మీ బైక్ లేదా కారుపై హోలీ మరకలు పోవాలంటే ఈ టిప్స్ పాటించండి..
నేడు భారత్ మొత్తం హోలీ సంబరా(Holi Celebrations)ల్లో మునిగిపోయింది. స్నేహితులు, బంధుమిత్రులు.. ఒకరిపై ఒకరు హోలీ రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడిపేస్తుంటారు. ఈ క్రమంలో ఒంటిపై ఉన్న దుస్తులు రంగులతో నిండిపోయి ఉంటాయి. అయితే ఈ సందర్భాల్లో మీ వాహనాలపై కూడా కలర్స్ పడుతుంటాయి. కానీ వాటిని తొలగించడం కొంచెం కష్టం. అందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలి.
రంగుల హోలీ సందర్భంగా వాహనాలపై మరకలు(Colour Stains on Vehicles during Holi) పడటం సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అయితే ఈ రంగులను తొలగించడం కొంచెం శ్రమతో కూడిన పని. ఇందుకోసం సున్నితమైన క్లీనింగ్ సొల్యూషన్స్, ఓపిక, చాలా అవసరం. ఇంకా సరైన తొలగింపు పద్ధతులు పాటించాలి. ఈ పండుగ సీజన్‌లో మీ వాహనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

పెయింట్ ఫినిషింగ్ జాగ్రత్త: బైక్, స్కూటర్, కారు ఇలా వాహనం ఏదైనా.. ఈ మరకలను(Remove Colour Stains on Vehicles) తొలగించడానికి ముందుగా వాహనం యొక్క పెయింట్ లేదా ఫినిషింగ్ దెబ్బతినకుండా చూసుకోవాలి. ఇందుకోసం శ్రద్ధతో సరైన టెక్నాలజీని ఉపయోగించి మరకలను శుభ్రం చేయాలి. మరకలు పడిన వెంటనే వాటిని శుభ్రం చేయాలి. ఎక్కువ కాలం అలాగే ఉంచితే తొలగించడం కష్టంగా మారుతుంది.
వాటిని ఉపయోగించకూడదు: మీ వాహనంపై కలర్స్‌ను తొలగించేందుకు కఠినమైన రసాయనాలు లేదా రాపిడి క్లీనర్లను ఉపయోగించకూడదు. తేలికపాటి కార్ వాష్ సోప్ వంటి సున్నితంగా శుభ్రపరిచే రసాయనాలను మాత్రమే వాడాలి. వీటి ద్వారా పెయింటింగ్‌కు నష్టం కలగకుండా ఉంటుంది. పెయింటింగ్‌పై పేరుకుపోయిన కలర్స్‌ను సున్నితంగా తొలగిస్తుంది.

అయితే దీనికి ముందుగా వాహనాదారులు ఓ విషయం గుర్తుంచుకోవాలి. కలర్స్(Remove Colour Stains on Cars And Bikes)ను తొలగించే ముందు మొదటగా మీ వాహనాన్ని నీటితో పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత వాష్ సోప్‌ను అప్లై చేయాలి. దీని ద్వారా మరకలు శభ్రంగా వదిలిపోతాయి. ఇంకా రంగు మరకలను శుభ్రం చేయడానికి మృదువైన గుడ్డ లేదా స్పాంజ్ ఉపయోగించాలి.
ఓపిక అవసరం: మీ వాహనంపై పడిన కలర్స్‌ను తొలగించడానికి స్క్రబ్బింగ్ ప్యాడ్‌లు లేదా బ్రష్ లాంటి వాటిని ఉపయోగించకండి. ఇలా చేస్తే పెయింట్‌పై స్క్రాచ్‌లు పడతాయి. అయితే కొన్ని కఠినమైన మరకలను తొలగించడానికి సమయం ఎక్కువగా తీసుకుంటుంది. ఇందుకోసం ఓపిక చాలా అవసరం. కొన్ని రౌండ్ల ప్రయత్నాల తర్వాత మరకలు తొలగిపోతాయి.
చివరగా మీ కారు లేదా బైక్‌పై కలర్స్ మరకలు అన్నీ తొలగిపోయిన తర్వాత.. వాహనం పెయింట్ ప్రకాశవంతంగా సురక్షితంగా మెరుస్తూ ఉండటానికి వ్యాక్స్ లేదా పాలిష్‌ను అప్లై చేయండి. దీని ద్వారా భవిష్యత్తులో ఇంకెప్పుడైనా మరకలు పడినా, ఏవైనా గీతలు పడినా నష్టం వాటిల్లకుండా ఉంటుంది. ఇలా పై చిట్కాలు పాటించడం ద్వారా హోలీకి ముందు మీ వాహనం ఎలా ఉంటుందో.. హోలీ తర్వాత కూడా అలాగే ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








