేసేటప్పుడు కారులోని ఏసీని హీటర్‌గా మార్చి, విండో స్క్రీన్ ఏరియాను ఎంచుకోవాలి. అనంతరం ఏసీని స్ప్రెడ్ చేస్తే, దాని నుంచి వేడి గాలి విడుదలవుతుంది. దీని ద్వారా కారు విండ్‌షీల్డ్‌పై ఏర్పడిన నీటి బిందువులన్నీ వెంటనే ఆవిరైపోతాయి. అదే సమయంలో కారు విండోలన్నీ ఒక్కసారి దించి మళ్లీ పైకి లేపితే వాటిపై ఉన్న నీటి బిందువులన్నీ వాటిపై నుంచి తొలగిపోతాయి.
అయితే కొన్ని కార్లు రియర్ హీటర్‌ను కలిగి ఉంటాయి. దీని ద్వారా రియర్ గ్లాస్ నీటి బిందువులు కూడా తొలగిపోతాయి. కానీ చాలా కార్లలో ఈ ఆప్షన్ లేదు. అలాంటి సమయంలో ఆ కార్ల రియర్ గ్లాస్‌ను క్లాత్‌తో తుడుచుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ సమస్యలేమీ రాకుండా ఉండాలంటే అసలు కారు గ్లాసెస్‌పై నీటి బిందువులు పడకుండా చూసుకోవడం ఇంకా బెటర్.
అందుకోసం మీ కారును ఎల్లప్పుడూ పూర్తిగా మూసిఉన్న గ్యారేజ్‌లో పార్క్ చేయాలి. అక్కడ పార్క్ చేస్తే బయట చలి కారుకి తగలదు. దీని ద్వారా ఈ నీటి బిందువులు ఏర్పడకుండా కాపాడుకోవచ్చు. అయితే ఇలా అందరూ కారును గ్యారేజ్‌లో భద్రపరుచుకునే అవకాశం ఉండదు. మీరు కారును బయట పార్క్ చేయాల్సి వస్తే.. కారు లోపల నీరు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ నీరు ఉంటే తుడిచి శుభ్రం చేసి కారును లాక్ చేయాలి.
లేదంటే మార్కెట్లో డీహ్యూమిడిఫైయర్లు అందుబాటులో ఉన్నాయి. ఇది సరసమైన ధరలోనే లభిస్తాయి. డీహ్యూమిడిఫైయర్లను మీ కారులో ఉపయోగిస్తే అది కారు లోపలి భాగంలో అన్ని నీటి చుక్కలను తొలగిస్తుంది. అంతే కాకుండా షేవింగ్ క్రీమ్‌ను కారు కిటికీలకు అప్లై చేసి గుడ్డతో శుభ్రం చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా విండ్‌షీల్డ్‌పై లైట్ ఫిల్మ్ ఏర్పడుతుంది.
దీని ద్వారా గ్లాస్‌పై నీటి బిందువులను నిలబడకుండా చూస్తుంది. దీని ద్వారా మీరు కారు కిటికీలపై నీటి బిందువులు ఏర్పడకుండా నిరోధించవచ్చు. మీ కారు విండ్‌షీల్డ్‌పై నీటి బిందువులు రాకుండా ఇలా చేయవచ్చు. మంచు నీటి బిందువులు కారు అద్దాలపై పడటం ద్వారా గాజు క్వాలిటీ తగ్గుతుంది. దీని ద్వారా శీతాకాలంలో కారును మెయింటైన్ చేయడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి.


Click it and Unblock the Notifications








